Minister Botsa Fires : మంత్రి బొత్స సత్యనారాయణ ఫైర్ అయ్యారు. అయితే ఈసారి ప్రతిపక్ష నేతలపై కాదండోయ్.. వైసీపీ నేతలపైనే. విజయనగరం జిల్లాలో ఆసరా కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా వైసీపీ నేతలు తమ సమస్యలు చెప్పుకునేందుకు మంత్రి బొత్స కారును ఆపారు. వాళ్లు ఏదో చెప్తుండగా మంత్రి బొత్స సత్యనారాయణకు చిర్రెత్తుకొచ్చింది. శృంగవరపుకోట నియోజకవర్గ ద్వితీయ శ్రేణి వైసీపీ నాయకులకు వార్నింగ్ ఇచ్చారు.  ఆసరా కార్యక్రమం ముగించుకుని వెళ్తుండగా స్థానిక వైసీపీ ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజుపై ఫిర్యాదు చేయడానికి వైసీపీ నాయకులు మంత్రి బొత్స కాన్వాయ్ దగ్గరకు వెళ్లిన నాయకులపై ఆయన మండిపడ్డారు.  ఫిర్యాదు చేయడానికి ఇది సమయం కాదని కావాలంటే విజయనగరం వచ్చి ఫిర్యాదు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే పక్కనే ఉంటుండగా ఎమ్మెల్సీపై ఫిర్యాదు చేయడంతో బొత్స నేతలకు క్లాస్ పీకారు. మాకు లేవా బాధలు, మీకేనా... యూజ్ లెస్ ఫెలో, నువ్వు పెద్ద పోటుగాడివా అంటూ బొత్స రెచ్చిపోయారు. ఈ  తతంగాన్ని వీడియో తీస్తున్న జర్నలిస్టును కెమెరా ఆఫ్ చేయాలని ఆదేశించారు.  


  "ఉంటే ఉండు లేకపోతే పక్కకు పో.. ఏం తమాషా చేస్తున్నావా యూజ్ లెస్ ఫెలో. నువ్వా మమ్మల్ని క్వశ్చన్ చేసేది. ఏం మాట్లాడుతున్నావో బుర్రపెట్టి మాట్లాడు. నీకేంటి బాధ. మాకు బాధలు లేవా? తమాషా చేస్తున్నావు. అడిగేవాడు లేక మీకు ఇన్ డిస్ప్లేన్ పెరిగిపోయింది. నువ్వేమైనా పోటుగాడివి అనుకున్నావా, వీళ్లందరు చేతగాని వాళ్లా?"  అంటూ వైసీపీ నేతపై మంత్రి బొత్స ఆగ్రహం వ్యక్తం చేశారు.