who will be in the cabinet from Chittoor district  : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధికంగా 12 అసెంబ్లీ సీట్లు సాధించింది. పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, తంబళ్లపల్లె పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి మినహా అన్ని సీట్లు కూటమి పాగా వేసింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు చేసే క్రమంలో జిల్లాకు సంబంధించి ఎవరికి మంత్రి పదవి అనే దానిపై విస్తృతంగా చర్చ నడుస్తోంది.


జిల్లాకు సంబంధించి పలమనేరు ఎమ్మెల్యే గా గెలుపొందిన అమర్నాథ్ రెడ్డి కి మంత్రి పదవి వారించే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు. తొలుత టీడీపీ నుంచి వైసీపీ పార్టీలో కి వెళ్లారు. రాష్ట్ర విభజన తర్వాత 2014 జరిగిన ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలుపొంది టీటీడీ పార్టీలో చేరారు. అప్పట్లో ఆయనకు మంత్రి పదవి చంద్రబాబు నాయుడు ఇచ్చారు. తరువాత 2019లో టీడీపీ తరపున పోటీ చేసి ఓటమిపాలయ్యారు.  2014లో పార్టీలో చేరిన నాటి నుండి పార్టీని జిల్లా వ్యాప్తంగా తన బుజాల పై వేసుకుని నడిపించారు. చంద్రబాబు, లోకేష్ పాదయాత్ర సహా టీడీపీ ని 10 సంవత్సరాలు పాటు అనేక కష్టాలు ఇబ్బందుల్లో నడిపించారు. గతంలో చేసిన అనుభవాల దృష్ట్యా ఆయనకు మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది.


జిల్లాకు సంబంధించి కుటుంబ పరంగా మరో కీలక నాయకుడు పీలేరు ఎమ్మెల్యేగా గెలిచిన నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి. ఆయన విజయాన్ని రెండు సార్లు పరీక్షించుకుని మూడో సైరి కూటమిలో భాగంగా టీడీపీ సీటు వరించింది. గతంలో కుటుంబం లోని తండ్రి, సోదరుడు చేసిన అభివృద్ధి కి మరింత తోడ్పాటు అందించాలంటే మంత్రి పదవి అనడంలో అతిశయోక్తి లేదంటున్నారు కానీ  రాజకీయ సమీకరణాలు కలసి వచ్చే అవకాశాలు కనిపించడం లేదు. 


కుటుంబ వారసత్వానికి చెందిన మరో నాయకుడు శ్రీకాళహస్తి నియోజకవర్గ ఎమ్మెల్యే బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి. ఆయన తాత, తండ్రి పార్టీలో విశేష కృషి చేశారు. తండ్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి టీడీపీ పార్టీలో పుట్టి.. అక్కడే చివరి శ్వాస విడిచారు. ఆయన మంత్రి గా అనేక సార్లు అభివృద్ధి పదంలో దూసుకెళ్లేలా చేసారు. ఆయన బాటలో సుధీర్ రెడ్డి కి అవకాశం ఉందని అంటున్నారు. అయితే మొదటి సారి ఎమ్మెల్యేగా గెలవడం ఆయనకు మైనస్ అయ్యే అవకాశం ఉంది. 


ఇక నగరి నియోజకవర్గంలో మంత్రి రోజా పై అఖండ విజయం సాధించిన మరో నాయకులు గాలి భాను ప్రకాష్. అవినీతి మచ్చ లోని ఆయన తండ్రి గాలి ముద్దుకృష్ణమ నాయుడు అనేక సార్లు ఎమ్మెల్యేగా వివిధ శాఖల మంత్రిగా టీడీపీ పార్టీ కోసం ప్రారంభం నుంచి అలుపెరుగని పోరాటం చేసారు. ఆయన అడుగుజాడల్లో టీడీపీ పార్టీ లో గెలుపొందిన గాలి భాను ప్రకాష్ కు మంత్రి పదవి  పేరు పరిశీలనలో ఉండే అవకాశం ఉంది. 


రాష్ట్ర వ్యాప్తంగా కులాల ప్రాతిపదికన మంత్రి పదవులు కేటాయింపు చేస్తే ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇద్దరికి మంత్రి పదవులు వస్తాయని అంటున్నారు. మైనారిటీ నుంచి తక్కువ మంది కావడంతో సీనియర్ నాయకులు అయిన షాజహాన్ బాషాకు వచ్చే అవకాశం ఉంది. 


ఇక జనసేన తరపున తిరుపతి ఎమ్మెల్యే గా ఆరణి శ్రీనివాసులు గెలుపొందారు. రాయలసీమ లోనే ఏకైక బలిజ కులానికి చెందిన ఎమ్మెల్యే కావడంతో కులాల ప్రాతిపదికన మంత్రి పదవి వారించే అవకాశం ఉందని ప్రచారం సాగుతుంది. అందుకు సంబంధించి ఆయన కూడా గెలుపొందిన రెండో రోజు రాష్ట్ర నాయకులను కలవడం ప్రచారానికి మరింత బలం చేకూరుతుంది.


 టీడీపీ అధినేత సొంత గ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోని నారావారిపల్లె. అనేక సంవత్సరాల తరువాత టీడీపీకి చంద్రగిరిలో పూర్వం వైభవం సంతరించుకుంది. ఎంతో మంది నాయకులు టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపాలయ్యారు. 2019లో టీడీపీ తరపున పోటీ చేసి పులివర్తి నాని ఓటమి చెందిన తరువాత నియోజకవర్గంలో ఉంటూ అంతా తానై నడిపించారు. నియోజకవర్గంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ని ఎదిరించి.. పోరాడి విజయం సాధించారు. చంద్రగిరి కోట పై ఇంత కాలానికి విజయం సాధించి పసుపు జెండా ఎగురవేసిన ఆయనకు కూడా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.


ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎవరికి ఇంత మంత్రి పదవి అనే విషయం పై మాత్రం అధినేత నిర్ణయం మేరకు ఉన్న ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.