Operation Lotus On YSRCP :  ఆపరేషన్ లోటస్ ఈ మాట బీజేపీ రాజకీయాల్లో కీలకం. ఇతర పార్టీల నేతల్ని చేర్చుకునేందుకు ఈ ఆపరేషన్ నిర్వహిస్తారని ఎక్కువ మంది నమ్ముతూ ఉంటారు. అయితే బీజేపీ మాత్రం ఇలాంటి ఆపరేషన్లు ఏమీ చేయలేదని.. భవిష్యత్ లో ఎప్పుడూ చేయబోమని అంటున్నారు. కానీ విపక్ష నేతలు మాత్రం..  బీజేపీ ఆపరేషన్ లోటస్ లు ప్రారంభించిందని ప్రకటిస్తున్నారు. తాజాగా తమిళనాడు కాంగ్రెస్ సీనియర్ నేత, చిదంబరం కుమారుడు కార్తీ చిదంబరం వైసీపీపై తర్వాత ఆపరేషన్ లోటస్ జరగబోతోందని సోషల్ మీడియాలో ప్రకటించారు. 


 





 


కార్తీ చిదంబరంకు   ఏదో సమాచారం లేకపోతే … ఏపీ రాజకీయాలు.. అదీ వైసీపీ గురించి ట్వీట్ పెట్టాల్సిన అవసరం లేదు. అయితే అదేమిటి  అనేది మాత్రం సస్పెన్స్ గా మారింది. వైఎస్ఆర్‌సీపీకి నలుగురు లోక్ సభ సభ్యులు ఉన్నారు. పదకొండు మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సమీప భవిష్యత్ లో ఆ పార్టీకి ఒక ఎమ్మెల్సీ లేదా ఓ రాజ్యసభ ఎంపీ సీటు వచ్చే అవకాశాలు లేవు. బీజేపీకి రాజ్యసభ సభ్యుల అవసరం ఉంది. టీడీపీ రాజ్యసభ సభ్యుల్ని గతంలో విలీనం చేసుకున్నట్లుగా ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీ రాజ్యసభ సభ్యుల్ని విలీనం చేసుకునే ప్రక్రియ ఏమైనా ప్రారంభించారా అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి.                         


బీజేపీకి రాజ్యసభలో పూర్తి స్థాయిలో మెజార్టీ లేదు. ఇంత కాలం వైఎస్ఆర్‌సీపీతో పాటు బీజేడీ ఏకపక్షంగా మద్దతు ఇస్తూ వచ్చాయి. అయితే ఇప్పుుడు కూడా వైసీపీ మద్దతిచ్చేందుకు సిద్ధంగా ఉంటుంది. వ్యతిరేకిస్తామని చెప్పే అవకాశం ఉందు.  వైసీపీలో వ్యాపార ప్రముఖులు ఎక్కవగా ఉన్నారు.  గుజరాత్ కు చెందిన పరిమళ్ నత్వానీ కూడా వైసీపీ ఎంపీనే. ఆయన బీజేపీలో చేరడానికి పెద్దగా ఆపరేషన్ చేపట్టాల్సిన అవసరం లేదు. తెలంగాణకు చెందిన కృష్ణయ్య, నిరంజన్ రెడ్డిలు కూడా వైసీపీ ఎంపీలే. అలాగే ఏపీ నుంచి  ఎంపీలుగా బీద మస్తాన్ రావు, ఆళ్ల అయోధ్య రామిరెడ్డి ,  విజయసాయిరెడ్డి  వంటి వారికి అనే అబ్లిగేషన్లు ఉన్నాయి. వీరిలో ఎవరినైనా బీజేపీ ఆహ్వానిస్తే .. తిరస్కరించే అవకాశం ఉండదన్న వాదన ఉంది.                                           


గెలిచిన  నలుగురు లోక్‌సభ ఎంపీలపైనా బీజేపీ కన్నేసే అవకాశం ఉందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. వైసీపీ తరపున గెలిచిన వారిలో అవినాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, తనూరాజా రాణి  విజయం సాధించారు. వీరిలో ఒకరిద్దరు బీజేపీతో చర్చలు జరుపుతున్నారన్న  ప్రచారం జరుగుతోంది. అయితే ఎన్నికలు జరిగి రోజులు కూడా గడవనందున.. ఒకటి, రెండు నెలల తర్వాత కీలక పరిణామాలు చోటు చేసుకోవచ్చన్న వాదన వినిపిస్తోంది.