Avatar Theater Experience: సింగిల్ థియేటర్‌లో రిలీజ్ అయ్యే చిన్న బడ్జెట్ మూవీల నుంచి పాన్ వరల్డ్ స్థాయిలో రిలీజ్ అయ్యే AVATAR వంటి సినిమాల వరకూ నిర్మాణం విషయంలో చాలా తేడాలుంటాయి. వాటి బడ్జెట్‌ను బట్టి వాటిలో టెక్నికల్ వాల్యూస్ మారిపోతుంటాయి. దాదాపు 20 ఏళ్ల నుంచి నిర్మితమవుతున్న అవతార్ ఫ్రాంచైజ్‌లో ఇప్పటి వరకూ ప్రపంచంలో అందుబాటులో ఉన్న టాప్ ఫిల్మ్ టెక్నాలజీని ఉపయోగించారు. ఈ సినిమాలో టెక్నికల్ క్వాలిటీని పూర్తిగా ఆస్వాదించాలంటే దానికి తగిన స్క్రీన్‌లు, సౌండ్ సిస్టమ్ కూడా అవసరం. టాప్ క్వాలిటీ ప్రొజెక్షన్, సౌండ్ సిస్టమ్ ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. అవతార్ లాంటి సినిమాకు ఎలాంటి టెక్నికల్ స్పెసిఫికేషన్లు అవసరం అవుతాయో ఆ సినిమా డైరక్టర్ James Cameron స్వయంగా ఓ ప్రత్యేకమైన నోట్ ఇచ్చారు. అసలు సినిమా స్క్రీన్‌లలో, థియేటర్‌లో తేడాలు ఏంటి మన తెలుగు రాష్ట్రాల్లో ఇలాంటి థియేటర్‌లు ఎక్కడ ఉన్నాయో చూద్దాం.
సినిమా స్క్రీన్‌లలో తేడాలు
స్టాండర్డ్ స్క్రీన్: ఇది మామూలు థియేటర్లలో ఉండే 2D,౩D ప్రొజెక్షన్. ఈ థియేటర్లలో సాధారణ లేదా డాల్పి సౌండ్ సిస్టమ్ ఉంటుంది. విజువల్ క్వాలిటీ ఉంటుంది కానీ.. Immersive సౌండ్ ఉండదు.
4DX / MX4D : 3D తోపాటు motion seat , డస్టర్, విండ్, ఫోగ్, సెంట్స్ వంటి environmental effectsను అనుభూతి చెందొచ్చు. సినిమా చూస్తున్నప్పుడు సీట్లలో కదలికల వల్ల ప్రేక్షకులకు కొత్త అనుభూతి కలుగుతుంది. ముఖ్యంగా యాక్షన్/అడ్వెంచర్ సీన్లు ఎక్కువుగా ఉండే సినిమాలు ఇది బాగుంటుంది. చిన్నపిల్లలు సరదాకోసం బాగానే ఉంటుంది కానీ సినిమా వ్యూయింగ్ అనుభూతిని ఇది దెబ్బతీస్తుందని కొంతమంది అభిప్రాయం.
డాల్బీ సినిమా / డాల్బీ అట్మాస్: Dolby Cinema అనేది ఈ రోజుల్లో ఓ మంచి క్వాలిటీ సినిమాను చూడటానికి ప్రతి ఒక్కరూ ఎంచుకుంటున్న స్క్రీన్. సాధారణంగా వీటిలో పెద్ద స్క్రీన్, Dolby విజన్ ప్రొజెక్షన్, Dolby Atmos సైన్‌తో అత్యున్నతమైన విజువల్ సరౌండ్ సౌండ్ ఉంటుంది. సినిమా థియేటర్‌లో ఇమ్మెర్సివ్ ఫీలింగ్ ఇస్తుంది. అంటే మనం సినిమా చూస్తున్నట్లు కాకుండా సినిమాను అనుభవిస్తున్నట్లు చూపుతుంది. ఇక్కడ శబ్దం థియేటర్ మొత్తం ట్రావెల్ చూస్తూ ఉండటం వల్ల అక్కడ జరుగుతున్న దాంట్లో మనం భాగం అయినట్లు.. సినిమా తెరమీద కాకుండా మన ముందు ఉన్నట్లు ఉంటుంది. Avatar లాంటి భారీ బడ్జెట్ సినిమాలకు ఇది మంచి ఎంపిక
PXL (Premium Extra Large):మామూలు జనాలకు తెలీదు కానీ.. సినిమా లవర్స్.. మూవీ బఫ్‌లకు ఈ స్క్రీన్‌ల గురించి బాగా తెలుసు. PXL అంటే ప్రీమియం ఎక్స్‌ట్రా లార్జ్ స్క్రీన్. ఈ తెరలు పెద్దగా ఉంటాయి. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో PVR Inorbitలో మాత్రమే PXL స్క్రీన్ అందుబాటులో ఉంది. RGB లేజర్ ప్రొజెక్షన్‌తో ఇక్కడ మూవీ ప్రొజెక్ట్ చేస్తారు. అయితే ఇది కూడా పూర్తి స్థాయి ఫ్లాట్ PXL స్క్రీన్ కాదని చెబుతారు. త్వరలో అతిపెద్ద PXL స్క్రీన్ కూకటిపల్లి బాలానగర్ సమీపంలో అందుబాటులోకి రానుంది. PXLలో ప్రధానమైన విషయం ఏంటంటే.. మామూలు థియేటర్‌లాగా స్క్రీన్ ఎత్తుగా ఉండదు.. స్క్రీన్ నేలపైనుంచే ఉంటుంది. నేల నుంచి రూఫ్ వరకూ.పక్కల గోడల వరకూ స్క్రీన్ ఉంటుంది. అంటే చూసేవాళ్లకి స్క్రీన్ చూస్తున్నట్లు అనిపించదు. స్క్రీన్ చుట్టూ ఎలాంటి ఖాళీ స్థలం లేకపోవడంతో ఓ తెరను చూస్తున్నట్లుగా ఉండదు..నేరుగా అది మన కళ్ల మందు జరుగుతున్నట్లుగా కనిపిస్తుంది. త్వరలో కూకట్‌పల్లి వద్ద ఉన్న LAKESHORE మాల్‌లో అతిపెద్ద PXL రాబోతోంది. ప్రస్తుతానికి PXL అంటే ఇనార్బిట్‌లో అవతార్ చూడొచ్చు.
