AP POLYCET: ఆగస్టు 11 నుంచి పాలిసెట్‌ వెబ్‌ ఆప్షన్ల నమోదు, సీట్ల కేటాయింపు ఎప్పుడంటే?

ఏపీలో పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగ‌స్టు 11 నుంచి ప్రారంభంకానుంది. పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 14 వరకు ఆప్షన్లను నమోదుచేసుకోవచ్చు.

Continues below advertisement

ఏపీలో పాలిసెట్‌ ప్రవేశాలకు సంబంధించిన వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ఆగ‌స్టు 11 నుంచి ప్రారంభంకానుంది. పాలిసెట్ ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన విద్యార్థులు ఆగస్టు 14 వరకు ఆప్షన్లను నమోదుచేసుకోవచ్చు. ఒకవేళ ఆప్షన్లు మార్చుకోవాలనుకునేవారు ఆగస్టు 16న ఆప్షన్లు మార్చుకోవచ్చు. వెబ్‌ఆప్షన్లు నమోదుచేసుకున్న విద్యార్థులకు ఆగస్టు 18న సీట్లను కేటాయించనున్నారు. సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు 19 నుంచి  23 మధ్య సంబంధిత పాలిటెక్నిక్ కళాశాల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 23 నుంచి తరగతులు ప్రారంభంకానున్నాయి. పాలిసెట్ ద్వారా రాష్ట్రంలోని 84 ప్రభుత్వ, 175 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కాలేజీల్లోని 29 విభాగాల్లో 70,569 సీట్లు అందుబాటులో ఉన్నాయి.

Continues below advertisement

కౌన్సెలింగ్ వెబ్‌సైట్

షెడ్యూలు ఇలా..

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదు ప్రక్రియ ప్రారంభం: ఆగ‌స్టు 11. 

➥ వెబ్‌ ఆప్షన్ల నమోదుకు చివరితేది: ఆగస్టు 14.

➥ ఆప్షన్లు మార్చుకోవడానికి అవకాశం: ఆగస్టు 16 

➥ పాలిటెక్నిక్ సీట్ల కేటాయింపు: ఆగస్టు 18న. 

➥ కళాశాలలో రిపోర్టింగ్: ఆగస్టు 19 నుంచి  23 మధ్య.

➥ తరగతులు ప్రారంభం: ఆగస్టు 23 నుంచి. 

పాలిటెక్నిక్‌ కళాశాలల్లో ప్రవేశాలకు మే 25 నుంచి కౌన్సెలింగ్‌ ప్రారంభమైన సంగతి తెలిసిందే. పాలిసెట్ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు మే 25 నుంచి జూన్‌ 1 వరకు ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లించి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.700 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ.250 చెల్లించారు. మే 29 నుంచి జూన్‌ 5 వరకు ధ్రువపత్రాల పరిశీలన నిర్వహించనున్నారు. జూన్‌ 1 నుంచి 6 వరకు కళాశాలలు, కోర్సు ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు నమోదు చేసుకోవాలి. జూన్‌ 7న వెబ్‌ఆప్షన్లలో మార్పు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఇక జూన్ 9న సీట్లను కేటాయించాల్సి ఉండగా... కౌన్సెలింగ్‌ ప్రక్రియ మధ్యలోనే నిలిచిపోయింది. తాజాగా కౌన్సెలింగ్ ప్రారంభించారు. ఇందుకు సంబంధించిన రివైజ్డ్ షెడ్యూలును అధికారులు వెల్లడించారు. 

ఏపీలో మే 10న పాలిటెక్నిక్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(పాలిసెట్-2023)ను 61 పట్టణాలలోని 410 పరీక్ష కేంద్రాలలో పాలిసెట్ 2023 పరీక్ష నిర్వహించిన సంగతి తెలిసిందే. పాలిటెక్నిక్ ఎంట్రన్స్ పరీక్ష కోసం 1,60,329 అభ్యర్థులు నమోదు చేసుకోగా 1,43,592 మంది హాజరయ్యారు. దరఖాస్తు చేసిన వారిలో 89.56 శాతం మంది విద్యార్ధులు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. పరీక్షకు హాజరైన వారిలో బాలికలు 63,201 మంది దరఖాస్తు దారుల్లో 55,562 ఉన్నారు. 87.91 శాతం మంది బాలికలు ప్రవేశపరీక్షకు హాజరయ్యారు. 97,128 మంది బాలురకు గాను 88,030మంది ప్రవేశ పరీక్షకు హాజరయ్యారు. 90.63 శాతం మంది పరీక్షలు రాశారు. మే 20న ఫలితాలను విడుదల చేయగా.. ఫలితాల్లో 86.35 శాతం ఉత్తీర్ణులయ్యారు. 

ALSO READ:

నవోదయ పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు, చివరితేది ఎప్పుడంటే?
దేశవ్యాప్తంగా 649 జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో 2024-25 విద్యాసంవత్సరాకిగాను ఆరోతరగతి ప్రవేశాలకు సంబంధించిన ఆన్‌లైన్‌ దరఖాస్తు గడువును పొడిగించారు. అర్హులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి ఆగస్టు 17 వరకు అవకాశం కల్పించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఆగస్టు 9న ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటివరకు దరఖాస్తు చేసుకోలేకపోయిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. వచ్చే ఏడాది జనవరి 20న అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. 
ప్రవేశాలు, దరఖాస్తు వివరాల కోసం క్లిక్ చేయండి..

మరిన్ని విద్యాసంబంధ వార్తల కోసం క్లిక్ చేయండి.. 

Continues below advertisement