మంత్రి పదవులకు రాజీనామా చేసిన తర్వాత బీసీ మాజీ మంత్రులంతా ఏం చేయాలో వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ( YSRCP High Commend ) దిశానిర్దేశం చేసింది. పార్టీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి తో బీసీ మంత్రులు సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ చైతన్య పర్యటనలు, సమావేశాలు నిర్వహించాలని సీఎం జగన్ ( CM Jagan ) ఆదేశాల మేరకు రూట్ మ్యాప్ ఖరారు చేశారు. బీసీలకు సీఎం వైఎస్ జగన్ ( YS Jagan ) ఇచ్చిన హామీలు, జరిగిన మేళ్లను బీసీ మంత్రులమంతా కలసి చర్చించామని మంత్రులు తెలిపారు. 139 బీసీ కులాలు ఉంటే 56 కార్పోరేషన్లు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. బీసీల ఆత్మగౌరవం కోసం తీసుకున్న చర్యలను వివరించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ సదస్సులు చేపట్టాలని నిర్ణయించామని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ ప్రకటించారు.
లబ్ది పొంది టీటీడీలో సభ్యులుగా నియమించారా ? ప్రభుత్వంపై హైకోర్టు అసహనం !
బీసీల ఆత్మగౌరవాన్ని పెంచేందుకు ఈ కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించామని .. తొలుత అన్ని కొత్త జిల్లాల్లో బీసీ ప్రాంతీయ సదస్సులు నిర్వహిస్తామన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయిలో బీసీ సదస్సు నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. రూ. 31వేల కోట్ల రూపాయలను బీసీ సబ్ ప్లాన్ ( BC Sub Plan ) కోసం ప్రభుత్వం కేటాయించిందని .. బీసీలు ఆత్మగౌరవంతో జీవిస్తున్నారనే విషయాన్ని క్షేత్ర స్థాయికి తీసుకెళతామని వేణుగోపాల కృష్ణ తెలిపారు. ఎమ్మెల్సీ జంగా కృష్ణ మూర్తి ( MLC Janga ) సహా నేను రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి బీసీ నేతలు యాత్రలో పాల్గొంటారని తెలిపారు.
శాశ్వత భూసర్వేపై సీఎం రివ్యూ, లంచాలకు వీల్లేకుండా జరగాలని జగన్ ఆదేశాలు - ఈ స్కీమ్ ఎలా చేస్తారంటే
ఏప్రిల్ నెల 15 తర్వాత నెల పాటు పర్యటనలు చేయాలని నిర్ణయించామని.. బీసీల సమస్యలను గుర్తించి నెరవేర్చేలా క్షేత్ర స్థాయిలో పర్యటనలు చేస్తామన్నారు. తెలుగుదేశం ( TDP ) గత పాలనలో విద్యుత్ చార్జీలు పెంచారని ఇప్పుడు స్వల్పంగా పెంచితే ఆందోళన చేస్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ పథకాలను చంద్రబాబు తీసివేశారని మంత్రులు గుర్తు చేశారు. గతంలో విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేసింది తెలుగుదేశం పార్టీనేనన్నారు. ప్రజలను ఏదో విధంగా దృష్టి మరల్చడమే టీడీపీ లక్ష్యమని..ఏ ప్రభుత్వం మంచి చేస్తుందో ..ఆదుకుంటుందో అనే విషయం ప్రజలకు వాస్తవాలు తెలుసని వేణుగోపాల కృష్ణ తెలిపారు.