Andhra Pradesh International Yoga Day: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన  యోగాంధ్ర కార్యాచరణ టూరిజాన్ని అభివృద్ధి చేసేలా నిర్వహిస్తున్నారు.  సాధారణంగా ఒక రోజు ప్రభుత్వ అధికారిక ఈవెంట్‌గా ముగిసిపోయే యోగా దినోత్సవాన్ని.. సీఎం నారా చంద్రబాబు నాయుడు,   మంత్రి నారా లోకేశ్‌లు ఒక అంతర్జాతీయ బ్రాండింగ్ సాధనంగా, పర్యాటక వృద్ధి వ్యూహంగా  మలచుకున్నారు. గత ఏడాది విశాఖపట్నంలో ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో నిర్వహించిన వేడుకలు రెండు గిన్నిస్ రికార్డులను సొంతం చేసుకోవడమే కాకుండా, పాలకుల పరిపాలనా దక్షతకు నిదర్శనంగా నిలిచాయి.  

Continues below advertisement

 నారా లోకేశ్ మైక్రో-ప్లానింగ్ 

గత ఏడాది విశాఖపట్నం ఆర్కే బీచ్ తీరంలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరైన అంతర్జాతీయ యోగా దినోత్సవ ఈవెంట్ ఏపీ చరిత్రలోనే మైలురాయిగా నిలిచింది. ఈ వేడుకల విజయవంతం వెనుక మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో   మైక్రో-ప్లానింగ్ స్పష్టంగా కనిపించింది. కేవలం కొద్దిరోజుల వ్యవధిలోనే లక్షలాది మందిని సమన్వయం చేస్తూ, ఎలాంటి ట్రాఫిక్ లేదా భద్రతా లోపాలు లేకుండా ఈవెంట్‌ను నిర్వహించిన తీరును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్వయంగా అభినందించారు. అంతేకాదు, ఢిల్లీకి వెళ్లిన తర్వాత కేంద్ర క్యాబినెట్ సమావేశంలో ఈ  విశాఖ యోగా డే  నిర్వహణపై ప్రత్యేక నివేదికను  తెప్పించుకుని,  మంత్రులు కూడా ఏపీ మోడల్‌ను అధ్యయనం చేయాలని ప్రధాని సూచించారు. 

Continues below advertisement

 రెండూ గిన్నిస్ రికార్డుల సంచలనం! 

విశాఖ వేడుకలు కేవలం ప్రశంసలకే పరిమితం కాలేదు, అంతర్జాతీయ స్థాయిలో రికార్డులను తిరగరాశాయి. ఏపీ ప్రభుత్వం పక్కా వ్యూహంతో చేపట్టిన ఈ ఈవెంట్‌లో రెండు విభాగాల్లో గిన్నిస్ వరల్డ్ రికార్డులు  నమోదయ్యాయి . సముద్ర తీరాన అత్యధిక సంఖ్యలో సుమారు 2.5 లక్షల మందికి పైగా  ఒకేసారి డిజిటల్ రిజిస్ట్రేషన్ ద్వారా యోగాసనాలు వేయడం. ఒకే వేదికపై  గిరిజన ప్రాంతాల  విద్యార్థులు  అత్యధిక మంతి యోగా చేయడం వంటి రికార్డులు నమోదయ్యాయి.  

యోగాంధ్ర  బ్రాండింగ్ - టూరిజం కనెక్టివిటీ 

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ ప్రకారం.. ఈ ఏడాది  యోగాంధ్ర  కాన్సెప్ట్‌ను మరింత విస్తరించారు. కేవలం విశాఖకే పరిమితం చేయకుండా, రాష్ట్రంలోని భౌగోళిక వైవిధ్యాన్ని పర్యాటక రంగానికి అనుసంధానించారు. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రం, అమరావతి బౌద్ధ సాంస్కృతిక కేంద్రం, అరకు లోయల ప్రకృతి రమణీయత,  గండికోట గ్రాండ్ కాన్యన్ వంటి ఐకానిక్ పర్యాటక ప్రదేశాలలో ఐకానిక్ యోగా సైట్స్  ఏర్పాటు చేశారు. దీనివల్ల పర్యాటక హోటళ్లు, స్థానిక రవాణా రంగాలకు మేలు జరిగింది.  

 ఐటీ, హెల్త్-టెక్ రంగానికి  మేలు

  ఈ యోగా దినోత్సవాన్ని కేవలం సాంప్రదాయ వ్యాయామంగా కాకుండా, ఐటీ హబ్‌లలో  కార్పొరేట్ వెల్‌నెస్ డ్రైవ్‌గా మార్చారు. విశాఖ, మంగళగిరి ఐటీ కారిడార్లలోని కంపెనీలను ఇందులో భాగస్వామ్యం చేయడం ద్వారా  వర్క్-లైఫ్ బ్యాలెన్స్ కలిగిన గమ్యస్థానంగా ఏపీని ప్రొజెక్ట్ చేస్తున్నారు. యోగా ఆధారిత స్టార్టప్‌లు, హెల్త్-టెక్ యాప్‌లను ప్రోత్సహించేందుకు రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ప్రత్యేక నిధులను కూడా కేటాయించేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంతో ఉన్న సత్సంబంధాలను వాడుకుంటూ, కేంద్ర ఆయుష్  మంత్రిత్వ శాఖ నుంచి ఏపీలోని ప్రతి జిల్లాలోనూ యోగా అండ్ వెల్‌నెస్ సెంటర్స్  ఏర్పాటుకు రూ. 500 కోట్ల ప్రత్యేక నిధుల మంజూరును సాధించడంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించింది. ప్రభుత్వ పాఠశాలలు, డిగ్రీ కాలేజీలలో యోగాను ఒక సర్టిఫైడ్ సబ్జెక్ట్‌గా ప్రవేశపెట్టడం ద్వారా లక్షలాది మంది విద్యార్థులకు శారీరక, మానసిక దృఢత్వాన్ని అందించే శాశ్వత ఎకో-సిస్టమ్‌ను ఏపీ నిర్మిస్తోంది.

 సమాఖ్య స్ఫూర్తికి ఆదర్శం 

ఒక రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ ఆలోచనలకు, అంతర్జాతీయ లక్ష్యాలకు అనుగుణంగా ఎంత వ్యూహాత్మకంగా పనిచేయగలదనే దానికి ఏపీ ప్రభుత్వ యోగాంధ్ర ఒక అద్భుత నిదర్శనం. కేవలం రాజకీయాలకే పరిమితం కాకుండా, సంస్కృతిని ఆర్థిక వనరుగా ( మార్చడంలో చంద్రబాబు విజన్, లోకేశ్ ఎగ్జిక్యూషన్ పక్కాగా పనిచేశాయి. ఈ స్థాయి డేటా రిచ్ ప్లానింగ్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ వల్లే నేడు ఏపీ మోడల్ దేశంలోని ఇతర రాష్ట్రాలకు కేస్ స్టడీగా  మారిందన్న అభిప్రాయం వినిపిస్తోంది.