రేపటి నుంచి విశాఖలో ప్లాస్టిక్ నిషేధం విధిస్తున్నట్టు అధికారులు ప్రకటించారు. వైజాగ్‌లో ప్లాస్టిక్ కనిపించకూడదాని కంకణం కట్టుకున్న అధికారులు ఆ దిశగానే ప్రజలను, వ్యాపారస్థులను అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా టూరిస్టు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి పెట్టారు. ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులు కనిపించ కూడాదని భావిస్తున్నారు. 


వైజాగ్‌లో ప్లాస్టిక్ వాడినట్టు, అమ్మినట్టు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు జీవీఎంసీ కమిషనర్ లక్ష్మీ షా. ఏబీపీ దేశంలో మాట్లాడిన ఆయన... రేపటి నుంచి వైజాగ్‌లో ప్లాస్టిక్ బ్యాన్ విధిస్తున్నట్టు వివరించారు. టూరిస్టు ప్రాంతాల్లో కూడా  ప్లాస్టిక్ వాడకం నిషేధమని తెలిపారు. 


పర్యాటక ప్రాంతాల్లో వాటర్ బాటిల్స్ లాంటివి కనిపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు లక్ష్మీషా. ప్లాస్టిక్ కవర్స్ ఎవరైనా వ్యాపారులు అమ్మినట్టు తెలిస్తే 5000 రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించారు. టూరిస్టులకు ఇది వరిస్తుందని తెలిపారు. పర్యాటకులకు 500 రూపాయల నుంచి జరిమానాలు ఉంటాయన్నారు. 



ప్లాస్టిక్ నిషేధం విదించినందుకు ఎలాంటివి వాడాలనే అంశంపై ప్రజలకు ఆవగాహన కల్పిస్తున్నట్టు కూడా జీవీఎంసీ కమిషనర్ తెలిపారు. ఫంక్షన్లు, ఇతర అవసరాల కోసం విస్తరాకులు, మోదుగ ఆకులతో చేసిన ప్లేట్లనే వాడదామంటూ పిలుపునిచ్చారు. నిత్యవసరాల కోసం గుడ్డ సంచులనే ప్రజలు వాడాలి సూచిస్తున్నారు. 






ప్లాస్టిక్ కారణంగా చాలా ప్రమాదకరమైన సంఘటన జరుగుతున్నాయి. వాతావరణంలో భయంకరమైన మార్పులు వస్తునత్నాయన్నారు జీవీఎంసీ కమిషనర్. ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా వైజాగ్‌ను ప్లాస్టిక్ నుంచి కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు.