YS Sunitha said she is fighting for justice :  మాజీ మంత్రి వైఎస్ వివేకా హంతకులకు శిక్ష పడే వరకూ జస్టిస్ ఫర్ వివేకా పేరుతో  ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంటానని వైఎస్ సునీత తెలిపారు. ప్రజల ఓటు తాను వేయలేనని... జాగృతం చేయాల్సిన బాధ్యత మాత్రం తనపై ఉందన్నారు.  వివేకాపై వచ్చిన ఆరోపణలను సీబీఐ విచారించి హత్యకు అవి కారణాలు కావని తేల్చిందని గుర్తు చేశారు.  వివేకాపై ఆరోపణలు ఇప్పుడు అసందర్భమని..  అవినాశ్‌ రెడ్డి నిందితుడని సీబీఐ చెబుతోంది..  జగన్‌ అసెంబ్లీలో అవినాశ్‌ రెడ్డికి క్లీన్‌ చిట్‌ ఇవ్వడం మీరు చూశారని గుర్తు చేశారు.  కర్నూలులో అవినాశ్‌ని సీబీఐ అరెస్టు చేయకుండా 2 రోజులు జరిగిన డ్రామా ప్రజలందరూ చూశారన్నారు.  


పార్టీ గెలుపు కోసం వివేకా కృషి 


2009లో వైఎస్‌ మరణం తర్వాత పరిణామాలను వివరించారు. కడప స్థానాన్ని అవినాష్‌రెడ్డికి ఇవ్వాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా ఓటమి పాలయ్యారన్నారు. వెన్నుపోటుతో వివేకాను ఓడించారన్నారు. ఆ తరువాత కూడా జిల్లా అంతా వివేకా చూసుకున్నారన్నారు. పులివెందులను మాత్రం ఎంపీ అవినాష్‌ కుటుంబానికి అప్పగించారన్నారు. పులివెందులలో అవినాష్‌ కుటుంబం వెన్నుపోటుతో వివేకా ఓడిపోయారన్నారు. ఓటమి తర్వాత తేరుకుని.. 2019 ఎన్నికలకు వివేకా సిద్ధమయ్యారని సునీతా రెడ్డి వెల్లడించారు. 
2019 లో పార్టీ గెలుపు కోసం వైఎస్ వివేక విపరీతంగా కృషి చేశారన్నారు. 


వివేకా వ్యతిరేకులే ఓటును తీసి వేయించారు!  


పార్టీ కోసం పనిచేసిన కుటుంబ సభ్యులు షర్మిల, వివేకాకు జగన్ అన్యాయం చేశారన్నారు. జగన్‌ పాదయాత్రలో వివేకా అప్పుడప్పుడు కలిసేవారని సునీత అన్నారు. పార్టీ నిర్మాణానికి నిరంతరం సలహాలు ఇస్తూ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగారన్నారు. ఇదే సమయంలో షర్మిల పేరు మళ్లీ కడప సీటు కోసం చర్చకు వచ్చిందన్నారు. కడప ఆత్మీయ సమావేశాన్ని హైదరాబాద్‌లో షర్మిల నిర్వహించారన్నారు. కొన్ని రోజుల తర్వాత వివేకా కార్యకర్తల సమావేశం నిర్వహించారని సునీత వెల్లడించారు. ఆ తర్వాత పులివెందులలో వివేకా ఓటు జాబితాలోనే లేకుండా పోయిందని తెలిపారు. ప్రతిపక్షాలే ఓటు లేకుండా చేశాయని మేమంతా భావించామని సునీత తెలిపారు. వివేకాను వ్యతిరేకించేవారే ఓటు తొలగించారని అర్థమైందన్నారు. ఓటు తొలగింపుపై వివేకా పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. 


రాజకీయ పార్టీతో సంబంధం లేదు .. న్యాయం కోసమే పోరాటం ! 


షర్మిలను కడప నుంచి పోటీ చేయాలని వివేకా ఒత్తిడి చేశారని సునీత వెల్లడించారు. తనకు ఏ రాజకీయ పార్టీలతోనూ సంబంధం లేదని.. తనకు కావాల్సిన న్యాయం కోసం పోరాటం చేస్తున్నానని సునీత పేర్కొన్నారు. అందులో భాగంగానే రాజకీయ పార్టీలు, బ్యూరో క్రాట్స్ కలిశానని.. ఇక మీదట కలుస్తానని వెల్లడించారు. ఎవరి పని వాళ్ళ చేస్తే తనకెలాంటి అభ్యంతరం లేదని.. తనకు ఫేవర్ చేయాలని కూడా కోరుకోవడం లేన్నారు. వివేకా కేసులో న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నానని సునీత తెలిపారు.