YCP leaders are making accusations against Actor Jatwani character :  ఆంధ్రప్రదేశ్‌లో ముంబై నటి కాదంబరి జెత్వానీపై వేధింపుల కేసు సంచలనం సృష్టిస్తోంది. కీలకమైన ఐపీఎస్ అధికారులు ఓ మాఫియాలాగా ఏర్పడి .. తప్పుడు కేసులు పెట్టి.. కిడ్నాప్‌కు పాల్పడి వేధింపులకు గురి చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఈ కేసులో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పాత్ర ఉందన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో వైసీపీ నేతలు ఈ కేసులో చేస్తున్న వాదనలు ఆసక్తికరంగా మారాయి. 


జెత్వానీ మాయలేడీ అంటున్న అంబటి రాంబాబు


వైసీపీ ప్రధాన కార్యాలయంలో ప్రెస్మీట్  పెట్టిన అంబటి రాంబాబు జత్వానీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డిని ఇరికించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. అంతే కాదు ఆయన కాదంబరి జత్వానీని మాయ లేడీగా అభివర్ణించారు. అదే సమయంలో  ఈ కేసులో కీలకంగా మారిన ఫిర్యాదు దారు కుక్కల విద్యాసాగర్ ఓ టీవీ చానల్ చర్చలో తెరపైకి వచ్చారు. ఆయన తనను జెత్వానీ బ్లాక్ మెయిల్ చేస్తోందని ఆరోపించారు. చాలా కాలం నుంచి ఆమెతో పరిచయం ఉందన్నారు. ఆమె సీరియస్ బ్లాక్ మెయిలర్ అన్నారు. మరో వైపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సోషల్ మీడియా ఆమె క్యారెక్టర్ పై నిందలు వేస్తోంది. ఆమెపై దేశవ్యాప్తంగా కేసులు ఉన్నాయని.. ఆమె చీటర్ అని ఆరోపిస్తున్నారు. తనపై చేస్తున్న  ఆరోపణలపై జెత్వానీ కూడా స్పందించారు. తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.  


జెత్వానీపై పెట్టింది తప్పుడు కేసేనా - భూమి అమ్మకం అగ్రిమెంట్ చేసుకోలేదన్న నాగేశ్వరరరాజు - ఏం జరగబోతోంది ?


ఆమె ఎలాంటిదైనా తప్పుడు కేసులు పెట్టి వేధించడం చట్టసమ్మతం కాదు !


అయితే కాదంబరి జెత్వానీ విషయంలో వైసీపీ నేతలు, సోషల్ మీడియా చేస్తున్న ఆరోపణలు వారి వాదనను ఏ మాత్రం సమర్థించుకునేలా లేవన్న అభిప్రాయం వినిపిస్తోంది. జెత్వానీ ఎలాంటాది.. ఆమె మంచిదా కాదా అన్న అంశంపై ఇప్పుడు కేసు నడవడం లేదని ఆమెపై తప్పుడు కేసు పెట్టి తీసుకొచ్చి వేదించారన్న దానిపైనే కేసు నడుస్తోందని చెబుతున్నారు.  ఆమె  క్యారెక్టర్ కు సర్టిఫికెట్లు ఇవ్వడానికి వైసీపీ నేతలెవరన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఆమె ప్రాథమిక హక్కుల్ని హరించింది కాకుండా ఆమెపై ఎలా నిందలు వేస్తారని ప్రముఖ హేతువాది బాబు గోగినేని సోషల్ మీడియాలో ప్రశ్నించారు. 


 






హీరోయిన్ జత్వానీ కేసులో సజ్జల రామకృష్ణారెడ్డి - ఆయన పాత్ర ఉందా ? ఇరికిస్తున్నారా ?


జెత్వానీని తప్పు పట్టిన వైసీపీ వాదనపై విమర్శలు 


ఓ మహిళపై తప్పుడు కేసులు  పెట్టి వేధించిన ఘటనలో తమ పార్టీ నాయకుడ్ని.. అప్పటి పోలీసుల్ని ప్రశ్నించిన ప్రతిపక్ష పార్టీ ఇలా ఎందుకు సమర్థిస్తుందన్నది ప్రశ్నార్థకంగా మారింది. వారి ప్రమేయం ఉండబట్టే ఇలా సమర్థిస్తున్నారన్న చర్చ సామాన్య ప్రజల్లో వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నటి గురించి.. వ్యతిరేకంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఏమందని..ఆమె చెప్పేది తప్పు అయిదే.. ఆమెపై పెట్టిన కేసు నిజం అయితే... ఆమెను వేధించకపోతే ఆ చెప్పాలి కానీ.. ఆమె క్యారెక్టర్ కరెక్ట్ కాదు కాబట్టి అలా తప్పుడు కేసులు పెట్టడం సమంజసమేనన్నట్లుగా వాదించడం ఏమిటన్న ప్రశ్న అందరిలోనూ వస్తోంది.