YS Jagan Foreign Tour: ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కోర్టులో పిటిషన్ వేశారు. ఈయనతో పాటు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా విదేశీ పర్యటన కోసం మరో పిటిషన్ వేశారు. విజయసాయి రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రత్యేక కోర్టులో వాదనలు పూర్తి కాగా.. తీర్పును ఆగస్టు 30కి న్యాయమూర్తి వాయిదా వేశారు. ఇక జగన్ పిటిషన్‌పై కౌంటరు దాఖలు చేయాలని కోర్టు కోరడంతో సీబీఐ సమయం కోరింది. దీంతో విచారణ బుధవారానికి (ఆగస్టు 21) వాయిదా పడింది. రాబోయే సెప్టెంబరు నెలలో యూకే వెళ్లేందుకు జగన్ అనుమతి కోరినట్లు సమాచారం. సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో యూరప్ వెళ్లడం కోసం విజయసాయి రెడ్డి అనుమతి కోరుతూ పిటిషన్ వేసినట్లు తెలిసింది.
YS Jagan News: ఫారిన్ టూర్కు జగన్, విజయసాయి ప్లాన్ - కోర్టులో పిటిషన్లు
Venkatesh Kandepu
Updated at:
20 Aug 2024 07:46 PM (IST)
AP News: విదేశీ పర్యటనల కోసం కోర్టును అనుమతి కోరుతూ వైఎస్ జగన్, విజయసాయి రెడ్డి వేర్వేరుగా పిటిషన్లు వేశారు. కోర్టు అనుమతి లేనిదే వారు దేశం దాటకూడదని వారిపై ఆంక్షలు ఉన్న సంగతి తెలిసిందే.
విజయసాయి రెడ్డి, వైఎస్ జగన్