Weather Latest News: నైరుతి బంగాళాఖాతంలో  కేంద్రీకృతమై ఉన్న వాయుగుండం గత 6 గంటల్లో గంటకు 18 కి.మీ వేగంతో పశ్చిమ-వాయువ్య దిశగా కదిలి, డిసెంబర్ 2l 08.30 గంటలకు  అక్షాంశం 10.6°N, రేఖాంశం 83.6°Eకి సమీపంలో అదే ప్రాంతంలో కేంద్రీకృతమై ఉంది. ఇది ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు-ఆగ్నేయంగా 440 కి.మీ, చెన్నైకి తూర్పు-ఆగ్నేయంగా 450 కి.మీ. నెల్లూరుకు దక్షిణ-ఆగ్నేయంగా 580 కి.మీ, బాపట్లకు దక్షిణ-ఆగ్నేయంగా 670 కి.మీ, మచిలీపట్నానికి ఆగ్నేయంగా 670 కి.మీ. దూరంలో కేంద్రీకరించి ఉంది. ఇది రానున్న 24 గంటల్లో పశ్చిమ వాయువ్య దిశగా పయనించి, నైరుతి బంగాళాఖాతంపై తుపానుగా మారే అవకాశం ఉంది. ఆ తర్వాత, అది వాయువ్య దిశగా కదులుతూ డిసెంబర్ 4వ తేదీ తెల్లవారుజామునకు దక్షిణ ఆంధ్రప్రదేశ్, దానికి ఆనుకొని ఉన్న ఉత్తర తమిళనాడు సమీపంలోని పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతానికి  చేరుకుంటుంది.


ఆ తర్వాత, ఇది దాదాపు గా ఉత్తరం వైపునకు కదులుతూ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరానికి దాదాపు సమాంతరంగా, దగ్గరగా కదులుతూ డిసెంబర్ 5వ తేదీ దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాన్ని నెల్లూరు, మచిలీపట్నం మధ్య తీరం దాటుతుంది. తుపాను తీరం దాటే సమయంలో గరిష్టంగా 80-90  kmph నుండి 100 kmph వేగంతో కూడిన ఈదురు గాలులు వీచే అవకాశం ఉంది.


ఈ రోజు క్రింది స్థాయిలోని గాలులు తూర్పు, ఆగ్నేయ దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయి. ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఎల్లుండి ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రాష్ట్రంలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది హెచ్చరికలు ఏవీ లేవు.


హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 20 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో తూర్పు, ఆగ్నేయ దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.8 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.5 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 67 శాతంగా నమోదైంది.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
పై వాతావరణ పరిస్థితుల వల్ల ఏపీపై బాగా ప్రభావం ఉండనున్నట్లుగా అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.


రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు. రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడనున్నాయి. 45 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి.