YSRCP Coordinators Change : అసెంబ్లీ నియోజకవర్గాలపై సీఎం జగన్ విస్తృత కసరత్తు కొనసాగిస్తున్నారు. శుక్రవారం కూడా పలువురు నేతలు సీఎం క్యాంప్ కార్యాలయానికి వచ్చారు.
సీఎం కార్యాలయానికి వచ్చినవారిలో విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, మచిలీపట్నం ఎంపీ బాలశౌరి, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఎంపీ మోపిదేవి వెంకటరమణ, విజయవాడ తూర్పు కన్వీనర్ దేవినేని అవినాష్ తదితర నేతలు వెళ్లారు.. అయితే, కొంత మంది వివిధ పనులపై వస్తుండగా.. కొన్ని సెగ్మెంట్లలో మార్పుల నేపథ్యంలో వీరి రాకకు ప్రాధాన్యత ఏర్పడింది.
మరోవైపు తాడేపల్లిలోని సీఎంవోకు వచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి.. గిద్దలూరు సహా ప్రకాశం జిల్లాలో పలు నియోజకవర్గాల ఇంచార్జీల మార్పు పై సీఎంతో చర్చించే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది.. ఉమ్మడి ప్రకాశం జిల్లాలో గిద్దలూరు, ఎర్రగొండపాలెం, దర్శి, పర్చూరు వంటి సెగ్మెంట్లపై వైసీపీ అధిష్టానంతో బాలినేని శ్రీనివాసరెడ్డి చర్చలు జరపనున్నారట.. ఇప్పటికే ప్రకాశం జిల్లాలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో అనే చర్చ సాగుతోంది. తొలి విడతలో 11 సెగ్మెంట్లలో మార్పులు చేసింది వైసీపీ అధిష్టానం.. ఇక, రెండో విడత లిస్ట్ రెడీ అయ్యిందని.. రేపో మాపో లిస్ట్ వస్తుందనే చర్చ సాగుతోంది.
రెండో లిస్ట్ లో సుమారుగా 25 నియోజకవర్గాల్లో మార్పులు ఉండే అవకాశం ఉందనే చర్చ సాగుతోంది. గత కొంతకాలంగా మంత్రి రోజా స్థానం మారుస్తారనే చర్చ సాగుతూ వచ్చింది.. ఓ దశలో రోజాకు అసలు సీటు డౌటే అనే ప్రచారం సాగింది.. కానీ, నగరిలో మంత్రి ఆర్కే రోజా స్థానం సేఫ్ అని తెలుస్తోంది.. అంతే కాదు.. మంత్రి అంబటి రాంబాబు నియోజకవర్గం కూడా నో ఛేంజ్ అంటున్నారు. ఇక, దర్శి బాధ్యతలు మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డికి ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. కానీ, ఎమ్మిగనూరు పై ఇంకా స్పష్టత రాలేదు.. ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యేగా చెన్నకేశవరెడ్డి ఉన్నారు.. ఇప్పటికే ఆయనకు 82 ఏళ్ళ వయస్సు రావటంతో ప్రత్యామ్నాయం ఆలోచిస్తోందట పార్టీ హైకమాండ్.. ఎమ్మిగనూరు నుంచి బుట్టా రేణుక లేదా చెన్నకేశవ రెడ్డి ప్రతిపాదించే అభ్యర్థికి ఇచ్చే ఛాన్స్ ఉందంటున్నారు.
మైలవరం ఎమ్మెల్యేగా ఉన్న వసంత కృష్ణప్రసాద్ తానే పోటీ చేయబోనని ప్రకటించారు.. కానీ, ఎమ్మెల్యే వసంతను పిలిచి వైసీపీ అధిష్టానం బుజ్జగించిందట.. మరోసారి పోటీకి సిద్ధంగా ఉండాలని స్పష్టం చేసిందట.. దీంతో.. మరోసారి పోటీకి రెడీ అవుతున్నారట వసంత కృష్ణప్రసాద్. అయితే, రెండో జాబితాలో 30 నియోజకవర్గాల్లో మార్పులు ఉంటాయనే చర్చ సాగుతుండగా.. ఫైనల్‌లిస్ట్ వస్తేగానీ.. ఆయా స్థానాల్లో నేతల టెన్షన్‌కు తెరపడేలా లేదు.