Anchor Syamala Comments: కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైందని.. మహిళ హోంమంత్రిగా ఉన్న రాష్ట్రంలో మహిళలపై అఘాయిత్యాలు నిత్యకృత్యమయ్యాయని వైసీపీ అధికార ప్రతినిధి, యాంకర్ శ్యామల (Anchor Syamala) ఆవేదన వ్యక్తం చేశారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. తనను టీడీపీ కార్యకర్తలు వేధిస్తున్నారని.. ఆ పార్టీ ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీలు రెచ్చిపోయాయని మండిపడ్డారు. వైసీపీ అధినేత జగన్.. తనను అధికార ప్రతినిధిగా నియమించినప్పటి నుంచీ అత్యంత దారుణంగా తనపై పోస్టులు పెడుతున్నారని.. టీడీపీ అఫీషియల్ గ్రూపులో తన గురించి అసభ్యకరంగా పోస్టులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'నా ఫోటోలను ఫేక్ చేసి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలకు ఇచ్చే గౌరవం ఇదేనా.?. సినిమాల్లో పని చేసిన వారు రాజకీయాల్లోకి రాకూడదా.?. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ముందు సినీ నటుడు కాదా.?. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సినీ పరిశ్రమ నుంచి రాలేదా.?. టీడీపీలో జయప్రదలాంటి మహిళలు పని చేయలేదా.?. మహిళ అనగానే ఇష్టం వచ్చినట్లు కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేస్తారా.?. నాకు రాజకీయాలు ఎందుకంటూ ప్రశ్నిస్తున్నారు. వారికి త్వరలోనే సమాధానం తెలుస్తుంది. మానసికంగా మమ్మల్ని దెబ్బతీయాలని చూసినా మేం ఎక్కడా వెనక్కు తగ్గం. మహిళా శక్తి అంటే ఏంటో చూపిస్తాం. వైసీపీ తరఫున పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. అమెరికాలో ఉండే టీడీపీ కార్యకర్తలు కూడా నన్ను దూషిస్తున్నారు. త్వరలోనే వీరందరి సంగతి చూస్తాను.' అని శ్యామల హెచ్చరించారు.






'నాలుగు నెలల్లోనే దారుణాలు'


కూటమి ప్రభుత్వం అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టించిందని శ్యామల మండిపడ్డారు. 'కూటమి అధికారంలోకి వచ్చిన 4 నెలల్లోనే ఎన్నో దారుణాలు జరిగాయి. కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. రాష్ట్రంలో హత్యలు, అత్యాచారాలు నిత్యకృత్యమయ్యాయి. పిఠాపురంలో బాలికపై లైంగిక దాడి జరిగింది. పుంగనూరులో పాప కేసులో పోలీసులు సరిగా వ్యవహరించలేదు. సాక్షాత్తు సీఐ తల్లినే కిడ్నాప్ చేసి హత్య చేస్తే ఎవరికి చెప్పుకోవాలి.?. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతోంది.?. ముచ్చుమర్రి ఘటనలో చిన్నారి డెడ్ బాడీని కూడా తీయలేదు. గుడ్లవల్లేరు ఇంజినీరింగ్ కాలేజీ ఘటనపై ఇప్పటికీ చర్యలు తీసుకోలేదు. వైఎస్ జగన్ పాలనలో ఆడపిల్లలు, మహిళలకు రక్షణ ఉండేది. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. 30 వేల మంది మహిళలు మిస్సింగ్ అంటూ హడావుడి చేసిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఏం సమాధానం చెప్తారు.?. రాష్ట్రంలో పెరుగుతున్న దారుణాలపై కూటమి ప్రభుత్వం వివరణ ఇవ్వాలి.' అని పేర్కొన్నారు.










Also Read: Crime News: పిఠాపురంలో దారుణం - బాలికకు మద్యం తాగించి ఆపై అత్యాచారం