వేసవి సెలవల్లో ఉండే ప్రయాణికుల రద్దీ ని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ -శ్రీకాకుళం మధ్య ప్రత్యేకంగా సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ నడుపుతోంది దక్షిణ మధ్య రైల్వే. సికింద్రాబాద్ నుండి 13 రైళ్లు, శ్రీకాకుళం నుండి 13 కలిపి మొత్తం 26 రైళ్లను నడుపుతున్నట్టు రైల్వే అధికారులు ప్రకటించారు.

07425- సికింద్రాబాద్- శ్రీ కాకుళం ఎక్స్ ప్రెస్ 

సికింద్రాబాద్ నుండి శ్రీకాకుళం వెళ్లే 07425 నెంబర్ గల సమ్మర్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఏప్రిల్ 5,12,19,26 తేదీల్లోనూ, మే నెల 03,10,17,24,31 తేదీ ల్లోనూ, జూన్ లో  7,14,21,28 తేదీ ల్లోనూ ప్రతీ ఆదివారం రాత్రి 11:15 కి బయలుదేరి సోమవారం సాయంత్రం 05:30కి శ్రీకాకుళం చేరుతుంది.

07426- శ్రీకాకుళం -సికింద్రాబాద్ -ఎక్స్ ప్రెస్  శ్రీకాకుళం నుండి సికింద్రాబాద్ వెళ్లే 07426 నెంబర్ గల సమ్మర్ స్పెషల్ ఎక్స్ ప్రెస్ ఏప్రిల్ నెల 6,13,20,27 తేదీల్లోనూ, మే నెల 4,11,18,25 తేదీల్లోనూ, జూన్ లో  01,08,15,22,29 తేదీల్లో రాత్రి సోమవారం రాత్రి 07:30కి శ్రీకాకుళం లో బయలుదేరి మంగళవారం మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది 

స్టాపులు ఇవే!

ఈ సమ్మర్ స్పెషల్ ట్రైన్స్ సికింద్రాబాద్ -శ్రీకాకుళం మధ్యలో చర్లపల్లి, నల్గొండ,మిర్యాలగూడ,గుంటూరు, విజయవాడ,గుడివాడ, కైకలూరు, ఆకివీడు, భీమవరం టౌన్, తణుకు, నిడదవోలు, రాజమండ్రి, సామర్లకోట,తుని, ఎలమంచిలి,అనకాపల్లి, దువ్వాడ,కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి స్టేషన్ లలో ఆగుతుంది.

కోచెస్ వివరాలు

ఈ స్పెషల్ ట్రైన్స్ లో  సెకండ్ AC, థర్డ్ AC, స్లీపర్, సెకండ్ క్లాస్ (జెనరల్ ) కోచెస్ ఉంటాయని రైల్వే అధికారులు తెలిపారు.   

సికింద్రాబాద్ - శ్రీకాకుళం (ట్రైన్ నెం. 07425):

  • ఎప్పుడు: ఏప్రిల్ 5 నుండి జూన్ 28 వరకు ప్రతి ఆదివారం.

  • సమయం: ఆదివారం రాత్రి 11:15 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరి, సోమవారం సాయంత్రం 05:30 గంటలకు శ్రీకాకుళం చేరుకుంటుంది.

  • తేదీలు: ఏప్రిల్: 5, 12, 19, 26  మే: 3, 10, 17, 24, 31జూన్: 7, 14, 21, 28

2. శ్రీకాకుళం - సికింద్రాబాద్ (ట్రైన్ నెం. 07426):

  • ఎప్పుడు: ఏప్రిల్ 6 నుండి జూన్ 29 వరకు ప్రతి సోమవారం.

  • సమయం: సోమవారం రాత్రి 07:30 గంటలకు శ్రీకాకుళంలో బయలుదేరి, మంగళవారం మధ్యాహ్నం 12:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

  • తేదీలు: ఏప్రిల్: 6, 13, 20, 27  మే: 4, 11, 18, 25   జూన్: 1, 8, 15, 22, 29