YCP MLC Duvwada Srinivas family controversy : వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వ్యవహారం రచ్చ రచ్చగా మారుతోంది. శ్రీనివాస్ భార్య శ్రీవాణి, ఆయన అడల్టరీ స్నేహితురాలు దివ్వెల మాధురీతో పాటు దువ్వాడ శ్రీనివాస్ కూడా మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసుకున్నారు. ఈ క్రమంలో పిల్లల డీఎన్‌ఏ టెస్టులు అంశం కూడా తెరపైకి వచ్చింది. దివ్వెల మాధురీ ఏ మాత్రం మంచిది కాదని ఆమెకు క్యారెక్టర్ లేదని దువ్వాడ శ్రీవాణి ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలో ఆమె.. దివ్వెల మాధురీకి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారని వారు ఎవరి బిడ్డలో డీఎఎన్‌ఏ టెస్టులు చేయించాలన్నారు.
పరస్పర ఆరోపణలు చేసుకుంటున్న మాధురీ, శ్రీవాణి
శుక్రవారం శ్రీకాకుళంలో నిర్వహించిన ప్రెస్ మీట్‌లో దివ్వెల మాధురీ తన భర్త మెరైన్ ఇంజినీర్ అని.. తనకు, దువ్వాడ శ్రీనుకు లింక్ పెట్టి శ్రీవాణి చేసిన ప్రచారం వల్లనే భర్త దగ్గరకు రానివ్వడం లేదన్నారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని వారి బాధ్యత తనదేనన్నారు. ఈ క్రమంలో ఆ ముగ్గురి పిల్లలకు తండ్రి ఎవరో తేల్చాలని దువ్వాడ శ్రీవాణి డిమాండ్ చేశారు. ఈ విషయ తెలియడంతో దివ్వెల మాధురీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దువ్వాడ శ్రీవాణిపై తీవ్ర విమర్శలు చేశారు. తన పిల్లల గురించి కాదని ముందుగా దువ్వాడ శ్రీవాణి పిల్లలకు తండ్రి ఎవరో డీఎన్‌ఏ టెస్టులు చేయించాలని డిమాండ్ చేశారు.
వాణి భోజనం పెట్టలేదు - మాధురి అండగా నిలబడింది- విడాకులు తీసుకుంటా: దువ్వాడ శ్రీనివాస్
తాజాగా పిల్లలు ఎవరికి పుట్టారో డీఎన్‌ఏ టెస్టులకు సవాళ్లు
దువ్వాడ శ్రీవాణిపై దివ్వెల మాధురీ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆమె గురించి టెక్కలిలో ఎవరు అడిగినా చెబుతారని.. ఆమెకు రాజకీయ ఆకాంక్షలు ఎక్కువగా ఉన్నాయన్నారు. దువ్వాడ శ్రీను గురించి టెక్కలిలో గడప గడపకూ తప్పుడు ప్రచారం చేసిందని ఆరోపించారు. తమ క్యారెక్టర్ దెబ్బతీసే ప్రయత్నం చేసిందని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆమెకు పుట్టిన బిడ్డలకు తండ్రెవరో తేల్చాలని డీఎన్ఏ టెస్టులకూ డిమాండ్ చేయడంతో .. ఈ ఫ్యామిలీ వ్యవహారం కొత్త మలుపు తిరిగినట్లయింది.
దువ్వాడ శ్రీనివాస్, స్నేహితురాలు మాధురి చెప్పిన అడల్టరీ అంటే ఏంటీ? చట్టాలు ఏం చెబుతున్నాయి?
మీడియా ముందు పెట్టుకుంటున్న కుటుంబసభ్యులు
ఇది పూర్తిగా కుటుంబ పరమైన విషయం అయినప్పటికీ.. వారు మీడియా సమావేశాలు పెట్టి హడావుడి చేస్తున్నారు. దువ్వాడ శ్రీనివాస్ కూడా ప్రెస్ మీట్ పెట్టి తన భార్యపై ఆరోపణలు చేశారు. దివ్వెల మాధురీతోనే్ తాను ఉంటానని.. అలా ఉండటం తప్పు కాదన్నారు. తనకు తన భార్య శ్రీవాణి భోజనం కూడా పెట్టలేదని ఆరోపించారు. వీరి వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ వివాదంలో పిల్లలనుక కూడా చేర్చుకుని డీఎన్‌ఏ టెస్టులకూ డిమాండ్ చేసుకోవడంతో ఈ వివాదం ఎక్కడికి పోతుందోనని వారి కుటుంబసభ్యులు కూడా ఆందోళన చెందుతున్నారు.