Vizag JAC : విశాఖ గర్జనకు ఉత్తరాంధ్ర ప్రజలంతా మద్దతివ్వాలని మంత్రి గుడివాడ అమర్నాథ్, మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. నాన్ పొలిటికల్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించబోతున్న విశాఖ గర్జన సభకు సంబంధించిన పోస్టర్‌ను వీరుఆవిష్కరించారు. వికేంద్రికరణకు మద్దతుగా ప్రభుత్వం ముoదుకు వెళుతున్న సమయంలో కొంతమంది సమస్యలు సృష్టిస్తున్నారని గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు మూడు రాజదానులకు మద్దతుగా అన్ని వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు. ఉత్తరాంద్ర ప్రాంత అబివృద్ది చెందాలంటే మూడు రాజధానులు అవసరమని ఆయన స్ఫష్టం చేశారు. ఉత్తరాంధ్ర అబివృద్ధి చెందకూడదనే హక్కు ఎవరికి లేదని ఆయన స్పష్టం చేశారు.
అంబేద్కర్ విగ్రహం నుంచి వైఎస్ విగ్రహం వరకు ర్యాలీ
అమరావతి రైతులు ఉత్తరాంధ్ర మీదకు దండయాత్రకు వస్తున్నారని.. మంత్రి ఆరోపించారు. విశాఖ గర్జన పేరుతో 15 వ తేదీన అంబేద్కర్ విగ్రహం నుంచి రాజశేఖర్ రెడ్డి విగ్రహము వరకు పాదయాత్ర ఉంటుందని ప్రకటించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష చెప్పడానికే.. విశాఖ గర్జన అని చెప్పారు. దండయాత్రగా వస్తామంటే ఉత్తరాంధ్రకు ద్రోహం చేసినట్టేనని తెలిపారు. ఇప్పటికే అన్ని ప్రాంతాల ప్రజలు విశాఖపట్నంకు రావడానికి సిద్దంగా ఉన్నారని తెలిపారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని కోరారు. వైఎస్ఆర్‌సీపీ నాయకులు రాజకీయ లబ్ది కోసం మూడు రాజధానులపై ఉద్యమం చేస్తున్నారని కొంత మంది విమర్శిస్తున్నారని.. అలాంటి విమర్శలు సరి కాదని మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు.
రాజకీయ లబ్ది కోసం మూడు రాజధానులు అనడం లేదన్న అవంతి
తాము ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసమే రాజకీయాలు చేస్తున్నామన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు నిద్ర లేచారని.. ఉత్తరాంద్ర ప్రజల మనోభావాలు దెబ్బతినే విధంగా విశాఖలో 15 వ తేదీన పర్యటిస్తున్నారని మండిపడ్డారు. ఆ పర్యటన తేదీని మార్చాలన్నారు. పవన్ కళ్యాణ్ విశాఖ వద్దు అమరావతి ముద్దు అనడం సరికాదన్నారు. అమరావతి లో 29 లే కాదు మిగిలిన ప్రాంతం కూడా అభివృద్ధి చెందాలన్నారు. వైఎస్ఆర్‌సీపీ నేతలు విశాఖలో ఎక్కడైనా ఆక్రమణలు చే్తే చూపించాలని సవాల్ చేశారు. విశాఖ అబివృద్ధి చెందకూడదనే విపక్షాలు కుట్ర చేస్తున్నాయన్నారు. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయం ఉందని.. రాజకీయాలను పక్కనపెట్టి ప్రజల కోసం నిలబడదామని అవంతి శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
గర్జనను విజయవంతం చేయాలని వైఎస్ఆర్‌సీపీ నేతల పిలుపు
వైఎస్ఆర్‌సీపీ నాయకులు విశాఖ గర్జనను పెద్ద ఎత్తున విజయవంతం చేసి మూడు రాజధానుల సెంటిమెంట్‌ను పెంచాలని అనుకుంటున్నారు. అయితే పవన్ కల్యాణ్ కూడా అదే రోజున విశాఖకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ వస్తున్నారు. ఆయన వస్తే జనసైనికులు చేసే హంగామా ఏ రేంజ్‌లో ఉంటుందె చెప్పాల్సిన పని లేదు. దాంతో తమ గర్జనపై ప్రభావం పడుతుందని. వైఎస్ఆర్‌సీపీ నేతలు ఆందోళన చెందుతున్నారు. అందుకే పవన్ కల్యాణ్ రావొద్దని డిమాండ్ చేస్తున్నారు.
మండల స్థాయిలో రిలే దీక్షలు చేస్తామన్న లజపతిరాయ్
విశాఖ గర్జన ఉద్యమానికి ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందని జేఏసీ చైర్మన్ లజపతిరాయ్ పేర్కొన్నారు. దీనికి మద్దతుగా గ్రామ, మండల స్థాయిలో రిలే నిరాహార దీక్షలు కూడా నిర్వహిస్తున్నారని తెలియజేశారు. నాన్ పొలిటికల్ జేఏసీ నేతృత్వంలో జరుగుతున్న ఈ ఉద్యమంలో, అన్ని పార్టీలు ఆత్మ ప్రబోధం చేసుకొని పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. . ఈ ఉద్యమానికి మీడియా రంగం వెన్నుదన్నుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. మన ప్రాంత అభివృద్ధికి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి ప్రయత్నిస్తుంటే న్యాయపరంగా, రాజకీయంగా అడ్డుకుంటున్నారని దాన్ని తిప్పికొట్టే విధంగా ఉత్తరాంధ్ర ప్రజలు జగన్మోహన్రెడ్డికి అండగా నిలవాలని పిలుపునిచ్చారు.
జైల్లోనే ఎమ్మెల్సీ అనంతబాబు - బెయిల్ పిటిషన్ డిస్మిస్ చేసిన ఏపీ హైకోర్టు !