PCX:Prasad Cinematic Experience ను PCX అంటుంటారు.హైదరాబాద్‌కు ఓ ఐకాన్ వంటిది. PRASAD మల్టిప్లెక్స్. ఒకప్పుడు ఇండియాలోనే అతిపెద్ద Imax స్క్రీన్ ఇక్కడ ఉండేది. అదే తర్వాత PCX గా మారింది. డాల్బి అట్మోస్, డ్యూయల్ ౩D లేజర్ ప్రొజక్షన్‌తో అవతార్ లాంటి భారీ గ్రాఫికల్ సినిమాలు చూడటానికి అనువైన ప్లేస్ ఇది. భారీ స్క్రీన్‌మీద సినిమా చూడాలి అనుకుంటే.. ఇది బెస్ట్ ఆప్షన్. ప్రొజెక్షన్, స్క్రీన్ బ్రైట్‌నెస్ విషయంలో దీనికన్నా బెస్ట్ ఉన్నాయి కానీ సినిమాను భారీగా చూడాలనుకుంటే ఇదే కరెక్టు. అందుకే AVATARకు ఎక్కువ మంది ప్రిఫరెన్స్ దీనికే.. టికెట్లు కూడా ఎక్కువ రోజులకు బుక్ అయిపోయాయి. IMAX లేని హైదరాబాద్ నగరానికి ఇదొక ఆల్టర్నేటివ్. తన భారీ సినిమా VARANASI ని ఫుల్ IMAX వెర్షన్‌లో తెరకెక్కిస్తున్న లెజండరీ డైరక్టర్ రాజమౌళి కూడా తన సినిమా టీజర్‌ను ఈ మధ్య PCX లో ప్రత్యేకంగా వేసుకుని మరీ చూశారు. అలాగే అవతార్ సినిమాను రిలీజ్‌కు ముందు తానొక్కడే ఇదే థియేటర్‌లో చూశారు
IMAX
ఐమాక్స్ అనేది సినిమా వ్యూయింగ్‌లో పరాకాష్ట. ఇది Gaint స్క్రీన్. 1.43 : 1 ఫార్మాట్‌లో చిత్రాన్ని ప్రదర్శిస్తారు. అంటే ఎక్కువ ఎత్తు ఉండటం వల్ల షూట్ చేసిన వీడియో మొత్తం కనిపిస్తుంది. ఈ పద్దతిలో ప్రత్యేకంగా షూట్ చేస్తారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా IMAX లేదు. త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
| స్క్రీన్ టైప్ | Visual | Sound | Immersion | Best for || ------------- | --------------------- | ----------------- | ----------- | -------------------| Standard 2D | Good | Standard | Normal | Day-to-day movies | Dolby Cinema | Excellent | Excellent | High |Big budget visuals || PXL | Excellent | Dolby Atmos | Very High | Epic films like Avatar || 4DX | Good | Good | Fun Effects | Action sequences || PCX | Large | Dolby Atmos | High | Cinematic immersion |
సో ఫైనల్‌గా అవతార్ లాంటి సినిమాను పూర్తిగా ఆస్వాదించాలంటే.. పైన చెప్పిన విషయాలను, మీ అభిరుచిని దృష్టిలో ఉంచుకుని థియేటర్లను ఎంపిక చేసుకోవాలి.James Cameron డాల్బీ థియేటర్‌లో సినిమాను చూడమని సలహా ఇచ్చారు. Dolby, లేజర్, పెద్ద స్క్రీన్ మూడూ కలిసి ఉంటే పండగే. అందరికీ భారీ తెరపై చూడటం కష్టమవుతుంది కాబట్టి కనీసం మంచి ప్రొజెక్షన్ ఉన్న డాల్బీని సెలక్ట్ చేసుకోవడం ఉత్తమం