SeshXHanuman Interview : టాలీవుడ్ లో వచ్చే సంక్రాంతి బరిలో అగ్ర హీరోల సినిమాలతో పాటు ఓ చిన్న సినిమా కూడా రిలీజ్ కాబోతోంది. ఆ సినిమా పేరే 'హనుమాన్'. టాలీవుడ్ లో తన ఫిలిం మేకింగ్ తో ఆకట్టుకున్న యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా హీరోగా నటిస్తున్న మూవీ ఇది. గతంలో ఈ కాంబినేషన్లో వచ్చిన 'జాంబిరెడ్డి' బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మరోసారి వీరి కాంబినేషన్లో రాబోతున్న 'హనుమాన్' పై ముందు నుంచే మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇక రీసెంట్ గా రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై ఆడియన్స్ లో విపరీతమైన క్యూరియాసిటీ పెంచేసింది.


సంక్రాంతి కానుకగా ఈ సినిమాని విడుదల చేయబోతున్నారు. రిలీజ్ టైం దగ్గర పడడంతో మేకర్స్ ప్రమోషన్స్ ని వేగవంతం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్ తో ఇంటర్వ్యూ ని ప్లాన్ చేశారు మూవీ టీం. ఈ ఇంటర్వ్యూ కు సంబంధించిన ప్రోమోని విడుదల చేయగా ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. 'SeshXHanuman' అనే పేరుతో ఈ ఇంటర్వ్యూని ప్లాన్ చేయగా ఇందులో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ , హీరో తేజా సజ్జా ఇద్దరిని అడివి శేష్ ఇంటర్వ్యూ చేశారు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ప్రోమో అంతా సరదాగా ఎంతో సరదాగా సాగింది.


అడవి శేష్ హనుమాన్ కోసం తేజ సజ్జానే హీరోగా తీసుకోవడం వెనుక రీజన్ ఏంటని? అడిగితే అందుకు ప్రశాంత్ వర్మ ఆసక్తికర ఆన్సర్స్ ఇచ్చారు. అలాగే తేజ సజ్జ హనుమాన్ మూవీకి సంబంధించి షాకింగ్ అప్డేట్ రివీల్ చేశాడు. హనుమాన్ మూవీ అనేది సూపర్ హీరో యూనివర్స్ లో భాగంగా ఉంటుందని, ఇందులో వేరే సూపర్ హీరోస్ వస్తారని అంటే.. అవును, అది నిజమే సూపర్ హీరో యూనివర్స్ లో మొత్తం 12 మంది సూపర్ హీరోస్ ఉంటారని ప్రశాంత్ వర్మ చెప్పడంతో అడివి శేష్ ఎక్సైటింగ్ గా ఆ 12 సూపర్ హీరోస్ ఎవరెవరు? అని అడిగారు. ఆ తర్వాత తేజ షూటింగ్లో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి వివరించాడు. అలా ఈ ప్రోమోలో అడవి శేష్ హనుమాన్ కు సంబంధించి అనేక విషయాలను అడిగి తెలుసుకున్నారు.


ఇక ఇందుకు సంబంధించిన ఫుల్ ఇంటర్వ్యూ ని డిసెంబర్ 31న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. సుమారు రూ.75 కోట్ల బడ్జెట్ తో ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై కె. నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. గ్రాఫిక్స్, VFX ప్రధానంగా తెరకెక్కిన ఈ సినిమాలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటిస్తోంది. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తుంది. కోలీవుడ్ యాక్టర్ వినయ్ రాయ్ విలన్ గా కనిపించబోతున్నాడు. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ, మరాఠీ భాషలతో పాటు ఇంగ్లీష్ స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ సహా మరికొన్ని విదేశీ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.


Also Read : ఓటీటీలోకి వచ్చేసిన ‘మై నేమ్ ఈజ్ శృతి’, హన్సిక కొత్త మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే!