YCP MP Vijaya Sai Reddy wants Pawan Kalyan to become CM: వైసీపీ నేతలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎవరైనా జగన్ మోహన్ రెడ్డి సీఎం కావాలని కోరుకుంటారు. ఆయన కోసమే పని చేస్తామని చెబుతారు. అయితే విజయసాయిరెడ్డికి మాత్రం పవన్ కల్యాణ్ సీఎం అయితే బాగుంటుందని చెబుతున్నారు. ప్రత్యేకంగా ఈ అంశంపై ట్వీట్ చేసిన ఆయన పవన్ కల్యాణ్ కు దేశవ్యాప్తంగా క్రేజ్ ఉందన్నారు. చంద్రబాబుకు వయసు అయిపోయిందని ఇప్పుడు యువ ముఖ్యమంత్రిగా పవన్ రావాలన్నారు. 



విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్‌పై రాజకీయవర్గాల్లో విభిన్నమైన స్పందనలు వస్తున్నాయి. పవన్ కల్యాణ్ సీఎం కావాలని విజయసాయిరెడ్డి కోరుకోవడానికి ప్రధాన కారణం వరుసగా చుట్టుముడుతున్న కేసులేనని అంటున్నారు. ఇటీవల కాకినాడ డీప్ పోర్ట్ అంశంలో విజయసాయిరెడ్డి వియ్యంకుడి  కంపెనీ అయిన అరబిందో రియాల్టీ పూర్తిగా ఇరుక్కుపోయింంది. బెదిరరిచచంంి కంపెనీలోని వాటాలను రాయించుకున్నారని సీఐడీకి పోర్టు ఓనర్ కెవీరావు చేశారు. కేసులు నమోదు చేశారు. విజయసాయిరెడ్డితో పాటు వైవీ సుబ్బారెడ్డి కుమారుడు విక్రాంత్ రెడ్డి, విజయసాయిరెడ్డి అల్లుడి సోదరుడు శరత్ చంద్రారెడ్డిలపై లుకౌట్ నోటీసులు కూడా చేశారు.            


Also Read:  బంగ్లాదేశ్‌పై పవన్ కల్యాణ్ ఆగ్రహం - అందరూ మాట్లాడాల్సిన సమయం వచ్చిందని పిలుపు


దీనిపై ఢిల్లీలో మాట్లాడిన విజయసాయిరెడ్డి చంద్రబాబుపై మండిపడ్డారు. తీవ్ర విమర్శలు చేశారు. తాము అధికారంలోకి వచ్చాక ఆయనను అరెస్టు చేస్తామని హెచ్చరించారు. అయితే ఇది సరిపోలేదేమో కూటమిలో చిచ్చు పెడితే .. ఈ కేసులపై వెనుకడుగు వేస్తారేమోనని కొత్త రాజకీయ వ్యూహం అమలు చేయాలనుకున్నారేమో కానీ .. పవన్ సీఎం అంటూ ట్వీట్ చేశారు. 



Also Reddy: ఎమర్జెన్సీని తలపించేలా సీఎం రేవంత్ పాలన - ఏడో గ్యారెంటీగా రాజ్యాంగ ఉల్లంఘనలు జరుగుతున్నాయన్న హరీష్ రావు