Light rain predicted at isolated places Andhra Pradesh and Telangana: ఎండలో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఊరట కలగనుంది. నేటి నుంచి మూడు రోజులపాటు ఏపీలో వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవికాలంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రతో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, రాయలసీమలో తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఈ వర్షాలతో మిగతా చోట్ల ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా దిగిరానున్నాయి. తెలంగాణలో చల్లని గాలులు వీచడంతో ఎండ వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది.


ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణం చల్లగా మారిపోయింది. ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉండటంతో ప్రజలకు ఎండల నుంచి కాస్త ఊరట లభిస్తుంది. అల్లూరి సీతారామరాజు జిల్లా (పాడేరు)లో నేడు వర్షాలుంటాయి. మారేడుమిల్లి - రంపచోడవరం ప్రాంతాల్లో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన వర్షాలుంటాయి. మరోవైపు నల్లమల బెల్ట్ నందికొట్కూరు-నంద్యాల కొండ ప్రాంతంలో సాయంకాలం ఓ మోస్తరు వర్షాలు పడతాయి. అలాగే శ్రీకాకుళం జిల్లా, పార్వతీపురం మన్యం జిల్లాలో తేలికపాటి జల్లుల నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని ఏపీ వెదర్ మ్యాన్ అంచనా వేశారు. 2 నుంచి 3 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు దిగిరానున్నాయి.






దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో పెరిగిన ఉష్ణోగ్రతలు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నేడు తగ్గనున్నాయి. అకాల వర్షాల ప్రభావంతో రాయలసీమ కాస్త చల్లగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. ఉమ్మడి చిత్తూరు, కడప​, కర్నూలు, అనంతపురం జిల్లాలో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల దిగువకు వచ్చాయి. మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు పెరగవని, చల్లని గాలులు వీస్తాయని అంచనా వేశారు. ప్రతిరోజూ దాదాపు 5 లీటర్ల వరకు నీళ్లు తాగాలని, జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు.


తెలంగాణ వెదర్ అప్‌డేట్స్.. (Temperature in Telangana)
వేడి వల్ల భారీ ఉరుములు, మెరుపులతో ఈదురుగాలులతో వర్షాలు పడటం చాలా సహజం. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. కొన్ని జిల్లాల్లో చిరుజల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలుల ప్రభావం తగ్గింది.  


Also Read: Gold Rate Today: వరుసగా రెండోరోజు పెరిగిన బంగారం, వెండి ధరలు - లేటెస్ట్ రేట్లు ఇవీ !


Also Read: Kurnool News : పుట్టిన అరగంటలోనే, ఆడ బిడ్డను ఆసుపత్రిలో వదిలివెళ్లిపోయిన తల్లి