Vizag Railway Station Reopen: సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిపథ్ నిరసనలు, అల్లర్ల ఘటనతో కేంద్రంతో పాటు పలు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ఈ క్రమంలో ముందు జాగ్రత్తగా మూసివేసిన వైజాగ్ రైల్వే స్టేషన్ శనివారం మధ్యాహ్నం తెరుచుకుంది. ఆపరేషన్లను పునరుద్ధరించాలని విశాఖ రైల్వే అధికారులకు ఆదేశాలు వచ్చాయి. నగర సరిహద్దు స్టేషన్లలో ఆగి ఉన్న రైళ్ళను విశాఖకు రప్పించే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. విశాఖతో పాటు గుంటూరు, ఇతర ప్రధాన రైల్వే స్టేషన్లలో అవాంఛనీయ జరగకుండా చూడటంలో భాగంగా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా విశాఖ పట్నంలో కూడా అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న ఇంటెలిజెన్స్ సమాచారం మేరకు ప్రభుత్వం, రైల్వే శాఖ అలెర్ట్ అయి నేటి ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రైల్వే స్టేషన్‌ను మూసివేయడంతో పాటు రైలు సర్వీసులను రద్దు చేశారు.. వైజాగ్ సీపీ శ్రీకాంత్, వాల్తేర్ డివిజన్ DRM అనూప్ సత్పతీ పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు.


రైలు సర్వీసులపై అప్‌డేట్.. 
విశాఖ స్టేషన్ నుంచి రెండు గంటలకు ప్రారంభం కానున్న తిరుమల ఎక్స్ ప్రెస్(17488)


విజయనగరం లో ఆగిఉన్న హౌరా - యశ్వంత్ పూర్,  ప్రశాంతి ఎక్స్ ప్రెస్ కు కూడా క్లియరెన్స్


మూడు గంటలకు మరోసారి భద్రతా ఏర్పాట్లను సమీక్షించి అన్ని ట్రైన్స్ ను పునరుద్ధరించాలని నిర్ణయం


విశాఖ రైల్వేస్టేషన్‌లో అధికారులు హెల్ప్‌లైన్లు ఏర్పాటు చేశారు. రైళ్ల రద్దు, దారిమళ్లింపు వివరాలను అందించేందుకు వాల్తేర్‌ డివిజన్‌ అధికారులు విశాఖ హెల్ప్‌లైన్‌ నెంబర్లు: 08912746330, 08912744619, 8106053051, 8106053052, 8500041670, 8500041671 ఏర్పాటు చేశారు.


Agnipath Protests Effect: కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ నిలిపివేత.. కొత్తవలసలో ఒడిశా వాసి మృతి



విజయనగరం: కోర్బా-విశాఖ ఎక్స్‌ప్రెస్‌ కొత్తవలసలో నిలిపివేయడంతో చికిత్స కోసం ఒడిశా నుంచి వచ్చిన జోగేష్‌ బెహరా(70) మృతి చెందారు. గుండెజబ్బు చికిత్స కోసం విశాఖ వస్తుండగా అగ్నిపథ్ అల్లర్లతో విశాఖ వెళ్లాల్సిన రైలు కొత్తవలసలో నిలిపివేశారు. సమయానికి అంబులెన్స్ అందుబాటులో లేకపోవడంతో కొత్తవలసలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స పొందుతూనే జోగేష్ బెహరా మృతిచెందారు. 


Also Read: AP Security Alert: ఏపీలోనూ అగ్నిపథ్ సెగలు-భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు


Also Read: AP POLYCET 2022 Results: ఏపీ పాలిసెట్ 2022 ఫలితాలు విడుదల, రిజల్ట్స్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి