Pawan Kalyan: లిక్కర్ అమ్మకాల ద్వారా సీఎం జగన్ 30 వేల కోట్లు సంపాదించారని జనసేన అధినేత ఆరోపించారు. గురువారం వైజాగ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. జగన్ సొంత బ్రేవరేజస్ పెట్టుకుని కోట్లు కొల్లగొట్టారని, వాటి ద్వారా ప్రజల ఓట్లు కొనేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు. సారా కొట్టు నుంచి సిమెంట్ పరిశ్రమ దాకా అన్నీ జగన్ కిందే ఉన్నాయన్నారు. రుషికొండ జగన్ దేనని, ఫేమా అనే సంస్థ జగన్ దేనని అన్నారు. ఎవరి దగ్గరా డబ్బు ఉండకూడదని, ఎవరు పచ్చగా ఉండకూడదని, ఎవరూ తెల్లదుస్తులు ధరించరాదనే మనస్తత్వం జగన్ సొంతమన్నారు. 


ప్రజలు బాగా పరిపాలించమని అధికారం ఇస్తే జగన్ మాత్రం ప్రజలను పీడిస్తున్నారని మండిపడ్డారు. అన్ని వర్గాలకు సమాన ప్రాతినిధ్యం ఇవ్వాలని, ఒక్క కులంతోనే పదవులు ఇస్తున్నారని, రూలింగ్ కాస్ట్ వ్యవస్థకు తాను వ్యతిరేకమని పవన్ అన్నారు. తాము పాలించడానికే ఉన్నామని జగన్ భావిస్తున్నారని, ఇతర కులాలు పాలించబడడానికే ఉన్నారనే ధోరణిలో జగన్ రెడ్డి ఉన్నారని పవన్ విమర్శించారు. అందుకు తాను, జనసేన వ్యతిరేకమన్నారు. 


కీలకమైన పదవులు అన్నీ ఒకే కులానికి అప్పగిస్తున్నారని, రాజ్యాంగానికి కట్టుబడి ఉండాల్సిన వారు కులానికి కట్టుబడి ఉంటున్నారని అన్నారు. జనసేన అధికారం ఇస్తే అన్ని కులాలకు సమాన ప్రాతినిధ్యం ఇస్తామన్నారు. జగన్ ఒక డెకాయిడ్, దొంగ అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. బడ్జెట్ ప్రజలకు తెలియకుండా ఏమీ ఉండకూడదని, కాగ్‌కు లెక్కలు చూపించకుండా వేల కోట్లు దోచేశారని విమర్శించారు.


గ్రామ స్వరాజ్యం అంటే వలంటీర్లతో గ్రామాలను నింపడం కాదని, పంచాయతీలకు స్వయం ప్రతిపత్తి కల్పించడం అన్నారు. రూ.4,500 కోట్లు పంచాయతీ నిధులు దారి మళ్లించారని, పంచాయతీలకు రావాల్సిన 1,191కోట్లను వలంటీర్లకు జీతాలుగా ఇచ్చారని ఆరోపించారు. పంచాయతీల్లో బ్లీచింగ్ పౌడర్ కొనుక్కోవడానికి నిధులు లేవన్నారు. పంచాయతీల అభివృద్ధి, స్వయం ప్రతిపత్తికి కట్టుబడి ఉన్నానని అన్నారు. కేంద్రం నుంచి నేరుగా పంచాయతీ ఖాతాల్లో నిధులు జమ చేసేలా పెద్దలతో మాట్లాడతానన్నారు.  గ్రామ సభలను బలోపేతం చేస్తామని చెప్పారు. సర్పంచ్‌లు నిధుల కోసం కోర్టులకు వెళ్లాలని జనసేన అండగా ఉంటుందన్నారు.


38 క్రిమినల్, దగుల్బాజీ కేసులు ఉన్న వాడు దౌర్జన్యాలు, స్కాములు చేసేవాడు జగన్ ముఖ్యమంత్రి అయ్యాడని తనను ప్రజలను నియంత్రగలడని ప్రశ్నించారు. వైజాగ్ అంటే పర్యావరణ కాలుష్యమని దీనిపై ఎవరు ప్రశ్నిస్తారని చెప్పారు. పరిశ్రమల పేరుతో విశాఖను ఉత్తరాంధ్ర డంపింగ్ యార్డ్ చేశారని మండిపడ్డారు. పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యాల నుంచి ఆడపిల్లల గర్భాలు పాడై పోతాయని దీనిపై ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. ప్రజలు ఆలోచించి ఓటేయకపోతే, ఎమ్మెల్యేలను ప్రశ్నించకపోతే అందరూ నష్టపోవాల్సి ఉంటుందన్నారు. 


