సంచలన కామెంట్స్ చేస్తూ తరచూ వార్తల్లో ఉండే వ్యక్తి మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ రావు మరోసారి తన మార్క్ కామెంట్స్ చేశారు. ఈసారి ఆయన దేవాలయ భూములను ఎంచుకున్నారు. నేరుగా ప్రభుత్వాన్నే టార్గెట్ చేసుకున్నట్టు కనిపిస్తోంది.
దేవాలయాల భూములను ప్రభుత్వా లు ఇష్టమొచ్చినట్లు అమ్మడానికి చట్టంలో అవకాశం లేదని బాంబు పేల్చారు మాజీమంత్రి, శ్రీకాకు ళం ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు. దాతలు ఏ ప్రయోజనాల కోసం దేవాలయాలకు ఆస్తులు ఇచ్చారో వాటిని మెరుగుపరిచేందుకు అవసరమైతే అమ్ముకోవచ్చని కోర్టు వెసులుబాటు ఇచ్చిందన్నారు. కానీ దేవలయాల భూములు దేవాలయా ఆస్తులలు కావని.. ఇంతకు ముందు చేసన చట్టాలు ఇదే విషయాన్ని చెప్తున్నాయంటూ వివరించారు.
ఇటీవల ధర్మాన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారుతున్నాయి. ఇప్పుడు దేవాలయాల ఆస్తులపై ఆయన చేసిన కామెంట్స్ జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. గతంలోనూ ఉపాధి హామీ, వ్యవసాయం వంటి అంశాలపై హాట్ కామెంట్స్ చేశారు ధర్మాన.
బుధవారం కోదండ రామ ఆలయ నూతన పాలకవర్గం సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవానికి ధర్మాన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా మాట్లాడిన ధర్మాన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
ముందుగా పాలకమండలి సభ్యులతో ధర్మాన ప్రసాదరావు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైదిక కార్యక్రమాల నిర్వహణపైనా,ఇక్కడి కార్యకలాపాలపైనా భక్తులలో నమ్మకం పెరిగేలా కొత్త పాలకవర్గం పనిచేయాలని కోరారు. ప్రభుత్వం తరఫున ఏ కార్యక్రమం చేయాలన్నా తన వంతు సాయం తప్పక ఉంటుందని అన్నారు. ట్రస్టు బోర్డుల ఏర్పాటుతో హిందూ ధర్మ వ్యాప్తితోపాటు ముఖ్యమైన పండుగల నిర్వహణ వైభవోపేతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. రానున్న నవమి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని, ఎక్కువ మంది భక్తులు ఇక్కడికి వచ్చేలా చేయాలని పాలక మండలికి సూచించారు.
దేవాలయాల సంరక్షణకు ప్రభుత్వ చర్యలు తీసుకుంటుందని, అర్చకుల జీతభత్యాల పెంపుపై చర్యలు చేపట్టామని అన్నారు ధర్మాన ప్రసాద్‌రావు. దేవస్థానానికి దాతలు ఏ ప్రయోజనం ఆశించి భూములు ఇచ్చారో ఆ ప్రయోజనాలు మరింత సమర్ధవంతంగా నెరవేరుతుందని కోర్టు నమ్మిన ప్పుడే ఆ భూములు అమ్మకానికి చెల్లుతుందన్నారు.
దేవాలయ భూములు ప్రభుత్వ ఆస్తులు కావని, వాటి పరిరక్షణలో పాలకమండలి సభ్యులు తమవంతు పాత్ర పోషించాలని ధర్మాన సూచించారు. దేవాదాయ ఆస్తులన్నీ అన్యాక్రాంతం అయ్యాయని, వీటిని గుర్తించి ఆక్రమణల తొలగింపునకు కృషి చేయాలని పాలకమండలి సభ్యులకు ఆదేశించారు.
ధర్మాన ఎక్కడ కూడా నేరుగా ప్రభుత్వంపై విమర్శలు చేయలేదు. ఎక్కడా ప్రభుత్వ విధానాలను ప్రస్తావించలేదు. కానీ ఆయన చేసిన కామెంట్స్ మాత్రం ఎవరిని ఉద్దేశించినవి అనేది మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది.