Weather Updates In AP: దక్షిణ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ప్రస్తుతం మధ్య ట్రోపో ఆవరణంలో బలమైన గాలులు వీచడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, యానాంలలో ఉష్ణోగ్రతలు దిగొస్తున్నాయి. నేటి నుంచి మరో రోజులపాటు ఏపీలో వర్షాలు కురవనున్నాయని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. వేసవికాలంలో మరోసారి వర్షాలు కురవనున్నాయి. ఏపీలో ఉత్తర కోస్తాంధ్ర, దక్షిణ కోస్తాంధ్రతో ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, దాని ప్రభావంతో రాయలసీమలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. తెలంగాణలో చల్లని గాలులు వీచడంతో ఎండ వేడి నుంచి ప్రజలకు ఉపశమనం కలుగుతుంది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలో.. (Temperature in Andhra Pradesh)
ఏపీలోని ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో వాతావరణంలో స్వల్ప మార్పులు జరిగాయి. దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడనున్న అల్పపీడనం గాలుల ప్రభావంతో ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, ఉభయ గోదావరి జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంది. ఈ జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు కురవనుండగా, మరికొన్ని చోట్ల తేలికపాటి జల్లులు పడతాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రైతులు ధాన్యం ఆరుబయట నిల్వ ఉంచకూడదని అధికారులు సూచించారు. మరో మూడు రోజులపాటు ఉష్ణోగ్రతలు తక్కువగానే ఉంటాయని తెలిపారు.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమ..
గత కొన్ని రోజులుగా భానుడి ప్రతాపంతో పెరిగిన ఉష్ణోగ్రతలు రాయలసీమ, దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో నిన్నటి నుంచి దిగొచ్చాయి. అకాల వర్షాల ప్రభావంతో రాయలసీమ కాస్త చల్లగా మారుతుందని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. అత్యధికంగా 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా, కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు పడనున్నాయి. ఉమ్మడి చిత్తూరు, అనంతపురం జిల్లాల్లో కొన్ని చోట్ల ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందని అమరావతి కేంద్రం పేర్కొంది. కోస్తాంధ్రతో పోల్చితే ఇక్కడ కనీసం 3, 4 డిగ్రీల కంటే ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నాయి.
తెలంగాణ వెదర్ అప్‌డేట్స్..
బంగాళాఖాతంలో ఏర్పడిన పరిస్థితుల ప్రభావం తెలుగు రాష్ట్రాలపై ఉంది. ఇటీవల 40 దాటిన ఉష్ణోగ్రతలు నిన్న దిగొచ్చాయి. ఏపీలో వర్షాల ప్రభావంలో రెండు మూడు రోజులపాటు తెలంగాణలో చలి గాలులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. కొన్ని జిల్లాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుంది. ఆదిలాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, నిజామాబాద్ జిల్లాల్లో వడగాలుల ప్రభావం తగ్గడంతో ప్రజలకు ఎండల నుంచి ఉపశమనం లభించనుంది.
Also Read: Gold-Silver Price: పసిడి ప్రియులకు భారీ షాక్! నేడు రూ.350 పైపైకి - వెండి కూడా, నేటి రేట్లు ఇవీ
Also Read: Sri Rama Navami 2022: శ్రీరాముడు నవమి రోజే ఎందుకు జన్మించాడు, ఆ తిథికి ఉన్న ప్రత్యేకత ఏంటి