పండుగ రద్దీ, వరుస సెలవుల దృష్ట్యా రైల్వే లు వైజాగ్ నుండి తిరుపతి, చర్లపల్లి మధ్య రెండు నెలలపాటు స్పెషల్ ట్రైన్స్ అనౌన్స్ చేసాయి. జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఇవి అందుబాటులో ఉండనున్నాయి. కాబట్టి ప్రయాణికులు తమ జర్నీ కి అనుగుణంగా వీటిలో టికెట్స్ బుక్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు.
1) విశాఖపట్నం -తిరుపతి -విశాఖపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్
ట్రైన్ నెంబర్ 08583 విశాఖపట్నం -తిరుపతి వీక్లీ ఎక్స్ ప్రెస్ 05.01.2026 నుండి 23.02.2026 వరకూ ప్రతీ సోమవారం రాత్రి 7.10 కి వైజాగ్ లో బయలు దేరి మరుసటి రోజు ఉదయం 09.15కి తిరుపతి చేరుకుంటుంది. దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ , తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీ కాళహస్తి, రేణిగుంట స్టేషన్ లలో ఆగుతుంది
ఈ ట్రైన్ లో 2AC-1, 3AC-07,3AC ఎకానమీ-01,స్లీపర్ క్లాస్-06, జనరల్-04, దివ్యాంగులు కమ్ లగేజ్ బో్గీ-01 ఉంటాయి.
తిరుగు ప్రయాణం లో 08548 నెంబర్ తో ఇదే ట్రైన్ ప్రతీ మంగళవారం తిరుపతి లో రాత్రి 09.50కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 11:30 కి వైజాగ్ చేరుకుంటుంది. తిరుపతి నుండి ఈ ట్రైన్ 08.01.2026 నుండి 26.02.2026 వరకూ అందుబాటులో ఉంటుంది.
2) విశాఖపట్నం- చర్లపల్లి- విశాఖపట్నం వీక్లీ ఎక్స్ ప్రెస్
ట్రైన్ నెంబర్ 08579 వైజాగ్ -చర్లపల్లి వీక్లీ ఎక్స్ ప్రెస్ 02.01.2026 నుండి 27.02.2026 వరకూ ప్రతీ శుక్రవారం సాయంత్రం 05:30 కి వైజాగ్ లో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 08:00 గంటలకు చర్లపల్లి చేరుకుంటుంది.
దారిలో దువ్వాడ, అనకాపల్లి, ఎలమంచిలి, అన్నవరం,, సామర్లకోట, రాజమండ్రి, నిడదవోలు, తణుకు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, కృష్ణా కెనాల్, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి స్టేషన్ లలో ఆగుతుంది.
ఈ ట్రైన్ లో 2AC-2, 3AC-3,3AC-ఎకానమీ-02,స్లీపర్ క్లాస్-08,జనరల్-04 దివ్యాంగులు కమ్ లగేజ్ బోగీ-01 ఉంటాయి.
తిరుగుప్రయాణం లో 08580 నెంబర్ తో ఈ ట్రైన్ 03.01.2026 నుండి 28.02.2026 వరకూ చర్లపల్లి లో ప్రతీ శనివారం మధ్యాహ్నం 03:30కి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 07 గంటలకు వైజాగ్ చేరుకుంటుంది అని అధికారులు ఒక ప్రకటన లో తెలిపారు