Weather Updates AP: నైరుతి బంగాళాఖాతం మీదుగా ఏర్పడ్డ "మాండౌస్" తుఫాను గత 6 గంటల్లో 11 కి.మీ వేగంతో వేగంగా పయనిస్తోంది. పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈరోజు డిసెంబర్ రాత్రి 8, 9 గంటల సమయంలో నైరుతి బంగాళాఖాతం మీదుగా, అక్షాంశం 9.5°N, రేఖాంశం 83.8°E దగ్గర కలిసంది. ట్రింకోమలీ (శ్రీలంక) కి తూర్పు ఈశాన్యంగా 300 కి.మీ. జాఫ్నా (శ్రీలంక)కి తూర్పు ఆగ్నేయంగా 420 కి.మీ., కారైకాల్కు తూర్పు ఆగ్నేయంగా 460 కి.మీ. చెన్నైకి ఆగ్నేయంగా 550 కి.మీ వద్ద కేంద్రీకృతమై ఉంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా పయనించి ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరికి మధ్య 9 డిసెంబర్ అర్ధరాత్రి తీరం దాటే అవకాశం ఉంది. అలగే పుదుచ్చేరి మరియు శ్రీహరికోట దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలను ఆనుకుని 65 నుండి 75 కి మీ గరిష్టముగా 85 కి.మీల వేగంతోగాలి వీచే అవకాశం ఉంది.
రాబోవు మూడు రోజుల్లో వర్ష సూచన..
డిసెంబర్ 8న కోస్తా తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షపాతం ఉంటుంది. చాలా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 09న తమిళనాడు పుదుచ్చేరి, దానిని ఆనుకుని ఉన్న దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పక్కనే ఉన్న రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. డిసెంబర్ 10వ తేదీన ఉత్తర తమిళనాడు, రాయలసీమ, దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లోని అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షపాతంతో నమోదు కానుంది. మరికొన్ని చోట్ల తేలికపాటి వర్షాలు పడతాయి.
గాలి హెచ్చరిక:
గంటకు 40-45 కి.మీ వేగంతో 55 కి.మీల వేగంతో ఆగ్నేయ బంగాళాఖాతంలో డిసెంబర్ 8వ తేదీన గాలులు వీచే అవకాశం ఉంది. నైరుతి బంగాళాఖాతంలో ఈ ఉదయం నుంచి 80-90 కేఎంపీహెచ్ వేగంతో గాలులు మొదలవుతాయి. రాత్రి 100 కేఎంపీహెచ్ వరకు పెరుగుతాయి. ఆ తర్వాత క్రమంగా తగ్గుతాయి. ప్రచండ గాలులు తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరం వెంబడి ఈ ఉదయం నుంచే ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు గంటకు 50-60 కి.మీ వేగంతో గాలులు ప్రారంభమవుతాయి. రేపు(శుక్రవారం) సాయంత్రం నుంచి డిసెంబర్ 10 ఉదయం వరకు 70-80 కేఎంపీహెచ్ నుంచి 90 కేఎంపీహెచ్ వరకు ఈదురుగాలులు వీస్తాయి. ఇది డిసెంబర్ 10 మధ్యాహ్నం నాటికి 50-60 కి.మీ వేగంతో 70 కి.మీ.కి, ఆపై డిసెంబర్ 10 రాత్రికి గంటకు 40-50 కి.మీ.కి 60 కి.మీకి తగ్గే అవకాశం ఉంది.
సముద్ర పరిస్థితి
10వ తేదీ ఉదయం వరకు పశ్చిమ మధ్య బంగాళాఖాతంలోని నైరుతి మరియు పరిసర ప్రాంతాలలో సముద్ర పరిస్థితి చాలా ఉధృతంగా ఉండి, ఆ తర్వాత క్రమంగా మెరుగుపడే అవకాశం ఉంది. దక్షిణ ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి తీరాల వెంబడి సముద్ర పరిస్థితి చాలా అల్లకల్లోలంగా ఉంటుంది. రేపు(శుక్రవారం) పరిస్థితి మరింత ఉద్ధృతంగా ఉంటుంది. అందుకే మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు సూచించారు. ఇప్పటికే వెళ్లిన వాళ్లు తిరిగి ఒడ్డుకు చేరుకోవాలని సూచిస్తున్నారు.