vizag to Tirupati special trains | విశాఖపట్నం: ఆగస్టు,సెప్టెంబర్ నెలల్లో  వస్తున్న వరుస పండుగలను దృష్టిలో పెట్టుకుని విశాఖపట్నం నుండి తిరుపతి, చర్లపల్లి  రూట్ లలో ప్రత్యేక రైళ్ళను నడుపుతోంది రైల్వే శాఖ. ఆ మేరకు  ఈస్ట్ కోస్ట్ రైల్వే ఈ ప్రత్యేక రైళ్ల డీటెయిల్స్  ప్రకటించింది.

1) విశాఖపట్నం - తిరుపతి ట్రైన్

 ట్రైన్ నెంబర్ 08547 విశాఖపట్నం తిరుపతి వీక్లీ ఎక్స్ప్రెస్ 06.08.2025 నుండి 24.09.2025 వరకూ నడవబోతోంది. ప్రతి బుధవారం రాత్రి 7 గంటలకు విశాఖపట్నంలో  బయలుదేరే ఈ ట్రైన్  గురువారం ఉదయం 9:15 కి తిరుపతి చేరుకుంటుంది.  అలాగే తిరుగు ప్రయాణంలో  ప్రతి గురువారం రాత్రి 09:50 కి తిరుపతిలో బయలుదేరే ప్రత్యేక రైల్ (08548) శుక్రవారం ఉదయం 11:30 కు వైజాగ్ రీచ్ అవుతుంది.

స్థాప్స్ : 

వైజాగ్ -తిరుపతి మధ్య ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట స్టేషన్ లలో ఆగుతుంది.

కోచ్ పొజిషన్స్ : 

 రెండు సెకండ్ ఏసి, మూడు 3AC, మూడు  3AC ఎకానమీ, ఎనిమిది స్లీపర్ క్లాస్, 4 జనరల్ కోచ్ లు, ఒక లగేజి కమ్ దివ్యాంగుల కోచ్ ఉంటాయి

2) వైజాగ్-చర్లపల్లి ట్రైన్ ట్రైన్ నెంబర్ 08579 విశాఖపట్నం చర్లపల్లి వీక్లీ ఎక్స్ప్రెస్ 08.08.2025 నుండి 26.09.2025 వరకూ నడవబోతోంది. ప్రతి శుక్రవారం  సాయంత్రం  5:30 గంటలకు  విశాఖపట్నంలో  బయలుదేరే ఈ ట్రైన్  శనివారం ఉదయం 8గంటలకు కి చర్లపల్లి చేరుకుంటుంది.  అలాగే తిరుగు ప్రయాణంలో  ప్రతి శనివారం మధ్యాహ్నం 03:30 కి చర్లపల్లి లో లో బయలుదేరే ప్రత్యేక రైల్ (08580) ఆదివారం ఉదయం 7:00 గంటలకు వైజాగ్ రీచ్ అవుతుంది.

స్థాప్స్ : 

వైజాగ్ -చర్లపల్లి మధ్య ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం టౌన్,ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, కృష్ణా కెనాల్, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి స్టేషన్ లలో ఆగుతుంది.

కోచ్ పొజిషన్స్ :  రెండు సెకండ్ ఏసి, మూడు 3AC, రెండు 3AC ఎకానమీ, ఎనిమిది స్లీపర్ క్లాస్, 4 జనరల్ కోచ్ లు, ఒక లగేజి కమ్ దివ్యాంగుల కోచ్ ఉంటాయి

నిజానికి ఈ రైళ్లు  ప్రస్తుతం నడుస్తూనే ఉన్నా పండుగల రద్దీని దృష్టిలో పెట్టుకుని మరో రెండు నెలలపాటు పొడిగించినట్లు  వాల్తేరు డివిజన్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ K. సందీప్ తెలిపారు.