Milan 2022: విశాఖ నగరంలో సందడి వాతావరణం నెలకొంది. ఆర్కే బీచ్(RK Beach) రోడ్‌లో దర్శనీయ ప్రదేశాలను చూపరులకు కనువిందు చేసేట్టుగా తీర్చిదిద్దుతున్నారు. ఈ నెల 27న జరిగే అంతర్జాతీయ సిటీ పరేడ్, నౌకాదళ విన్యాసాల కోసం విశాఖ(Visakha) సిద్ధమవుతుంది. ఈ నెల 27న జరగనున్న బహుళ దేశాల నేవీ విన్యాసం-మిలన్ 2022(Milan 2022) కోసం విశాఖ బీచ్ రోడ్డును ముస్తాబు చేస్తున్నారు. సముద్రంపై జరిగే విన్యాసాలు బీచ్ రో‌డ్‌లో జరిగే పరేడ్‌ ను వీక్షించేందుకు వచ్చే వారందరికీ ఈ ప్రాంతమంతా కొత్తగా కన్పించనుంది. టీయూ-142 మ్యూజియం, కురుసుర సబ్ మెరైన్ మ్యూజియం, విక్టరీ ఎట్ సీ వేడుకలకు సిద్ధం చేస్తున్నారు. రెండు దశల్లో నౌకా దళాల విన్యాసాలు జరుగుతుంది. బహుళ దేశాల నౌకాదళాల విన్యాసం మిలన్ 2022 రెండు దశలలో జరగనుంది. తొలిదశలో నౌకాదళ స్థావరం, ఆర్కే బీచ్‌లో ఈ విన్యాసాలు నిర్వహిస్తారు. ఈనెల 26న అంతర్జాతీయ నౌకా సదస్సుతో మిలన్ 2022 ప్రారంభం అవుతంది. 40కి పైగా దేశాల నుంచి నౌకాదళ ఉన్నతాధికారులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. 27న ఆర్కే బీచ్‌లో వివిధ దేశాలకు చెందిన నేవీలకు చెందిన బృందాలు పరేడ్ నిర్వహిస్తాయి. ఇందులో భాగంగానే సముద్రం(Sea), గగనతలంలో యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు విన్యాసాలు చేయనున్నాయి. 


ముఖ్య అతిథిగా సీఎం జగన్(CM Jagan)


మిలన్‌ 2022లో ఈ నెల 27న జరిగే ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌(International City Parade) చాలా కీలకమైంది. ఈ వేడుకల్లో  సీఎం జగన్‌ ముఖ్య అతిథిగా హాజరవుతారు. అలాగే కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో పాటు వివిధ దేశాలకు చెందిన నౌకాదళ అధికారులతో సహా మొత్తం 5 వేల మంది అతిథులు హాజరవుతారు. దాదాపు 3 కిలోమీటర్ల మేర జరిగే పరేడ్‌ని చూసేందుకు 2 లక్షల మంది వీక్షకులు హాజరవుతారని అధికారులు భావిస్తున్నారు. మిలన్‌కు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్(Rajnath Singh), విదేశాంగ మంత్రి జైశంకర్(Jayashankar), సీనియర్‌ అధికారులు, వివిధ దేశాలకు చెందిన 150 మంది ఉన్నతాధికారులు హాజరవుతారు. ఈ నెల 27న  విశాఖలో సీఎం  వైఎస్‌ జగన్‌ పర్యటన


సీఎం జగన్(CM Jaga) షెడ్యూల్ 


ఈ నెల 27న  విశాఖలో సీఎం  వైఎస్‌ జగన్‌ పర్యటించనున్నారు. మిలన్‌– 2022 యుద్ధ నౌకల సదస్సులో సీఎం వైఎస్‌ జగన్‌(YS Jagan) ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. 27వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు సీఎం జగన్ విశాఖ చేరుకుంటారు. అక్కడి నుంచి నావల్‌ డాక్‌యార్డ్‌ కు వెళ్తారు. అక్కడ జరిగే వివిధ కార్యక్రమాలలో పాల్గొని తర్వాత ఐఎన్‌ఎస్‌(INS) వేలా సబ్‌మెరేన్‌ ను సందర్శిస్తారు. అక్కడి నుంచి ప్రభుత్వ సర్క్యూట్‌ హౌస్‌కు వెళ్తారు. సాయంత్రం 5.30 గంటలకు ఆర్‌కే బీచ్‌కు చేరుకుని ఇంటర్నేషనల్‌ సిటీ పరేడ్‌ మిలాన్‌ – 2022 లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారు. ఈ కార్యక్రమం అనంతరం రాత్రి 7.15 గంటలకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌ నుంచి గన్నవరం(Gannavaram) చేరుకోనున్నారు. 


మిలన్(Milan) 2022 


విశాఖ వేదికగా ఇటీవల ప్రెసిడెంట్‌ ఫ్లీట్‌ రివ్యూ(President Fleet Review)ను ఘనంగా నిర్వహించారు. నాలుగు రోజుల వ్యవధిలోనే మిలన్‌–2022 అంతర్జాతీయ విన్యాసాలను నిర్వహించనున్నారు. నౌకా దళ విభాగంలో కీలకమైన మిలన్‌ 2022 కోసం భారత నేవీ 46 దేశాలను ఆహ్వానించింది. ఇందులో 39 దేశాలు పాల్గొనేందుకు ముందుకొచ్చాయి. శుక్రవారం నుంచి మార్చి 4వ తేదీ వరకు వివిధ దేశాల నౌకా దళాలు విన్యాసాలు ప్రదర్శించనున్నాయి. రెండేళ్లకొకసారి నిర్వహించే మిలన్‌ విన్యాసాలు 1995లో ప్రారంభించారు. తొలిసారి విన్యాసాల్లో భారత్‌(India)తో పాటు ఇండోనేషియా, సింగపూర్, శ్రీలంక, థాయ్‌లాండ్‌ దేశాలు పాల్గొన్నాయి. 2005లో సునామీ కారణంగా మిలన్‌ విన్యాసాల(Milan Exercise)ను రద్దు చేశారు. 2001, 2016 సంవత్సరాల్లో ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ రివ్యూ(International Fleet Review) కారణంగా మిలన్‌ విన్యాసాలు నిర్వహించలేదు. 2010 వరకు 8 దేశాలు పాల్గోగా 2012లో ఏకంగా 16 దేశాలు పాల్గోన్నాయి. 2014, 2018లో జరిగిన విన్యాసాల్లో 17 దేశాలు విన్యాసాలు ప్రదర్శించాయి. ఇప్పటి వరకూ 10 సార్లు మిలన్‌ విన్యాసాలు నిర్వహించారు. తాజాగా విశాఖ వేదికగా జరిగే విన్యాసాలు 11వ మిలన్‌. మిలన్‌ను మినీ ఐఎఫ్‌ఆర్‌(Mini IFR)గా పిలుస్తారు. ఈసారి జరిగే మిలన్‌ – 2022లో ఐఎఫ్‌ఆర్‌కు దీటుగా 39 దేశాలు పాల్గొంటున్నాయి. 


Also Read: Chief of Naval Staff : ప్రెసిడెంట్స్ ఫ్లీట్ రివ్యూ, మిలన్ వేడుకల ఏర్పాట్లు పరిశీలించిన సీఎన్‌ఎస్