YSRCP Alert over Fake Votes in Andhra Pradesh: ఈ నెల 21 నుంచి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కు ఎన్నికల కమిషన్ సన్నద్దం అయింది. ఈ క్రమంలో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి నాయకులు అలర్ట్ అయ్యారు. నియోజకవర్గాల వారీగా దొంగ ఓట్ల వ్యవహరంలో అలర్ట్ గా ఉండాలని పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామక్రిష్ణారెడ్డి శ్రేణులకు సూచించారు.


21 నుండి ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ.. 
ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల జాబితా పై ఇప్పటికే గందరగోళం నెలకొంది. ఈ పరిస్థితుల్లో అధికార, ప్రతిపక్ష పార్టిలు దొంగ ఓట్ల వ్యవహరంలో విమర్శలు గుప్పించుకుంటున్నారు. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడ ఫిర్యాదులు అందటంతో, రాష్ట్ర ఎన్నికల అధికారి సైతం ఢిల్లీకి వెళ్లి పరిస్దితులను వివరించారు. ఈ వ్యవహరంతో రాష్ట్రంలోని ఓటర్ల జాబితా పై ప్రత్యేకగా సమగ్ర సవనరణకు ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీని పై రాజకీయ పార్టిలు అలర్ట్ అయ్యాయి. ఎక్కడెక్కడ దొంగ ఓట్లు ఉన్నాయనే విషయాలు పై పార్టీలు పోటా పోటీగా వివరాలను సేకరించే పనిలో ఉన్నాయి..


వైసీపీ శ్రేణులను అలర్ట్ చేసిస సజ్జల...
ఓటర్ల జాబితా వ్యవహరంలో  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో పార్టీ యంత్రాంగం క్రియాశీలకంగా వ్యవహరించేలా శాసనసభ్యులు, కో ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, పరిశీలకులు బాధ్యతతో పని చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపు ఇచ్చారు. పార్టీ శాసనసభ్యులు, నియోజకవర్గ ఇన్ ఛార్జీలు, జిల్లా అధ్యక్షులు, పార్టీ పరిశీలకులు, జేసిఎస్ కోఆర్డినేటర్లతో  పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  సజ్జల రామకృష్ణారెడ్డి  టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు.  దొంగఓట్ల తొలగింపు, అర్హులైన వారిని ఓటర్లుగా చేర్చే విషయంలో జాగ్రత్త వహించాలన్నారు. 2014. నుంచి 2019 మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు బోగస్, సెకండ్ ఓట్లను చేర్పించి వ్యవస్ధను పూర్తిగా నిర్వీర్యం చేసిందని ఆయన ఆరోపించారు.  ఓటర్ల లిస్ట్ ను తమకు అనుకూలంగా తెలుగు దేశం మార్చుకుందని అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టికి ప్రజలు బ్రహ్మరథం పట్టారని అన్నారు.  బూత్ స్దాయి వరకు పరిశీలించి బోగస్ ఓట్లను గుర్తించి ఎన్నికల కమీషన్ దృష్టికి తీసుకువెళ్ళాలన్నారు.  పార్టీ బూత్ కమిటీల ఇన్ ఛార్జులు, గృహ సారధులతో  రెగ్యులర్ గా సమీక్షలు నిర్వహించాలని పార్టి శ్రేణులకు సజ్జల ఆదేశాలు ఇచ్చారు.  ప్రతిపక్షాలు ఈ విషయంలో అక్రమాలకు పాల్పడే అవకాశాలు ఉన్న దృష్ట్యా ఇందులో  ఏమరుపాటు లేకుండా జాగ్రత్త వ్యవహరించాలన్నారు. 


ముందస్తు ఎన్నికలంటూ టీడీపీ మైండ్ గేమ్...
ఇప్పటికే తెలుగు దేశం పార్టీ మైండ్ గేమ్ ను మెదలు పెట్టిందని, ముందస్తు ఎన్నికల పేరుతో ఇప్పటికే ప్రజలను గందరగోళ పరిచే చర్యకు తెర తీసిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టి  రాష్ర్ట ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.  మరో వైపున కుల, మతాల పరంగా రెచ్చగొట్టే కార్యక్రమాలను చేపట్టడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టిలో ఉన్న  శాసనసభ్యులను టార్గెట్ చేస్తూ మాట్లాడటం తెలుగు దేశం క వెన్నతో పెట్టిన విద్య అని అన్నారు. ఇలాంటి మైండ్ గేమ్ ల విషయంలో అలర్ట్ గా ఉండాలన్నారు..


పవన్ వ్యాఖ్యలను తిప్పి కొట్టాలి...
 ముఖ్యమంత్రి తన పరిపాలనా కాలంలో వ్యవస్దలను ప్రక్షాళన చేసి నిర్మించిన మంచి వాతావరణాన్ని చెడగొట్టేవిధంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్  వైషమ్యాలను సృష్టిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. ప్రజలలో ప్రభుత్వం పట్ల ఉన్న సంతృప్తిని దెబ్బతీసేందుకు అయోమయ వాతావరణం నెలకొనేందుకు యధాశక్తిగా ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ఇటీవల కాలంలో ఈ విధానం పీక్స్  కు చేరిందని అన్నారు. పవన్ కల్యాణ్ ఊగిపోతూ ఒకదానికొకటి పొంతన లేకుండా,  సినిమా స్క్రీన్ పై యాక్షన్ చేసినట్లు మాట్లాడుతున్నారని, పవన్ వ్యాఖ్యలను  ధీటుగా ఎదుర్కోవాలని శ్రేణులకు సజ్జల పిలుపునిచ్చారు.