Qatar Releases Indian Navy veterans:  ఖతార్‌లో మరణ శిక్ష పడిన భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. కేంద్రం చేసిన దౌత్యపరమైన చర్చలు విజయవంతమయ్యాయి. ఎనిమిది మంది భారతీయుల్లో ఏడుగురు ఇండియా చేరుకున్నారు. తమ విడుదల కోసం చర్చలు జరిపిన ప్రభుత్వానికి వారంతా కృతజ్ఞతలు తెలిపారు. 


ఇండియా నేవీకి చెందిన ఎనిమిది మంది మాజీ ఆఫీసర్లకు ఖతార్‌ మరణ శిక్ష విధించింది. ఖతార్‌ సైనికులకు, ఇతర భద్రతా సిబ్బందికి శిక్షణ ఇచ్చే ఆల్‌ దహ్రా గ్లోబల్‌ టెక్నాలజీస్‌లో పని చేస్తున్నారు. వీళ్లు 2022 ఆగస్టులో గూఢచర్యం ఆరోపణలతో అరెస్టు అయ్యారు. విచారణ అనంతరం వీళ్లకు కోర్టు మరణ శిక్ష విధించింది. 


ఈ కేసులో భారత్‌ స్పందించింది. ఖతార్‌ ప్రభుత్వంతో మాట్లాడింది. తమకు సమాచారం ఇవ్వకుండ వాదన వినకుండా ఏక పక్షంగా శిక్ష వేయడాన్ని భారత్ సవాల్ చేసింది. దీనిపై స్పందించిన ఉన్నత న్యాయస్థానం 8మందికి విధించిన మరణ శిక్షణను రద్దు చేసింది. అంత కంటే ముందు దుబాయ్‌లో జరిగిన కాప్‌ 28 సదస్సులో భారత్‌ ప్రధానమంత్రి ఖతార్‌ ఎమిర్‌షేక్ తమీమ్‌ బిన్ హమద్‌ అల్‌ థానీతో చర్చలు జరిపారు. జైల్లో భారతీయ ఖైదీలపై కూడా చర్చించారు. 


ఓవైపు కోర్టులో పోరాడుతూనే మరోవైపు దౌత్యపరంగా కూడా నేరుగా ప్రభుత్వంతో చర్చలు జరిపి ఎనిమిది మంది భారతీయుల విడుదలను విజయవంతంగా పూర్తి చేశఆరు. ఇలా ఖతార్‌ జైల్లో మగ్గిన మాజీ అధికారుల్లో కెపెన్లు సౌరభ్‌ విశిష్ఠ, నవతేేజ్  గిల్ల్, కమాండర్లు బీరేంద్ర కుమార్ వర్మ, పూర్ణేందు తివారీ, సుగుణాకర్‌ పాకాలా, సంజీవ్‌ గుప్తా, అమిత్‌ నాగ్‌పాల్, సెయిలర్‌ రాగేష్‌ ఉన్నారు. ఈ ఎనిమిది మందిలో సుగుణాకర్‌ ఏపీకి చెందిన వ్యక్తి. ఆయనది విశాఖ పట్నం.