UP Exit Poll: ఐదు రాష్ట్రాల ఎన్నికలు దేశ రాజకీయాల్లో కీలకంగా మారనున్నాయి. ఈ ఎన్నికల నేపథ్యంలో ఏబీపీ న్యూస్, సీఓటర్ సంయుక్తంగా ఎగ్జిట్ పోల్ నిర్వహించింది. అతిపెద్ద రాష్ట్రం కావడంతో ఉత్తర్‌ప్రదేశ్‌లో ప్రజలు ఎవరికి అధికారం ఇస్తారనే ఆసక్తి దేశ వ్యాప్తంగా నెలకొంది. మరి యూపీలో గెలుపెవరిదో చూడండి.
యూపీ అసెంబ్లీ ఎన్నికలు 2022
తాజాగా చేసిన ఎగ్జిట్ పోల్స్‌లో అత్యధికంగా భాజపాకు 40 శాతం ఓట్లు, అఖిలేశ్ యాదవ్ సారథ్యంలోని సమాజ్ వాద్ పార్టీకి 33 శాతం ఓట్లు రానున్నాయని సర్వేలో తేలింది. గత ఎన్నికలతో పోల్చితే భాజపా ఓట్ల శాతం తగ్గుతుండగా.. ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా కాంగ్రెస్ మాత్రం అంతగా పుంజుకునే పరిస్థితి కనిపించడం లేదు. ఈ ఎన్నికల్లో తక్కువ ఓట్ల శాతంతో కాంగ్రెస్ రేసులో వెనుకంజ వేసేలా కనిపిస్తోంది.
ఏ పార్టీకి ఎన్ని సీట్లు..
403 సీట్లున్న యూపీ అసెంబ్లీలో భాజపా మెజార్టీ సీట్లు సొంతం చేసుకోనుందని సర్వేలో తేలింది. భాజపా 228 నుంచి 240 సీట్లతో యూపీలో మరోసారి అధికారంలోకి రానుందని ఎగ్జిట్ పోల్ చెబుతోంది. సమాజ్ వాదీ పార్టీ 132 నుంచి 148 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించనుంది. 2017తో పోల్చితే ఎస్పీ చాలా మెరుగైంది. మాయావతి బీఎస్పీ మరోసారి ప్రతికూల పరిస్థితులు ఎదుర్కునేలా కనిపిస్తోంది. గతంలో 19 సీట్లు రాగా, ఈ ఎన్నికల్లో 14 నుంచి 21 సీట్లు వస్తాయని సర్వేలో వెల్లడైంది. కాంగ్రెస్ పార్టీ గతంలో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. త్వరలో జరగనున్న ఎన్నికల్లోనూ 6 నుంచి 10 సీట్లకే సరిపెట్టుకోనున్నట్లు తేలింది.
Also Read: Punjab Exit Poll Live: పంజాబ్‌లో కాంగ్రెస్‌కు ఆమ్ఆద్మీ షాక్- మేజిక్ ఫిగర్ సామాన్యుడిదే!
Also Read: Uttarakhand Exit Poll Live: దేవభూమిలో ఢీ అంటే ఢీ- భాజపా, కాంగ్రెస్ మధ్య పోరు హోరాహోరీ!