EPF Money Debited From Employees PF Accounts, says Employees Union leader surya narayana


Money Debited From Employees PF Accounts: ఏపీలో ఉద్యోగులకు మరో షాక్ తగిలింది. జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు డెబిట్ కావడం కలకలం రేపుతోంది. తమ నగదు ఎవరు తీసుకున్నారో తెలియడంలేదని.. గతంలోనూ ఇలాగే జరిగితే ఫిర్యాదు చేయగా జీపీఎఫ్ ఖాతాల్లోకి నగదు మళ్లీ అయిందని చెబుతున్నారు. ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి నగదు మాయమైందని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ తెలిపారు. ఈ విషయంపై ఫిర్యాదు చేయడానికి వెళ్తే ఆర్థిక శాఖ అధికారులు ఎవరూ లేరని, పీఎఫ్ విత్‌డ్రా సమస్యపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు పోలీసులకు ఫిర్యాదులు చేస్తామని పేర్కొన్నారు.


పీఎఫ్ విత్‌డ్రా సమస్య మళ్లీ మొదటికి..
గతంలో ఏపీలో ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల నుంచి డబ్బులు డెబిట్ (Money Debited From PF Accounts) అయ్యాయి. ఫిర్యాదు చేయగా.. తమకు నగదు తిరిగి జమ చేశారని సూర్యనారాయణ తెలిపారు. కానీ మళ్లీ విత్ డ్రా చేసుకున్నట్లు రాత్రి నుంచి మెసేజ్ లు వచ్చాయంటూ ఆందోళన వ్యక్తం చేశారు. తన ఖాతా నుంచి సైతం రూ.83 వేలు విత్ డ్రా చేశారని తెలిపారు. మొత్తం 90 వేల మంది ఉద్యోగులకు చెందిన పీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్ల వరకు నగదు డెబిట్ అయిందని అంచనా వేశారు. ఫిర్యాదు చేయడానికి వెళ్లినా ప్రయోజనం కనిపించలేదన్నారు. ఫిర్యాదు చేసేందుకు ఆర్థిక శాఖకు వెళ్తే అధికారులు అందుబాటులో లేరని తెలిపారు. ఉద్యోగుల అనుమతి లేకుండా వారి పీఎఫ్ ఖాతాల నుంచి నగదు తీసుకోవడం నేరమని చెప్పారు.


పీఆర్సీ డీఏ బకాయిలను పీఎఫ్ ఖాతాకు జమ చేస్తానని చెప్పారు. అయితే 6 నెలలుగా ఇచ్చిన డీఏ బకాయిలు మళ్లీ వెనక్కి తీసుకుంటున్నారని.. తాజాగా 90 వేల మంది పీఎఫ్ ఖాతాల నుంచి రూ.800 కోట్లు మాయం చేశారని తెలిపారు. ప్రభుత్వానికి తెలిసే జరిగాయా లేక అధికారుల తప్పిదమా తెలియదని.. ఫిర్యాదు చేసేందుకు వెళ్తే ఆర్థికశాఖ అధికారులు ఎవరూ లేరని ఉద్యోగుల సంఘం నేత సూర్యనారాయణ వెల్లడించారు.
Also Read: YSRCP MP Raghurama: నన్ను అరెస్ట్ చేస్తే తీవ్ర పరిణామాలు, ప్రధాని మోదీని నేరుగా సాయం కోరతా : ఎంపీ రఘురామ


Also Read: YSRCP Nominated Posts: వైఎస్సార్‌సీపీలో పదవుల పండుగ - పార్టీ అనుబంధ సంఘాల‌కు అధ్యక్షులు వీరే