AP Weather Updates: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి తీరాన్ని దాటింది. అల్పపీడనం మరింత బలహీనపడి తమిళనాడు సరిహద్దులో వాయుగుండం తీరం దాటడంతో రాయలసీమ, తమిళనాడులో కొన్ని చోట్ల తేలికపాటి జల్లులు కురవనున్నాయి. చాలా ఏళ్ల తరువాత మార్చి నెలలో ఏర్పడిన అల్పపీడనం కనుక, ఇది అంతగా ప్రభావం చూపలేదని భారత వాతావరణ కేంద్రం తెలిపింది.  విశాఖ నగరంతో పాటుగా కోస్తా భాగాల్లో ఉక్కపోత మరింత ఎక్కువగా ఉండనుంది.


ఆంధ్రప్రదేశ్, యానాంలలో బలమైన గాలులు వీస్తున్నాయి మత్స్యకారులు వేటకు వెళ్లేందుకు అనువైన సమయం కాదని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గాలుల ప్రభావం తగ్గితేనే మత్స్యకారులు వేటకు వెళ్లాలని సూచించారు. ఏపీ, యానాంలలో ఈశాన్య దిశ నుంచి వేగంగా గాలులు వీస్తాయి. తీరం వెంట ప్రస్తుతం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. బాపట్లలో 32.4 డిగ్రీలు, కాకినాడలో 33.9 డిగ్రీలు, కలింగపట్నంలో 34.6 డిగ్రీలు, నందిగామలో 36 డిగ్రీలు, తునిలో 36.4 డిగ్రీలు, గన్నవరంలో 34.8 డిగ్రీలు, విశాఖపట్నంలో 35 డిగ్రీల మేర పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
నేడు చిత్తూరు జిల్లా పశ్చిమ ప్రాంతాల్లో, అనంతపురం జిల్లాలోని దక్షిణ​, పశ్చిమ ఏరియాలు మదనపల్లి, కదిరి, ధర్మవరంలలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని ఏపీ వెదర్ మ్యాన్ రిపోర్ట్ చేశారు. రేపటి నుంచి వాతావరణం మళ్లీ పొడిగా మారనుంది. తమిళనాడులోని చెన్నై, పుదుచ్చేరి మధ్యలోనే భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం పేర్కొంది. అనంతపురంలో చలిగాలులు వీస్తున్నాయి. అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 17.9 డిగ్రీలు, ఆరోగ్యవరంలో 19 డిగ్రీలు, నంద్యాలలో 19.2 డిగ్రీలుగా నమోదైంది.






తెలంగాణ వెదర్ అప్‌డేట్..
వాయుగుండం తీరాన్ని దాటినా దాని ప్రభావం ఏపీలోనూ ఉంటుంది. ఉదయం వేళ చల్లని గాలులతో పగటి ఉష్ణోగ్రతలు తగ్గుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆగ్నేయ దిశ నుంచి ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కనిష్ట ఉష్ణోగ్రతలు 21 డిగ్రీలు ఉండగా, పగటిపూట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల మేర నమోదుకానున్నాయి. వాతావరణం పొడిగా ఉంటుందని, ఏ మార్పులు ఉండవని వాతావరణ కేంద్రం పేర్కొంది. 


Also Read: Women's Day Wishes: మహిళా దినోత్సవం, ఈ అందమైన కోట్స్‌తో వనితామణులను విష్ చేయండి


Also Read: International Womens Day: మహిళలు ఆకాశంలో సగం కానీ అవకాశాల్లో సగం ఎప్పుడు !?