జనసేన అధికారంలోకి రాగానే వైజాగ్ ల్యాండ్ స్కాంలు బయటకు తీస్తామని, వందల ఎకరాలు ఆక్రమించిన ఎమ్మెల్యేలు, తప్పు చేసిన ఎమ్మెల్యేలను వైజాగ్ ప్రజల ముందు దోషులుగా నిలబెడతామన్నారు. కేంద్రం ప్రభుత్వం దీనిని సీరియస్‌గా తీసుకుందని, పోరాటానికి సిద్ధంగా ఉన్నామన్నారు. మరో సారి జగన్‌కు అధికారం ఇస్తే పండుగకు ఇళ్లకు మామిడి తోరణాల బదులు జిల్లేడు తోరణాలు కట్టుకోవాల్సి వస్తుందన్నారు.


రాష్ట్రాన్ని అడ్డగోలుగా దోచుకునే వ్యక్తిని, ద్రోహం చేసే వ్యక్తిని గద్దెనెక్కించారని అన్నారు. ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, సీపీఎస్ రద్దు, స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు హామీ ఇచ్చారని వాటిని పట్టించుకోలేదన్నారు. తెలంగాణ రావడానికి జగన్ కారణమని, అక్కడ వారి వర్గం భారీగా దోపిడీలకు పాల్పడిందన్నారు. తెలంగాణ నుంచి ఆంద్రావాళ్లు రావడానికి జగన్ కారణమన్నారు. రుషికొండను అడ్డంగా తవ్వేశారని ఇదే నిదర్శనమన్నారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వుతూ రియల్ ఎస్టేట్ చేస్తున్నారని అన్నారు. దోపిడీని అడ్డుకోవాడానికి జనసేనకు అవకాశం ఇవ్వాలన్నారు. 


ఓడిపోయిన తరువాత తనకు జీవం పోసింది విశాఖపట్నం అని పవన్ అన్నారు. తనకు స్వాతంత్ర్య సమరయోధుల స్పూర్తి ఉందని భవన నిర్మాణ కార్మికుల తరఫున పోరాటం చేస్తానన్నారు. తాను ఓడిపోతే విశాఖ ప్రజలు భుజం తట్టి అక్కున చేర్చుకున్నారని అన్నారు. వారందరికీ ధన్యవాదాలు చెబుతున్నట్లు తెలిపారు. ఏదీ ఆలోచన,అవగాహన, అధ్యయనం చేయకుండా మాట్లాడనని, రాష్ట్రంలో 30 వేల మంది అమ్మాయిలు అదృశ్యం అయ్యారని తాను చెబితే ప్రతి వైసీపీ నేత తిట్టారని, ఆఖరికి చిత్తూరు జిల్లా పోలీసులు సైతం ఆధారాలు లేకుండా ఎలా మాట్లాడతారని  అడిగారని, తాను కేంద్రం నుంచి రిపోర్టులు తీసుకుని మాట్లాడానన్నారు.


హ్యూమన్ ట్రాఫికింగ్‌లో వైజాగ్ అగ్రస్థానంలో ఉందని, సీఎం జగన్ ఏం చేస్తున్నారనంటూ ప్రశ్నించారు. తాను తిట్టేకొద్ది బలపడతానన్నారు. ప్రమాదాల నివారణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు. వాలంటీర్లు తన అన్నాదమ్ములు, అక్కచెల్లెమ్మల మీద తనకు ద్వేషం లేదని, సీఎం జగన్ వారితో తప్పులు చేస్తున్నారని అన్నారు. డేటా బ్రీచ్ జరుగుతోందన్నారు. జగన్‌తో అధికారులకు ప్రమాదం ఉందని, ఐఏఎస్ అధికారులతో ప్రేమగా నటిస్తున్నారు. అన్నా, అక్క అని పిలుస్తూ జగన్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వైజాగ్‌లో తనను ఏమైనా చేసేందుకు వెనకాడలేదన్నారు.


వలంటీర్లు దోపిడీలు, హత్యలు, నేరాలకు పాల్పడతున్నారని అన్నారు. తన దగ్గర డేటా లేకుండా తాను మాట్లాడనన్నారు. రాష్ట్రంలో గంజాయి పెరిగిపోయిందని, దారుణాలకు పాల్పడ్డారని అన్నారు. విశాఖలో ఎంపీ కుటుంబాన్ని ఓ రౌడీ కిడ్నాప్ చేస్తే ఏం చేయలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. ఇలాంటి పాలన అందిస్తున్న జగన్ మరో సారి సీఎం అయితే రాష్ట్ర పరిస్థితి ఏంటన్నారు. నిత్యావసరాలు పెరిగాయని, కరెంటు బిల్లులు పెంచారని మండిపడ్డారు. జాతీయ స్థాయిలో 29 స్థానంలో ఉన్న ఆంద్ర వర్సిటీని 76 స్థానికి పడిపోయిందన్నారు. ఆంధ్రవర్సిటీని వైసీపీ కార్యాలయం చేశారని అన్నారు. సెక్యూరిటీ గంజాయి అమ్ముతున్నారని, వైసీపీ నేతల ఫంక్షన్ హాల్ అయ్యిందన్నారు.