Weather Updates In Telangana: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంలో స్వల్ప మార్పులు కనిపిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఏపీ, తెలంగాణ ప్రజలను వణికించిన చలి కాస్త తగ్గింది. రెండు వైపుల నుంచి గాలులు వీస్తున్నా, వాటి ప్రభావం కాస్త తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరగడంతో చలి తగ్గింది. మొన్నటివరకు ఉత్తర దిశ నుంచి వీచే గాలుల ప్రభావంతో చలి బాగా పెరగగా.. తాజాగా ఆగ్నేశ దిశ నుంచి గాలులు తక్కువ ఎత్తులో వీచడంతో ఉష్ణోగ్రతలు మళ్లీ గాడిన పడుతున్నాయి. 


ఆగ్నేయ దిశ, తూర్పు వైపు నుంచి ఆంధ్రప్రదేశ్‌లో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఉత్తర కోస్తాంధ్ర, యానాం ప్రాంతాల్లో నేడు, రేపు వాతావరణం పొడిగా ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉంటుందని వర్షాలు కురిసే అవకాశం లేదని సమాచారం. ఉత్తరాది గాలుల ప్రభావం తగ్గడంతో కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. విశాఖ ఏజెన్సీలో 10 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదవుతోంది. ఆంధ్రా కాశ్మీర్‌గా చెప్పుకునే లంబసింగి సముద్రపు మట్టం నుంచి 1000 మీటర్ల ఎత్తులో ఉంది. కొండలు, లోయల వల్ల చలి తీవ్రత ఎక్కువ అవుతుంది. గత కొన్నేళ్లలో రెండు సార్లు మాత్రమే మంచు కురిసినట్లు సమాచారం. డిసెంబర్ మొదటివారం నుంచి జనవరి నెలాఖరు వరకు చలి తీవ్రత లంబసింగి, పాడేరు పక్కన ఉన్న వంజాంగి, పెదబాయలులో అధికంగా ఉంటుంది. పొగ మంచును చూసి కొందరు మంచు కురిసిందనుకుంటారు.






దక్షిణ కోస్తాంద్రలో మరో రెండు రోజులు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది. గత మూడు రోజులుగా కనిష్ట ఉష్ణోగ్రతలు కాస్త పెరిగాయి. మరో రెండు రోజుల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని సంచాలకులు పేర్కొన్నారు.  రాయలసీమలో చలి తీవ్రత కాస్త తగ్గుముఖం పట్టింది. అరకుకి పోటిగా చిత్తూరు జిల్లా హార్స్‌లీ హిల్స్ లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.  హార్స్‌లీ హిల్స్, అరోగ్యవరం, మదనపల్లెలో 10 డిగ్రీలకు పైగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అనంతపురం జిల్లా మడకశిరలో, కుందుర్పిలో, సోమండెపల్లెలో.. కర్నూలు జిల్లా మంత్రాలయం, హలహర్విలో.. కడప జిల్లా రాయచోటిలో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


తెలంగాణ వెదర్ అప్‌డేట్..
తెలంగాణలో పెద్దగా మార్పులు లేవని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. నేడు వాతావరణ పొడిగా ఉంటుంది. డిసెంబర్ 28, 29 తేదీలలో అక్కడక్కడా తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. గాలులు వీస్తున్నా కనిష్ట ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఆదిలాబాద్, కొమురం భీమ్, ఆసిఫాబాద్, మంచిర్యాల, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, ములుగు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్ జిల్లాలలోసైతం కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. ఎలాంటి వాతావరణ హెచ్చరికలు జారీ కాలేదు.
Also Read: Gold-Silver Price: నేడు బంగారం ధరలో స్వల్ప మార్పు.. పెరిగిన వెండి, తాజా రేట్లు ఇవీ.. 
Also Read: Year Ender 2021: మోదీ షాకిచ్చిన 5 ప్రకటనలు..! సారీతో సంచలనం


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి