Oasis in Vizianagaram: భారతదేశంలో విశ్వసనీయ ఫర్టిలిటి కేర్ చెయిన్‌గా పేరు పొందిన ఒయాసిస్ ఫెర్టిలిటీ మే నెలను మదర్స్ మంత్‌గా జరుపుకుంటోంది. అందులో భాగంగా మదర్స్ డేని పురస్కరించుకొని, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వ్యాప్తంగా 30 రోజుల పాటు 30 పట్టణాల్లో 'ఒయాసిస్ జనని యాత్ర' పేరిట ఉచిత మొబైల్ ఫర్టిలిటి క్యాంప్ నిర్వహిస్తోంది. 

అందులో భాగంగా విజయనగరంలో కార్యక్రమం నిర్వహించారు. దీనికి ముఖ్య అతిథిగా ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ కుమారి, ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజినల్ మెడికల్ హెడ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధిక పొట్లూరి, ఇతర ప్రముఖులు ప్రారంభించారు.

ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేట్లు 1.7కి తగ్గడంతో - భర్తీ పరిమితి 2.1 కంటే చాలా తక్కువగా - వంధ్యత్వం పెరుగుతోంది. అయినా సరే సరైన అవగాహన లేకపోవడంతో ఇప్పుడు ప్రజారోగ్య సమస్యగా మారింది. చాలా కుటుంబాలకు సంతానోత్పత్తి చికిత్స పొందడం అంటే చాలా ఖర్చుతో కూడుకున్న విషయంగానే కాకుండా అంతకు మించిన మానసిక ఒత్తిడిగా భావిస్తుంటారు. వీటికి తోటు సుదూర నగరాలకు ప్రయాణించడం కూడా మరో పెద్ద అడ్డంకిగా మారుతోంది. ముఖ్యంగా చికిత్స నెలలుగా కొనసాగినప్పుడు ఈ సవాళ్లు మరింత ఎక్కువగా ఉంటాయి. ఇంటికి దగ్గరగా అందుబాటులో ఉన్న, అధిక-నాణ్యత సంతానోత్పత్తి సంరక్షణ కేంద్రాల అవసరాన్ని ఇవి గుర్తు చేస్తున్నాయి.  

దీనికి స్పందనగా, "ఒయాసిస్ జనని యాత్ర" అనే అవగాహన కార్యక్రమాన్ని చేపట్టింది. తరచుగా అంతా లైట్ తీసుకునే వంధ్యత్వ కారణాలు, జీవనశైలి మార్పుల ఆవశ్యకతపై అవగాహన కల్పించమే లక్ష్యంగా ఈ శిబిరం ప్రారంభించింది. ఈ ప్రత్యేకమైన అవుట్రీచ్ కార్యక్రమంలో హైదరాబాద్ నుంచి టైర్ II, టైర్ III పట్టణాలకు ప్రయాణించే అత్యాధునిక మొబైల్ ఫెర్టిలిటీ క్లినిక్ మారింది. 

ఈ కార్యక్రమంలో పునరుత్పత్తి ఆరోగ్యం గురించి ముఖ్యమైన చర్చలు నిర్వహిస్తుంది. ఇది అనుభవజ్ఞులైన సంతానోత్పత్తి నిపుణులతో ఉచిత సంప్రదింపులు, మహిళలకు ఉచిత AM, హిమోగ్లోబిన్ పరీక్షలు, ఉచిత వీర్య విశ్లేషణ, సురక్షితమైన, పరిశుభ్రమైన నమూనా సేకరణ చేస్తోంది.  

ముఖ్యంగా సంతానలేమిపై ఇంటరాక్టివ్ సెషన్స్ నిర్వహిస్తోంది. వయస్సు, ఒత్తిడి, ఆహారం, నిద్ర, పర్యావరణ విషతుల్యాలు, పిల్లలు పుట్టడంలో జాప్యం వంటి అంశాలపై అవగాహన పెంచనుంది. పురుషుల్లో వంధ్యత్వ సమస్యలు గణనీయంగా పెరగడం ఆందోళన కలిగించే అంశాలలో ఒకటి. ఆధునిక కాలపు ఒత్తిళ్లు, జీవనశైలి, పోషకాలు సరిగా తీసుకోకపోవడం, కాలుష్యాలకు గురి కావడం, డిజిటల్ ఉపకరణాలను పరిమితికి మించి ఉపయోగించడం లాంటివన్నీ దీనికి కారణాలుగా నిలుస్తున్నాయి. సంతానలేమి కేసుల్లో మగవారి అంశాలే 40-50% దాకా ఉంటున్నప్పటికీ, దాన్ని మాత్రం ప్రజలు చాలా తక్కువగానే అర్థం చేసుకున్నారు. సమాజంలో ఉన్న అపోహలు, అవగాహన లోపం కారణంగా ఈ అంశాన్ని విస్మరిస్తున్నారు.  

సైన్స్ ఆధారిత సమాచారాన్ని నేరుగా ప్రజలకు అందించడం ద్వారా ఒయాసిస్ జనని యాత్ర ప్రజల్లో ఉన్న అపో హలను తొలగిస్తోంది. జీవనశైలి సంబంధిత సంతానరాహిత్యం పెరుగుతున్న నేపథ్యంలో స్త్రీ, పురుషులకు ఈ అంశంపై సాధికారత కల్పించనుంది. వారు తమ పునరుత్పత్తి ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ముందుకు వచ్చేలా చేస్తుంది. బహుముఖ కార్యాచరణ,  పటిష్ఠ రీతిలో ప్రభుత్వ సంస్థలతో కలసి పని చేయడం ద్వారా ఈ కార్యక్రమం సహానుభూతి, ఎవిడెన్స్ బేస్డ్ సంతాన సాఫల్య పరిష్కారాలు విజయనగరం వంటి ఈ తరహా సేవలు అంతగా అందని ప్రాంతాలకు చేరుకునేలా చేస్తుంది. ఈ ప్రాంతాల్లో సంతాన సాఫల్య చికిత్సకు యాక్సెస్ పొందడం, అవగాహన లాంటి వాటిలో ఎంతో అంతరం ఉంది. 

ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ కృష్ణ కుమారి మాట్లాడుతూ, “సంతానోత్పత్తి గురించి అవగాహన పరిమితంగా ఉంది, అంతే కాకుండా అపోహలు ప్రచారంలో ఉంటున్నాయి.  అత్యంత అవసరమైన వారికి నమ్మకమైన వైద్య మార్గదర్శకత్వం అవసరం. ఈ అంతరాన్ని తగ్గించడానికి ఒయాసిస్ జనని యాత్ర మంచి ప్రయత్నం. ఇందులో భాగం కావడం సంతోషంగా ఉంది. బహిరంగంగా దీనిపై మాట్లాడుకోవడం ద్వారా  అపోహలను తొలగి జంటలు తల్లిదండ్రులగా మారేందుకు మార్గాన్ని చూపిస్తోంది. అలా  నిర్ణయాలు తీసుకునేలా చేస్తుంది.” అని అన్నారు. 

ఒయాసిస్ ఫెర్టిలిటీ రీజనల్ మెడికల్ హెడ్, ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ రాధిక మాట్లాడుతూ, ‘‘సంతానలేమి అనేది ఇకపై ఒక వైద్యపరమైన అంశం మాత్రమే కాదు. పెరిగిపోతున్న జీవనశైలి సంబంధిత ఆందోళన కూడా. పీసీఓడీ, తల్లిదండ్రులు కావడంలో జాప్యం, ఒత్తిళ్లు వంటి వాటితో ముడిపడి ఉన్న కేసులు పెరిగిపోతున్న సందర్భంలో సత్వర డయాగ్నసిస్ ఎంతో ముఖ్యం. ఒయాసిస్ జనని యాత్ర ద్వారా మేం నిపుణుల సంరక్షణను, అధునాతన సంతాన సాఫల్య పరిష్కారాలను ప్రతీ గుమ్మం వద్దకు తీసుకెళ్లగలుగుతున్నాం, మరీ ముఖ్యంగా ఈ తరహా సదుపాయాలు అంతగా అందుబాటులోలేని ప్రాంతాల్లో. తద్వారా సకాలంలో వారికి అండగా నిలుస్తూ, తల్లిదండ్రులం కావాలనే కోరిక ఫలించేలా చేస్తున్నాం. అవగాహనను అందుబాటుతో మిళితం చేయడం ద్వారా, ఆయా వ్యక్తులు తమ పునరుత్పత్తి ఆరోగ్యంపై అవగాహనతో కూడిన నిర్ణయాలు తీసుకోగలిగేలా సాధికారికతను అందిస్తున్నాం.”

ఈ కార్యక్రమం అందరికీ అందుబాటులో ఉండడం, విస్తృతశ్రేణి సంతానలేమి సవాళ్లను సక్రమంగా నిర్వహించి, లక్షకు పైగా ఆరోగ్యవంతమైన శిశువుల జననానికి కారణమైనట్టు ఓయాసిస్‌ సంస్థ చెబుతోంది. తల్లిదండ్రులు కావాలనే కలను నిజం చేసుకునేందుకు ఓ మార్గం పొందగలుగుతారు. జనని యాత్రలో చేరండి, ఇక్కడ ప్రతి ప్రయాణం కూడా ఒక ఆశతో మొదలవుతుంది అని పిలుపునిస్తోంది.