Weather Updates: దక్షిణ తమిళనాడు నుంచి రాయలసీమ వరకు అల్పపీడన ద్రోణి సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తు వరకు వ్యాపించి ఉంది. మరోవైపు వాయవ్య గాలులు తక్కువ ఎత్తులో ఏపీలో వీస్తున్నాయి. ఏపీలో మరో మూడు రోజులపాటు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అయితే కనిష్ట ఉష్ణోగ్రతలు ఇంకా తగ్గుతున్నాయి. ఉదయం వేళ పొగమంచు ఏర్పడుతుంది, ఏజెన్సీ ప్రాంతాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించారు.
కోస్తాంధ్ర, యానం ప్రాంతాల్లో నేడు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల్లో మరో రెండు రోజులపాటు ఎలాంటి వర్ష సూచన లేదని, వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు వెల్లడించారు. మత్స్యకారులు వేటకు వెళ్లడానికి ఏ ఇబ్బంది లేదని లేదని అధికారులు సూచించారు. రైతులు ధాన్యం విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. కళింగపట్నంలో 17.4 డిగ్రీలు, మచిలీపట్నంలో 19, బాపట్లలో 17.7, అమరావతిలో 17.5 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమలో అల్పపీడన ప్రభావం కొనసాగుతున్నా నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుంది. రెండు రోజుల తరువాత వాతావరణం పొడిగా ఉంటుందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రతో పోల్చితే రాయలసీమలో చలి తీవ్రత అధికంగా ఉంది. అనంతపురంలో కనిష్ట ఉష్ణోగ్రత 16.7 డిగ్రీలకు పడిపోగా.. కర్నూలులో 19.3 డిగ్రీలు, తిరుపతిలో 19.1డిగ్రీలు ఉంది.
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో కనిష్ట ఉష్ణోగ్రత 16 డిగ్రీలు ఉండగా, గరిష్ట ఉష్ణోగ్రతలు 33 డిగ్రీల వరకు నమోదు అవుతున్నాయి. నైరుతి దిశ నుంచి గంటకు 4 నుంచి 6 కిలోమీటర్ల వేగంతో రాష్ట్రంలో గాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేటి నుంచి మరో రెండు రోజులపాటు వాతావరణం పొడిగా ఉండనుంది. ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాలేదు.
Also Read: Gold Rate Today: గుడ్ న్యూస్.. నిలకడగా పసిడి ధర.. స్వల్పంగా దిగొచ్చిన వెండి.. లేటెస్ట్ రేట్లు ఇవీ