Pravin Tambe Biopic: ప్రవీణ్ తాంబే బయోపిక్ హాట్‌స్టార్‌లో - ఐపీఎల్‌లో అతనిది అరుదైన రికార్డు!

భారతీయ క్రికెటర్ ప్రవీణ్ తాంబే బయోపిక్ ‘తాంబే ఎవరు’ పేరుతో డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.

Continues below advertisement

Tambe Evaru: భారతీయ క్రికెటర్ ప్రవీణ్ తాంబే బయోపిక్ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘కౌన్ హై తాంబే?’ అనే పేరుతో ఈ బయోపిక్ డిస్నీప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది. ‘ప్రవీన్ తాంబే ఎవరు?’ అనే పేరుతో ఈ బయోపిక్ తెలుగులో కూడా విడుదల కానుంది.

Continues below advertisement

ఈ సినిమాను శీతల్ భాటియా, సుదీప్ తివారీ నిర్మించారు. జయ్‌ప్రద్ దేశాయ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. టైటిల్ రోల్‌లో శ్రేయస్ తల్పాడే కనిపించనున్నారు. 41 సంవత్సరాల వయస్సులో ప్రవీణ్ తాంబే ఐపీఎల్‌లో అరంగేట్రం చేశాడు. ఐపీఎల్‌లో అరంగేట్రం చేసిన పెద్ద వయస్కుడు ప్రవీణ్ తాంబేనే.

‘ప్రవీణ్ తాంబే 41 సంవత్సరాల వయసులో ఐపీఎల్‌లో అరంగేట్రం చేశారు. ఐపీఎల్ చరిత్రలో అరంగేట్రం చేసిన అత్యంత పెద్ద వయస్కుడు ప్రవీణే. కలలకు ఎక్స్‌పైరీ డేట్ ఉండదని తెలపడానికి ప్రవీణ్ తాంబే జీవితం ఉదాహరణ. ఈ సినిమా ద్వారా ప్రవీణ్ తాంబేను ప్రతి ఇంటికీ పరిచయం చేయాలనుకుంటున్నాం.’ అని నిర్మాత శీతల్ భాటియా అన్నారు.

Continues below advertisement