YSRCP: వచ్చే ఏడాది మార్చిలో ఖాళీ కాబోతున్న మూడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సే స్థానాలకకు వైసీపీ అభ్యర్థులను ఖరారు చేసింది. ఇందుకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆయా ప్రాంతాల వైసీపీ ఎమ్మెల్యేలలతో ప్రత్యేకంగా చర్చించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా తొలిసారి ఎన్నికలకు ఏడు, ఎనిమిది నెలల ముందు అభ్యర్థుల ఎంపికపై ఎమ్మెల్యేలతో మాట్లాడారు. ఇందుకోసం సోమవారం సచివాలయంలో ఓ సమావేశాన్ని కూడా నిర్వహించారు. 


గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు..


 గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్వతంత్రులు, ఉపాధ్యాయ సంఘాల అభ్యర్థులకు ఇవ్వడమో, ఎన్నికల నుంచి దూరండా ఉండటమో చేశామని.. ఇకపై ఆ ఎన్నికల్లో పార్టీ పూర్తి స్థాయిలో పోటీ చేస్తే ఎలా ఉంటుందని ఎమ్మెల్యేలతో సీఎం జగన్ చర్చించారు. ఈ సమావేశంలోనే అబ్యర్థుల పేర్లను ఖరారు చేశారు. విశాఖ-శ్రీకాకుళం-విజయనగరానికి బ్రాహ్మణ కార్పొరేషన్ ఛైర్మన్ సుధాకర్. అనంతపురం-కడప-కర్నూలుకు వెన్నపూస రవీంద్రరెడ్డి (ఈయన అదే స్థానంలో ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న వెన్నపూస గోపాల్ రెడ్డి కుమారుడు), చిత్తూరు-ప్రకాశం-నెల్లూరు జిల్లాల నియోజకవర్గానికి పేర్నాటి శ్యాంప్రసాద్ రెడ్డిల పేర్లను ఖరారు చేశారు. 


కార్యాచరణ సిద్ధం, ఎమ్మెల్యేలకు బాధ్యత!


ఈ ఎన్నికలకు సంబంధించి పార్టీ పరంగా ఎలా వ్యవహరించాలి అన్న దానిపై ఒక కార్యాచరణను సిద్ధం చేసే బాధ్యతను నలుగురు ఎమ్మెల్యేలకు అప్పగించినట్లు తెలుస్తోంది. అనంతపురం-కడప-కర్నూలు ఉపాధ్యాయ నియోజక వర్గానికి పోటీ చేసే అంశంపైనా చర్చించారు. అక్కడ ఓటర్లను గుర్తించే ప్రక్రియ చేపట్టాలని, అభ్యర్థిని తర్వాత ప్రకటిద్దామని సమావేశంలో నిర్ణయించారు. 


గడప గడపకూ ప్రభత్వ కార్యక్రమంపై సీఎం వ్యాఖ్యలు..


అలాగే గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వర్క్ షాప్ నిర్వహహించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొనడం సహా జరుగుతున్న తీరుపై పార్టీ చేయించిన సర్వే నివేదికలను సీఎం వెల్లడించారు. మంత్రులు, ఎమ్మెల్యేల వారీగా పని తీరును తెలియజేశారు. ఇప్పటి వరకు మాజీ మంత్రి ఆళ్లనాని, ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి గడప గడపకూ ప్రభుత్వం కార్యక్రమాన్ని చేపట్టకపోవడంపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. 10 మంది ఎమ్మెల్యేలు కేవలం 10 రోజులు మాత్రమే కార్యక్రమాన్ని నిర్వహించడం కొందరు తూతూ మంత్రంగా గ్రామాల్లో పర్యటించడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. పనితీరు మార్చుకోవాలని లేని పక్షంలో గ్రాఫ్ మెరుగుపరుచుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని ఖరాఖండిగా తేల్చి చెప్పారు. 


నిధుల లేమి వల్ల రోడ్లు, డ్రైనేజీలు సహా పలు సమస్యలు పరిష్కరించుకోలేక పోతున్నామని మంత్రులు సీఎంకు చెప్పారు. స్పందించిన సీఎం.. అభివృద్ధి కొరకు ప్రతీ ఎమ్మెల్యేకు 2 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పారు. స్థానిక సమస్యలు పరిష్కరించేందుకు ప్రతీ సచివాలయానికి 20 లక్షల రూపాయల చొప్పున నిధులు మంజూరు చేస్తామన్నారు. వీటితో సమస్యలన్నింటిని పరిష్కరించాలని సీఎం జగన్ ఆదేశించారు. వీటికి సంబంధించి ఉత్తర్వలను వెంటనే విడదల చేసినట్లు తెలిపారు. గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో నాణ్యత చాలా ముఖ్యమని సూచించారు.