Uttarandhra Charcha Vedika : విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర చర్చా వేదికలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా గతంలో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు  మద్దతుగా మాట్లాడిన లోక్‌సత్తా నేత జేపీకి నిరసన సెగ తగిలింది. జయ ప్రకాష్ నారాయణ మాట్లాడుతున్న సమయంలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటికరణ మాట్లాడాలని నినాదాలు చేసిన స్టీల్ ప్లాంట్ కార్మికులు కోరారు. అయితే  ఇప్పుడు సమయం కాదు మరో సమావేశంలో చర్చ జరుపుదామని జయప్రకాష్ నారాయణ సూచించారు. జెపి నిర్ణయాన్ని వ్యతిరేకించిన కార్మిక సంఘాల నేతలు నినాదాలు చేశారు. స్టీల్ ప్లాంట్ అంశంపై జేపీ మాట్లాడలేదు. 


ఉత్తరాంధ్ర చర్చా వేదిక వల్ల పాత మిత్రులను కలిసే అవకాశం వచ్చిందని..  ఎన్నికల వ్యవస్థ లో మౌలిక మార్పులు కోసం పోరాటం చేస్తున్నామని జేపీ తెలిపారు.  రాజకీయ నాయకులు అంటే తెల్ల చొక్కాలు వేసుకునే దుర్మార్గులుగా చిత్రీకరిస్తున్నారని..  కొణతాల లాంటి వాళ్ళ ఉన్న వరకు సమాజానికి రక్షణ గా నిలుస్తున్నారని అభినందించారు. అభివృద్ధి ప్రభుత్వాల వల్ల కాదు. .. ప్రభుత్వాలు వారి పనులు వారు చేసి మౌలిక సదుపాయాలు కల్పిస్తే అభివృద్ధి వస్తుందన్నారు.  ఈ రోజు ప్రభుత్వాలు దివాలా లో ఉన్నాయని..  జాతీయ స్థాయిలో 17 లక్షల కోట్లు రుణం తీసుకున్నారన్నారు.  రోజు వారీ ఖర్చులకు అప్పు చేసి పెడుతున్నారన్నారు.  పన్నులు డబ్బులను అన్ని ప్రాంతాలకు ఇవ్వాల్సి ఉందన్నారు. 


ఉత్తరాంధ్ర చర్చా వేదిక లో   జనసేన పి ఏ సి ఛైర్మన్  నాదెండ్ల మనోహర్ కూడా ప్రసంగించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా జనసేన విశాఖ లో సభ నిర్వహిచిందన్నారు. అఖిల పక్షాన్ని కేంద్రం దగ్గరకు తీసుకొని వెళ్లాలని మేము ఈరాష్ట్ర ప్రభుత్వాన్ని కోరామని గుర్తు చేశారు. పార్టీలకు అతీతంగా ఉత్తరాంధ్ర అభివృద్ధి కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఉత్తరాంధ్రను అభివృద్ధి చేస్తేనే..రాష్ట్రం అభివృద్ధి అవుతుందన్నారు. ఐ టి  సమ్మీట్లు, ఇన్వెస్ట్ సమ్మిట్ లు చేస్తున్నారు గాని ఉపాధి కల్పించలేకపోతున్నారని విమర్శించారు. ఉత్తరాంధ్ర యువత ఉపాధి కోసం బయటకు వెళ్లకుండా ఇక్కడ దొరకాలి అనుకుంటున్నారని..ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం చేసే ఆ కార్యక్రమానికి జనసేన మద్దతు ఇస్తుందన్నారు. 
 
ప్రభుత్వం చేయాలిసినవి చేస్తే చాలన్నారు.  రావులపాలెం నుంచి అమలాపురం వెళ్ళడానికి మూడు గంటలు పడుతోందని చెప్తున్నారు. పోలీస్ స్టేషన్ కు వెళ్తే న్యాయం జరుగుతుందనే  నమ్మకం లేకుండా పోయిందన్నారు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి చేయకపోవడం అన్యాయమన్నరాు. . పోలవరం ఎప్పుడో పూర్తి కావాల్సి ఉందని.. ఇప్పుడు  40 ఏళ్ళు ఐన కూడా కాదు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మహానది నుంచి గోదావరి సంధానం చేయాల్సి ఉందన్నారు. ఒడిశా పేద రాష్ట్రం ..మనకంటే ముందుకు వెళ్తున్నారన్నారు. మన తెలుగు రాష్ట్రాలు మించి ఎన్నికల ఖర్చు ఎవ్వరు చెయ్యలేరు...దేశంలో ఎన్నికల ఖర్చు ఎక్కువ చేసేది మొదలు మన తెలుగు రాష్ట్రాలేనని గుర్తు చేశారు.  


ఉత్తరాంధ్రకు ఏం కావాలి.. అన్న అంశంపై కొణతాల రామకృష్ణ నేతృత్వంలో చర్చా వేదిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.