Weather Updates: ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలపై ఉంటుందని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. తక్కువ ఎత్తులో ఈశాన్య దిశ నుంచి తమిళనాడు, ఏపీ తీరం వెంట, బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో గాలులు వీస్తున్నాయి. వీటి ప్రభావంతో ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.
ఉత్తర కోస్తాంధ్ర, యానాంలలో నేటి నుంచి మూడు రోజులపాటు తేలికపాటి జల్లులు కురవనున్నాయి. ఒకట్రెండు చోట్ల ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. దక్షిణ కోస్తాంధ్రలో నేడు తేలికపాటి వర్షాలు కురవనుండగా.. రేపు, ఎల్లుండి కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల వాసులు మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా తీర ప్రాంతాల్లో సముద్రంలో వేటకు వెళ్లడం ప్రమాదకరమని మత్స్యాకారులను అప్రమత్తం చేశారు. రాయలసీమలో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురవనున్నాయి. రేపు, ఎల్లుండి ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతారణ కేంద్రం పేర్కొంది.
Also Read: Kurnool Onion Market: గిట్టుబాటు ధరలేక ఆగ్రహించిన ఉల్లి రైతు... పెట్రోల్ పోసి ఉల్లిబస్తాలకు నిప్పు
తెలంగాణ వెదర్ అప్‌డేట్..
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలో తేలికపాటి జల్లులు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా పగటి ఉష్ణోగ్రతలు భారీగా పడిపోతాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో వాతారణం పొడిగా ఉంటుండగా.. కొన్ని చోట్ల చిరు జల్లులు పడనున్నాయి. మరో రెండు రోజులు రాష్ట్ర వ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుందని వాతావరణ కేంద్రం స్పష్టం చేసింది.
Also Read: లాన్స్ నాయక్ సాయితేజ కుటుంబానికి ఆర్థిక సాయం ప్రకటించిన ఏపీ ప్రభుత్వం