MLC Duvwada Srinivas :   ఎవరైనా తమకు ప్రాణహాని ఉందని గన్ లైసెన్స్ కావాలని దరఖాస్తు చేస్తారు. ఒక వేల పోలీసులు లైసెన్స్ ఇవ్వాలనుకుంటే.. ఇస్తే.. ఆ లైసెన్స్‌లో ఇచ్చిన ఆమోదం ప్రకారం తుపాకీని కొనుగోలు చేసుకుంటారు. అదీ ప్రాసెస్ .. కానీ వైఎస్ఆర్‌సీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాత్రం డిఫరెంట్. ముందుగా ఆయన తనకు కావాల్సిన తుపాకీని కొనుక్కున్నారు. ఇప్పుడు దానికి లైసెన్స్ కావాలని పోలీసులకు దరఖాస్తు చేశారు. దువ్వాడ దరఖాస్తు చేసుకునన వైనం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 


సాధారణంగా అనుమతి లేకుండా తుపాకీ లాంటి ఆయుధాన్ని ఉంచుకుంటే అక్రమ ఆయుధాల కేసు పెడతారు. ఇది సీరియస్ నేరం అవుతుదంది. వెంటనే ఆయుధాన్ని స్వాధీనం చేసుకుని అరెస్టు చేస్తారు. అనధికారికంగా గన్ ఎలా కొనుగోలు చేశారో ఆరా తీస్తారు. అమ్మిన వాళ్లపై కేసులు పెడతారు. మరి ఈ విచిత్రమైన ఫిర్యాదు అందుకున్న టెక్కలి పోలీసులు ఏం చేయబోతున్నారన్న దానిపై ఆసక్తి వ్యక్తమవుతోంది. 


దువ్వాడ స్రీనివాస్ ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. ఆయన గత ఎన్నికల్లో  టెక్కలి నుంచి అచ్చెన్నాయుడు మీద పోటీ చేసి ఓడిపోయారు. పలుమార్లు పోటీ చేసి ఓడిపోతూ వస్తున్నారు. అనుచితమైన భాషను వాడటంలో ఆయన చాలా ముందు ఉంటారు. రాజకీయ ప్రత్యర్తి అచ్చెన్నాయుడుపై పలుమార్లు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన కుటుంబపరమైన సమస్యల్లోనూ ఇరుక్కున్నారు. ఆయన కుటుంబాన్ని వదిలి వేరే మహిళతో  నివసిస్తూండటంతో ఆయన పిల్లలు ఆందోళనకు దిగారు. ఈ వివాదాల తో తనకు  బెదిరింపు కాల్స్ వస్తున్నాయని తన దగ్గర ఉన్న తుపాకీకి లైసెన్స్ కావాలని ఆయన అడుగుతున్నారు.                                                


దువ్వాడ శ్రీనివాస్ కుమార్తెలు మీడియాలో ఆయనపై ఆరోపణలు చేస్తున్నారు. తమ తండ్రి వేరే మహిళ ట్రాప్ లో పడ్డారని తమను పట్టించుకోవడం లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. నిజానికి దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం కారణంగా ఆయనకు ప్రకటించిన టిక్కెట్‌ను తర్వాత జడ్పీటీసీగా ఉన్న తన భార్య వాణికి ఇప్పించారు. అయితే ఎన్నికల సమయానికి  మళ్లీ దువ్వాడ శ్రీనివాసే పోటీ చేశారు. కానీ భారీ తేడాతో ఓడిపోయారు.                                  


గన్ లైసెన్స్‌కు ఆయన చేసిన దరఖాస్తుతో మరిన్ని ఇబ్బందుల్లో కూరుకుపోయారని  ఆయన అనుచరులు భావిస్తున్నారు. కుటుంబపరమైన వివాదాలు ఉన్న సమయంలో ఆయన వద్ద  ప్రమాదకరమైన ఆయుధాన్ని .. అదీ అక్రమం అని తెలిసిన తర్వాత ఉంచేందుకు పోలీసులు అంగీకరించరని.... కేసులు పెట్టి స్వాధీనం చేసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. కుటంబపరంగా జరుగుతున్న వివాదంపై స్పందించడానికి దువ్వాడ శ్రీనివాస్ నిరాకరిస్తున్నరు.