Puttaparthi News: రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అధికార వైసీపీ(YSRCP), ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం(Telugu Desam Party) అభ్యర్థుల వేటలో మునిగిపోయాయి. ఈసారి ఎలాగైనా గెలవాలని తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandra Babu) పట్టుదలగా ఉన్నారు. జిల్లాల వారీగా చంద్రబాబు షాడో బృందం చక్కర్లు కొడుతోంది. ఆయా జిల్లాలోని నియోజకవర్గాల్లో ఎలాంటి పరిస్థితులు నెలకొన్నాయి అభ్యర్థుల పనితీరు ఎలా ఉంది అన్నది ఎప్పటికప్పుడు అధినేత చంద్రబాబుకు చేరవేస్తున్నారు.
మంత్రిగా పని చేసిన పల్లె
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పుట్టపర్తి నియోజకవర్గం(Puttaparthi Constituency) ఇన్చార్జిగా మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కొనసాగుతున్నారు. పుట్టపర్తి నుంచి రెండు దఫాలుగా పల్లె రఘునాథ్ రెడ్డి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. చంద్రబాబు నాయుడు మంత్రివర్గంలో పల్లె రఘునాథ్ రెడ్డి(Palle Raghunatha Reddy) పని చేశారు. పుట్టపర్తి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి బలమైన నేతగా కొనసాగుతూ వచ్చారు.
అధికారంలో ఉన్నప్పుడు చేసిన పనులతో చేటు
2019 ఎన్నికల్లో వైసిపి అభ్యర్థి దుద్దేకుంట శ్రీధర్ రెడ్డి పై మాజీ మంత్రి పల్లె ఓటమి పాలయ్యారు. ప్రస్తుతం పల్లె రఘునాథ్ రెడ్డికి నియోజకవర్గంలో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయి. కొన్ని సామాజిక వర్గాలు ముఖ్యంగా కమ్మ,బోయ,బలిజ,వడ్డెర వర్గాలు పల్లె రఘునాథ్ రెడ్డికి సహకరించకడం లేదని టాక్. అందుకే పరిస్థితి వచ్చిందని చర్చించుకుంటున్నారు. అధికారంలో ఉన్నప్పుడు వైసిపి మండల నాయకులకు ఆయన సహకరించి ఆదుకున్నారనే ప్రచారం సాగుతోంది. అధికార పార్టీ నేతలు కార్యకర్తల కన్నా ప్రతిపక్ష నేతలనే ఎక్కువగా చూసుకునేవారని అభిప్రాయపడుతోంది కేడర్.
బీసీకి ఇచ్చే అవకాశం
ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడంతో పుట్టపర్తి నియోజకవర్గ ఇన్చార్జిగా కొనసాగుతున్న మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు. ఇదే అంశంపై చంద్రబాబుతో చర్చించినట్లు తెలుస్తోంది. అధిష్ఠానం మాత్రం అయన కొడలు వైపు మొగ్గు చూపుతున్నట్లు సమాచారము. బిసి సామాజిక వర్గాలలో సమర్థుడైన అభ్యర్థి కొసం కూడా వెతుకుతున్నారు. ఆయా వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చి ఎంపీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్నారు.
వైసీపీ నేతలు కూడా రఘునాథ రెడ్డి పోటీలో ఉంటే వెరీ హ్యాపీ అంటున్నారట. పల్లే అభ్యర్థి అయితే భారీ అధిక్యతతో గెలుస్తామని కూడా చెప్పుకుంటున్నారు. మొత్తం మీదా అచార్యులుగా సుదీర్ఘ కాలము పని చేసి రాజకీయాలలోకి వచ్చిన పల్లెకు అయన శిష్యులే ఈ సారి ప్రత్యర్థులు అయ్యేలా ఉన్నారు.