YSRCP Nominated Posts: ఏపీలో ఎన్నిక‌ల వేడి మ‌రిత‌గా హీటెక్కుతుంది. పార్టీలో ప‌ద‌వుల‌కు నియామ‌కాలు చేస్తూ ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహన్ రెడ్డి ఆదేశాలు ఇచ్చారు. ఏపీలో అధికార పార్టీలో అనుబంద సంఘాలకు అధ్యక్షుల‌ను నియ‌మిస్తూ సీఎం జ‌గ‌న్ నిర్ణ‌యం తీసుకున్నారు. సాధార‌ణ కార్య‌క‌ర్త మెద‌లుకుని ఎమ్మెల్యేతో పాటుగా ఎమ్మెల్సీల‌కు కూడా ఇందులో ప్రాధాన్య‌త ఇవ్వ‌టం విశేషం. ఎన్నిక‌ల‌కు సిద్దం అవుతున్న వేళ వైసీపీ అనుబంద సంఘాల‌ను ప‌టిష్ట‌ ప‌ర‌ిచేందుకు చ‌ర్య‌లు తీసుకున్నారు. 


రాష్ట్ర యువ‌జ‌న విభాగం అధ్యక్షుడిగా నందికొట్కూరుకు చెందిన బైరెడ్డి సిద్దార్ద రెడ్డిని నియమించారు. స్టేట్ మ‌హిళా విభాగం అధ్యక్షురాలిగా చీరాల‌కు చెందిన ఎమ్మెల్సీ పోతుల సునీత‌,స్టేట్ స్టూడెంట్ వింగ్ అధ్యక్షుడిగా గుంటూరు ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పానుగంటి చైత‌న్య‌కు బాధ్యత‌లు అప్ప‌గించారు. పార్టీ పెట్టిన నాటి నుంచి చైత‌న్య.. అధ్యక్షుడు జ‌గ‌న్‌కు మద్దతుగా వీర విధేయుడిగా ఉంటున్నారు. ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి కుడి భుజంగా ఉంటున్నారు. అప్పిరెడ్డికి ఎమ్మెల్సీ ప‌ద‌వి కోసం  6సంవ‌త్స‌రాల పాటు త‌ల‌నీలాలు పెంచుకున్నారు. చివ‌ర‌కు ఆయ‌న‌కు విద్యార్ది విభాగం అధ్యక్షుడిగా అవ‌కాశం ద‌క్కింది. స్టేట్ రైతు విభాగం అధ్యక్షుడిగా తిరిగి నాగిరెడ్డికి అవకాశం ఇచ్చారు. 


జంగా కృష్ణ‌మూర్తికి బీసీ సెల్..
స్టేట్ బీసీ సెల్‌కు అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ జంగా కృష్ణ‌మూర్తిని సీఎం జగన్ నియ‌మించారు. వైఎస్ఆర్ ట్రేడ్ యూనియ‌న్ అధ్యక్షుడిగా విజ‌య‌వాడ సెంట్ర‌ల్ నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన పూనూరు గౌతం రెడ్డి, రాష్ట్ర వాణిజ్య విభాగం అధ్యక్షుడిగా విజ‌య‌వాడ ప‌శ్చిమ నియోజ‌క‌వ‌ర్గ శాస‌నస‌భ్యుడు వెలంప‌ల్లి శ్రీ‌నివాస్‌ను నియ‌మించారు.స్టేట్ పోలింగ్ బూత్ అధ్యక్షుడిగా తాడికొండ‌కు చెందిన హ‌ర్ష‌వ‌ర్ద‌న్ రెడ్డి, రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షుడిగా క‌ర్నూలు ఎమ్మెల్యే హ‌ఫీజ్ ఖాన్, రాష్ట్ర సాంస్కృతి విభాగం అధ్యక్షురాలుగా విజ‌య‌న‌గ‌రానికి చెందిన వంగ‌పండు ఉషా, రాష్ట్ర వైఎస్ఆర్ సేవా ద‌ళ్ విభాగం అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ రుహుల్లాను నియ‌మించారు. రాష్ట్ర డాక్ట‌ర్ల విభాగానికి అధ్యక్షురాలుగా కాకినాడు రూర‌ల్ కు చెందిన డాక్ట‌ర్ పితాని అన్న‌వ‌రానికి అవ‌కాశం ఇచ్చారు. 


సోష‌ల్ మీడియా విభాగంలో..
ముఖ్యంగా సోషల్ మీడియా విభాగంలో న‌లుగురికి అవ‌కాశం ఇచ్చారు. గుర్రంపాటి వెంక‌ట‌ దేవేంద‌ర్ రెడ్డి, పుట్టా శివ‌శంక‌ర్, చ‌ల్లా మ‌దుసూధన్ రెడ్డి, మ‌దుసూద‌న్ రెడ్డిని సోషల్ మీడియా విభాగంలో నియ‌మించారు. రాష్ట్ర క్రిష్టియ‌న్ మైనార్టీ సెల్ ఛైర్మ‌న్‌గా ఫాద‌ర్ ముద్దు బాలస్వామిని నియ‌మించారు. రాష్ట్ర పంచాయతీ వింగ్‌కు అధ్యక్షుడిగా మేక‌ల హ‌నుమంత‌రావు, వైఎస్ఆర్ టీచ‌ర్స్ ఫెడ‌రేష‌న్ రాష్ట్ర అధ్యక్షుడిగా క‌దిరి ఎమ్మెల్సీ క‌ల్ప‌ల‌త రెడ్డి,స్టేట్ గ్రీవెన్స్ సెల్ అధ్యక్షుడిగా నారాయ‌ణ మూర్తి, రాష్ట్ర ఐటీ విభాగం అధ్యక్షుడిగా సునీల్, ఎన్నారై అధ్యక్షులుగా మేద‌పాటి వెంక‌ట్, విక‌లాంగుల విభాగం అధ్యక్షులుగా బండెల కిర‌ణ్ రాజు, పార్టి కేంద్ర కార్యాల‌యం ఇంఛార్జ్‌గా ఎమ్మెల్సీ లేళ్ళ అప్పిరెడ్డి, క్ర‌మ‌శిక్ష‌ణా సంఘం అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ ఉమారెడ్డిని వైఎస్ జగన్ నియ‌మించారు.


Also Read: YSRCP MP Raghurama: నన్ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు, ప్రధాని మోదీని నేరుగా సాయం కోరతా : ఎంపీ రఘురామ 
Also Read: EPF Money Debited: ఏపీలో ఉద్యోగులకు మరో షాక్ - పీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయం