Andhra News Hindupuram : ఉమ్మడి అనంతపురం జిల్లా హిందూపురంలో బాలకృష్ణ మెజార్టీ పెరుగుతందని వైసీపీ నేత , ఎమ్మెల్సీ ఇక్బాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదిపత్య పోరు కారణంగా ఆయన మూడు నెలల పాటు హిందూపురం నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. మళ్లీ నియోజకవర్గానికి వచ్చారు. ఈ సందర్భంగా హిందూపురంలో వైసీపీ పరిస్థితిపై కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇక్బాల్‌ను ఎవరూ కలవొద్దని నియోజకవర్గ ఇంచార్జ్ ఆదేశాలు
హిందూపురంలో వైసిపి ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మీడియాతో మాట్లాడారు. దీపిక ప్రస్తుతం నియోజకవర్గ ఇన్చార్జ్ మాత్రమేనని స్పష్టం చేశారు. సర్వేల ఆధారంగా ఎమ్మెల్యే కాండేట్ ని డిసైడ్ చేస్తారని అన్నారు. బెదిరింపు దోరణలు, గ్రూపు రాజకీయాలు చేస్తున్నారని ఇతర నేతలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రూపు రాజకీయాలు ఇలాగే కొనసాగితే కచ్చితంగా ఎమ్మెల్యే బాలకృష్ణకు మెజార్టీ పెరగడం ఖాయమన్నారు. ఇన్చార్జిని పక్కనపెట్టి ఒక రాజ్యాంగేతర శక్తి కూర్చొని పెత్తనం చాలయించడం ఏంటని... దీనివల్ల పార్టీ నష్టపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హిందూపూర్ కు తాను వస్తే తనను ఎవరు కలవొద్దని ఇంచార్జ్ వర్గీయులు వైసీపీ నేతల్ని హెచ్చరించారని ఇక్బాల్ మండిపడ్డారు. బెంగళూరులో బిజెపితో పని చేసుకుంటున్నాడు అక్కడే చేసుకోవాలి. బాబు రెడ్డి అనే వ్యక్తి ఇక్కడికి వచ్చి మాట్లాడుతాడు అతనికి ఏమి సంబంధమని ప్రశఅనించారు. హిందూపురంలో నాలుగున్నర సంవత్సరం కష్టపడ్డ తనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా పోటీ చేస్తానని తెలిపారు.
ఎమ్మెల్సీపై బాబురెడ్డి తీవ్ర విమర్శలు
ఎమ్మెల్సీ ఇక్బాల్ వ్యాఖ్యలను ఖండిస్తూ వైసిపి మాజీ సమన్వయకర్త బాబు రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి తిట్ల దండకం అందుకున్నారు. ఇక్బాల్‌కు బుద్ధి లేదు మతిస్థిమితం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. హూ ఇస్ దట్ బాబు రెడ్డి తనకు పార్టీకి సంబంధం, హిందూపురం కి సంబంధం ఏమిటి అని మాట్లాడారని.. ఎమ్మెల్సీ ఇక్బాల్ కు బుద్ధి లేదు మతిస్థిమితం లేదు ఏమైనా మాట్లాడుతాడన్నారు. పార్టీ పరువును బజార్లో పెడతాడు అతనికి కొత్తేమి కాదన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో హిందూపురంలో దీపిక గెలవడం కష్టం .. ఎక్కువ మెజార్టీతో ఎమ్మెల్యే బాలకృష్ణ గెలుస్తాడని బాధ్యతగల ప్రజా ప్రతినిధి ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి మాట్లాడతారా అని ప్రశఅనించారు. హిందూపురానికి నాలుగున్నర సంవత్సర కాలంలో ఇక్బాల్ నుంచి ఏం వచ్చింది. జిల్లా కేంద్రం, మెడికల్ కాలేజ్ పోగొట్టుకున్నామన్నారు. తాను హిందూపూర్ లోనే ఉంటాను ఇక్బాల్ తో చర్చించడానికి నేను రెడీ అన్నారు. టైము ప్లేస్ చెప్పండి అంటూ సవాల్ విసిరారు.
హిందూపురం వైసీపీలో లెక్కలేనన్ని గ్రూపులు
హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు బట్టబయలు కావడంతో కార్యకర్తలు నాయకులు డైలామాలో పడ్డారు. ఇప్పటికే వర్గ విబేధాల కారణంగా హత్యలు కూడా జరిగాయి. నవీన్ నిశ్చల్ వర్గం కూడా బలంగా టిక్కెట్ కోసం ప్రయత్నిస్తోంది. ఇలాంటి సమయంలో నియోజకవర్గంతో సంబంధం లేదని దీపికారెడ్డిని ఇంచార్జ్ గా వైసీపీ నాయకత్వ నియమించిది. అయితే పేరుకే దీపికా ఇంచార్జ్ అని.. మ౧త్తం బాబురెడ్డి అనే నేత పెత్తనం చేస్తున్నారు. దీనిపై ఇక్బాల్ విమర్శలు చేస్తున్నారు. ఇక్బాల్, బాబురెడ్డి సవాళ్లపై వైసిపి అధిష్టానం ఏరకంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.