భారత ప్రభుత్వం నిషేధించిన బీబీసీ డాక్యుమెంటరీ "ఇండియా : ది మోదీ క్వశ్చన్ "ను ఆంధ్రా యునివర్సిటీలోని శాతవాహన హాస్టల్ ప్రాంగణంలో ప్రదర్శించాయి వామపక్ష అనుబంధ విద్యార్థి సంఘాలు. SFI కు చెందిన ఏయీ స్టూడెంట్ విభాగం శుక్రవారం రాత్రి 9గంటల నుంచి 45 నిముషాలపాటు ఈ ప్రదర్శన జరిపారు.


SFI విద్యార్థి విభాగం వేసిన డాక్యుమెంటరీని అడ్డుకోవడానికి ఏబీవీపీకి చెందిన ఏయూ విభాగ నేతలు అక్కడకు చేరుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ప్రదర్శన ను నిలిపివెయ్యాలని డిమాండ్ చేశారు . SFI కు చెందిన విద్యార్థులు గో బ్యాక్ ఏబీవీపీ అంటూ నినాదాలు చెయ్యడంతో శాతవాహన హాస్టల్ వద్ద ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఈ లోపు విషయం తెలుసుకున్న పోలీసులు ఏయూకు చేరుకుని విద్యార్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ప్రస్తుతం ఈ ఘటన పై  పోలీస్ దర్యాప్తు కొనసాగతోంది.


గుజరాత్ అల్లర్లపై బీబీసీ రూపొందించిన క్ ఇండియా: ది మోదీ క్వశ్చన్"


గతంలో అంటే  22 ఏళ్ల నాటి గుజరాత్ అల్లర్ల పై బీబీసీ ఇటీవల ఒక డాక్యుమెంటరీ నీ రూపొందించింది . వాటిలో ఆనాటి గుజరాత్ ముఖ్యంత్రి మోదీ పాత్ర పై అనేక ప్రశ్నలను ఈ డాక్యుమెంటరీ లో చర్చకు తెచ్చింది బీబీసీ. ఈ నెల 17 న బ్రిటన్ లో దీనిని ప్రదర్శనకు తెచ్చారు .అయితే ఈ డాక్యుమెంటరీ భారత్ లో తీవ్ర సంచలనాన్ని రేపింది . ఈ కథనం పూర్తిగా ప్రధాని మోదీ..భారత దేశ ప్రతిష్టలపై వలసవాద దృక్పథంతో బీబీసీ రూపొందించిన కథనం గా కేంద్రం ప్రకటించింది. ఇండియాలో ఈ డాక్యుమెంటరీని నిషేధించింది. ఇక బ్రిటన్‌లోనూ ప్రభుత్వం దీనితో తమకు సంబంధం లేదని తెలిపింది. కానీ ఇక్కడి ప్రతిపక్షాలు మాత్రం ఈ నిర్ణయాన్ని తప్పు పడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ నేత జై రామ్ రమేష్ లాంటి వారు డాక్యు మెంటరీని నిషేధించడం సరికాదని విమర్శించారు.


వామపక్ష అనుబంధ విద్యార్థి సంస్థ SFI మాత్రం ఈ డాక్యుమెంటరీనీ ప్రదర్శనకు పెడతామని చెప్పి దేశంలోని వివిధ యూనివర్సిటీల్లో  ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పటికే ఢిల్లీ సహా హైదరాబాద్ లాంటి నగరాల్లోనీ యూనివర్శిటీల్లో ప్రదర్శిస్తూ వస్తుంది. ఇప్పుడు తాజాగా వైజాగ్ లోని ఏయూలో కూడా ఈ ప్రదర్శన జరిగింది. బీజేపీ అనుబంధ విద్యార్థి సంస్థ ఎబీవీపీ వీటిపై ఫిర్యాదు చేస్తూ వస్తుంది. ఢిల్లీ లో జరిగిన ప్రదర్శన SFI నేతల అరెస్టులకు దారి తీయగా .. హైదరాబాద్ లోని ప్రదర్శన పై కూడా పోలీస్ ఫిర్యాదు నమోదైందనీ ఏబీవీపీ చెబుతోంది. ఇక విశాఖ ఘటనపై పోలీస్ దర్యాప్తు కొనసాగుతోంది .మరోవైపు SFI మాత్రం దేశ వ్యాప్తంగా ఈ డాక్యుమెంటరీ ప్రదర్శన చేసి తీరుతామని చెబుతోంది.