Vizianagaram Fire Accident : విజయనగరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. స్థానికంగా ఉన్న విశాల్ మార్ట్ లో ఆదివారం మంటలు చెలరేగాయి. మార్ట్ ను తెరిచి లోపల స్విచ్ ఆన్ చేయగానే ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. మొదటి అంతస్తులో మొదలైన మంటలు మూడో అంతస్తు వరకు వ్యాపించారు. ఈ అగ్ని ప్రమాదంతో సుమారు రూ.3 కోట్ల ఆస్తి నష్టం జరిగిందని యాజమాన్యం తెలిపింది. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపుచేశారు. డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాదంపై ఆరా తీశారు. నగరంలో ట్రాఫిక్ జామ్ అవ్వడంతో దారి మళ్లింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ తెలిపారు. అగ్ని ప్రమాదం ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.
తిరుపతిలో భారీ అగ్నిప్రమాదం
చాలా మందికి ఏదైనా కొన్న వెంటనే వాటిని వాడటం అలవాటు. అయితే దీపావళి పండుగ సందర్భంగా ఓ వ్యక్తి టపాసులు కొనుగోలు చేశాడు. అతడి అత్యుత్సాహంతో బాణాసంచా దుకాదారులతో పాటు కొనుగోలు దారులను పరుగులు పెట్టాల్సి వచ్చిందంటే. ఎందుకంటే.. కొనుగోలు చేసిన బాణాసంచాల నాణ్యతను పరిశీలించాకున్నాడు. ఆత్రం ఆగలేక పరుగున వెళ్లి దుకాణానికి దగ్గర్లోనే టపాసులను వెలిగించాడు. దీంతో ఆ బాణాసంచా పేలి నిప్పురవ్వలు చుట్టుపక్కల ఉన్న దుకాణాల్లోకి ఎగిసి పడ్డాయి. దీంతో స్థానికంగా ఉన్న దుకాణాలన్నింటిలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న టపాసులన్నీ పేలి పోయాయి. అయితే విషయం గుర్తించిన దుకాణాదారులు, కొనుగోలుదారులు అప్రమత్తమై దూరంగా పరుగులు పెట్టారు. ఈ ఘటన తిరుపతి జిల్లాలోని వడవలపేట మండలంలోని నారాయణదాసు తోటలో చోటు చేసుకుంది. బాధితుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన రంగంలోకి దిగారు. ఫైర్ ఇంజిన్ తో వచ్చి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ఘటనలో సుమారు 20 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని బాధితులు తెలిపారు. టపాసుల దుకాణాల యజమానుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
విజయవాడలో అగ్నిప్రమాదం
విజయవాడలో భారీ అగ్ని ప్రమాదం జరిగినా గ్రౌండ్స్ లో దీపావళికి ఏర్పాటు చేసిన టపాసుల స్టాల్స్ లో మంటలు చెలరేగాయి. టపాసుల స్టాల్స్ లో క్రాకర్స్ భారీ శబ్ధంతో పేలిపోతున్నాయి. దీంతో కొన్ని స్టాల్స్ అగ్నికి కాలిపోతున్నాయి. దుకాణదారులు, స్థానికులు ప్రాణ భయంతో గ్రౌండ్ బయటకు పరుగులు తీశారు. ఈ అగ్నిప్రమాదంలో ఇద్దరు సజీవ దహనమయ్యారని సమాచారం. మరికొందరు స్థానికుల సహాయంతో దుకాణాదారులు మంటల్ని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న పోలీసులు జింఖానా గ్రౌండ్ కు వెళ్లి పరిశీలిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన స్టాల్స్ షాపుల వారికి లక్షల రూపాయల నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమికంగా భావిస్తున్నారు.
Also Read : Prabhas Fans అత్యుత్సాహంతో థియేటర్‌లో మంటలు, ప్రాణ భయంతో ప్రేక్షకుల పరుగులు