Weather Latest News: ఈ రోజు కింది స్థాయిలోని గాలులు తూర్పు, ఈశాన్య దిశ నుంచి తెలంగాణ రాష్ట్రం వైపుకి వీస్తున్నాయని హైదరాబాద్ లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. వాతావరణ హెచ్చరికలు ఏమీ జారీ చేయలేదు.


హైదరాబాద్‌లో వాతావరణం
హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతం అయి కనిపించనుంది. ఉదయం వేళల్లో హైదరాబాద్ నగరంలో పొగ మంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు వరుసగా 31 డిగ్రీలు, 19 డిగ్రీలుగా ఉండే అవకాశం ఉంది. ఉపరితల గాలులు గంటకు 6 నుంచి 8 కిలో మీటర్ల వేగంతో ఉత్తర, ఈశాన్య దిశలో వీచే అవకాశం ఉంది. నిన్న గరిష్ఠ ఉష్ణోగ్రత 30.6 డిగ్రీలు, కనిష్ఠ ఉష్ణోగ్రత 19.1 డిగ్రీలుగా నమోదైంది. గాలిలో తేమ 71 శాతంగా నమోదైంది.


ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణం
తూర్పు గాలులలో సగటు సముద్ర మట్టం వద్ద నుంచి ఏర్పడిన ద్రోణి శ్రీలంక నుంచి నైరుతి, దానిని ఆనుకొని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం వరకూ కొనసాగుతుందని అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తమిళనాడు తీరానికి ఆనుకొని నైరుతి బంగాళాఖాతంలో సగటు సముద్ర మట్టం నుంచి 3.1 కిలో మీటర్ల ఎత్తు వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని వివరించారు.


వీటి ప్రభావం ఏపీపై కాస్త ఉండనుంది. ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.


దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్‌, యానాంలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.


రాయలసీమలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులు రెండు మూడు చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు జారీ చేయలేదు.