ఏపీలో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతిలోని వాతావరణ కేంద్రం అధికారులు అంచనా వేశారు. అదే సమయంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణంగా నమోదవుతాయని తెలిపారు. వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానంగా తక్కువ ఎత్తులో ఉత్తర, ఈశాన్య గాలులు వీస్తున్నాయి. దీని ఫలితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకూ సాధారణంగానే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. కొన్ని చోట్ల మాత్రం సాధారణం కన్నా తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది.


ఉత్తర కోస్తా ఆంధ్ర, యానాం ప్రాంతాల్లో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. నేడు అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. 


దక్షిణ కోస్తా ఆంధ్రలో వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. నేడు అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. 


రాయలసీమలోనూ వచ్చే మూడు రోజులు వాతావరణం వాతావరణం పొడిగా ఉంటుంది. నేడు అక్కడక్కడ పొగమంచు ఏర్పడే అవకాశం ఉంటుంది. సాధారణ కనిష్ఠ ఉష్ణోగ్రతల కన్నా రెండు నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంటుంది. 






తెలంగాణలో ఇలా..
హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన వివరాల మేరకు.. రాష్ట్రమంతా ఎలాంటి వర్ష సూచన లేదు. వాతావరణం పొడిగానే ఉంటుంది. కానీ, రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. 






ఇక నేటి నుంచి చలి తీవ్రత తగ్గుముఖం పడుతుందని ఏపీ వెదర్ మ్యాన్ కూడా అంచనా వేశారు. వర్షాలు ఎక్కడ ఉండవని చెప్పారు. తీవ్రమైన చలి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో సోమవారం మాత్రం ఉంటుందని అన్నారు. మరోవైపు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో అంతగా చలి ఉండదు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో కాస్తంత చలి ఉంటుందని అంచనా వేశారు.