YCP MLC Duvvada Srinivas  Divvaa Madhuri :  వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని క్యారెక్టర్ లేని మహిళగా ప్రచారం చేస్తున్నారని .. వారి కుటుంబ వ్యవహారం .. వారితోనే తేల్చుకోవాలని తనను లాగవద్దని దివ్వల మాధురీ అనే మహిళ ప్రెస్ మీట్ పెట్టారు. దువ్వాడ శ్రీనివాస్ .. వేరే మహిళతో సహజీవనం చేస్తూ ఇంటికి రావడం లేదని ఆయన కుమార్తెలు గురువారం రాత్రి  దివ్వల మాధురి ఇంటికి వెళ్లారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో దివ్వల మాధురి తన భర్తను ట్రాప్ చేసిందని దువ్వాడ వాణి ఆరోపించారు. ఈ ఆరోపణలపై దివ్వల మాధురి ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. 


తుపాకీ ఉంది లైసెన్స్ ఇవ్వండి - పోలీసులకు దరఖాస్తు చేసిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్


దువ్వాడ వాణి తన భర్తను వద్దనుకున్నారని.. తనకు అసెంబ్లీ టిక్కెట్ చాలనుకున్నారని ఆరోపించారు. తాను ఆత్మహత్య చేసుకోవాలనుకున్న ఓ దశలో దువ్వాడ శ్రీనివాస్ తనకు అండగా ఉన్నారని .. ఆయన ఓ ఫ్రెండ్, ఫీలాసపర్ ఇంకా అన్నీ అని ఆమె  చెప్పుకొచ్చారు. ఆయన చాలా నిజాయితీ పరుడని చెప్పుకొచ్చారు. ఆయనను ట్రాప్ చేయడానికి ఆయన వద్ద ఆస్తులేమీ లేవన్నారు. ఆయనకు ఉన్న ఆస్తులన్నీ కుటుంబానికి రాసిచ్చారని ఇంకా ఎం ఆశించి ట్రాప్ చేస్తామని దివ్వల మాధురి ప్రశ్నించారు. దువ్వాడ శ్రీనివాస్ ఎలక్షన్ కోసం తానే పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టానని తెలిపారు.ఆ విషయం వైసీపీ క్యాడర్ మొత్తానికి తెలుసన్నారు. 


ఎవరితో అయినా కలిసి ఉండే హక్కు తనకు ఉందన్నారు. తమది ఇల్లీగల్ ఎఫైర్ కాదని స్పష్టం చేశారు. దువ్వాడ వాణి కుటుంబంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆమె తన భర్తతో కూర్చుని పరిష్కరించుకోవాలని.. మధ్యలో తనపై ఆరోపణలు చేయకూడదని అన్నారు. తనపై ఆరోపణలు చేసింది కాబట్టే మీడియా ముందుకు వచ్చానన్నారు. తనకు ముగ్గురు పిల్లలు ఉన్నారని..తనను క్యారెక్టర్ లేనిదానిగా చేస్తే.. తన భవిష్యత్ కు ఎవరు బాధ్యత వహిస్తారని ఆమె ప్రశ్నించారు. టెక్కలిలో దువ్వాడ శ్రీవాణి ఎలాంటిదో అందరికీ తెలుసన్నారు. ఎలాగూ తనపై తప్పుడు ప్రచారం చేశారని..ఇకపై తాను దువ్వాడ శ్రీనివాస్ తో ఉండిపోతానని ప్రకటించారు. తనకు కూడ విడాకులు కాలేదని దివ్వల మాధురి చెప్పకొచ్చారు.               


వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీను ఇంటి ముందు కుమార్తెల ధర్నా- తమ సంగతేంటో తేల్చాలని పట్టు


దువ్వాడ శ్రీనివాస్  కుటుంబ వ్యవహారం ఇలా రోడ్డున పడటం టెక్కలిలో సంచలనం గామారింది. దివ్వల మాధురీ డాన్సులు చేస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఆమె వైసీపీ నేతగా కూడా ఉన్నారు. సోషల్ మీడియాలో దువ్వాడ శ్రీనివాస్ తో కలిసి ప్రచారం చేసిన ఫోటోలు ఉన్నాయి.అలాగే వారిద్దరూ విహారయాత్రలకు వెళ్లిన ఫోటోలు కూడా వైరల్ అవుతున్నాయి.ఇప్పుడు దివ్వల మాధురీ మీడియా ముందుకు రావడంతో.. దువ్వాడ శ్రినివాస్..ఈ వ్యవహారంపై స్పందించి ప్రజలకు వివరణ ఇవ్వాల్సి ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది.