Vangalapudi Anitha: ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీకి మహిళలపై గౌరవం లేదు అని రాష్ట్ర తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. విశాఖ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ అడుగుతున్న ప్రశ్నలకు వైసీపీ సమాధానాలు చెప్పలేకపోతుందన్నారు. టీడీపీ సహా ఇతర పార్టీల మహిళలపై కించ పరిచేలా వాఖ్యలు చేస్తున్నారు అన్నారు. మద్యపాన నిషేధం ఎప్పుడు చేస్తారు అని చెప్పమంటే చెప్పలేరు, పైగా స్త్రీ జాతి వినలేని మాటలు మాట్లాడుతున్నారంటూ మండిపడ్డారు.


తనపై అత్యంత హేయమైన వ్యాసాలు రాసి భాద పెడుతున్నారని, నోటికి వచ్చిన దారుణమైన పద జాలం వినియోగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సతీమణి భారతి రెడ్డి సైతం తనపై జుగుప్సాకరమైన రాతలు రాయిస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు. సీఎం జగన్ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి కుమారుడు సజ్జల భార్గవ రెడ్డి సోషల్ మీడియాలో పిచ్చి రాతలు రాయిస్తున్నారని.. ఒక ఆడబిడ్డ మీద ఇలాంటి రాతలు ఎలా రాస్తారు అని ప్రశ్నించారు. ఈ విషయాలు మీద ఫిర్యాదు చేయడానికి పోలీస్ డీజీపీ అడిగితే అపాయింట్ మెంట్ ఇవ్వలేదని తెలిపారు. సీఎం జగన్ ను ప్రశ్నించడమే తాను చేసిన తప్పా, నాపై పెట్టిన పోస్టులు చూసి బాధపడ్డాను, కానీ ఎట్టి పరిస్థితుల్లో ఏడవనని.. ఈపోస్టులు పెట్టిన వారు ఏడ్చే రోజు వస్తుందన్నారు. 


తాను చదువుకున్న దళిత ఆడబిడ్డను అని, అయినా తనకు అండగా నిలిచింది చంద్రబాబు అని అన్నారు. మహిళా సమస్యల మీద మేము పోరాటం చేస్తుంటే సోషల్ మీడియాలో కొన్ని కుక్కలు తమపై మోరుగుతున్నాయంటూ మండిపడ్డారు. పేటీఎం డాగ్స్ నోటికి వచ్చినట్లు వాగుతున్నాయి. అసభ్యపద జాలాన్ని వాడుతున్నాయి. మనుషులెవరూ ఇలాంటి మాటలు మాట్లాడరు, పోస్టులు పెట్టరంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రొఫైల్ పిక్ లో జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టాల్సింది పోయి నా ఫోటో పెట్టుకుంటూ.. భారతీ రెడ్డి, సజ్జల భార్గవ్ రెడ్డి తనపై దుష్ప్రచారం చేయిస్తూ అసభ్యకర పోస్టులు పెట్టిస్తున్నారని వంగలపూడి అనిత ఆరోపించారు.
నేను ఏడ్చే రకం కాదు, ఏడిపించే రకం..  
తన మీద అసత్య అభ్యంతరకరమైన వార్తలు ప్రచురిస్తున్నా ఏడవనని చెప్పారు. తనపై అలాంటి పోస్టులు పెట్టిన వారిని త్వరలోనే ఏడిపించే రకాన్ని తాను అన్నారు. ఎవర్నీ వదిలి పెట్టనన్నారు. అయితే రాష్ట్ర డీజీపీ తనకు 6 నెలలుగా అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అని ఆరోపించారు. ఇదే 6 నెలలు ఆగితే జగన్ జైలుకు వెళ్తారని, పోలీస్ వ్యవస్థ తమతో ఉంటుందన్నారు. పోలీసులు ఇప్పటికైనా సుమోటో గా కేసు తీసుకోవాలి డీజీపీని కోరారు. 


ఆఖరికి సొంత బాబాయికి లేని పోని సంబంధాలుఅంటగట్టిన ఘనుడు సీఎం జగన్ అని సెటైర్లు వేశారు. సొంత చెల్లికే దిక్కు లేదు మేము ఎంత అని అన్నారు అనిత. తప్పుడు పోస్టులు పెట్టేవాడు దొరికితే ఇక నుంచి తంతాము అని హెచ్చరించారు. హోమ్ మినిస్టర్ అంటే ఇంట్లోనే ఉండి పోతున్నారు, కానీ మహిళా సమస్యలను మంత్రి వనిత పట్టించుకోవడం లేదని ఆరోపించారు. కొంతమంది వాలంటీర్లు అక్రమాలకు పాల్పడుతున్నా ప్రభుత్వం, పోలీసులు పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో జిల్లా తెలుగు మహిళా అధ్యక్షురాలు సర్వసిద్ధి అనంతలక్ష్మి, తెలుగు మహిళా నాయకురాలు కేదారి లక్ష్మి, ఈతలపాక సుజాత, గణగళ్ళ సత్య, తోట శ్రీదేవి పాల్గొన్నారు.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి    
Join Us on Telegram: https://t.me/abpdesamofficial